మళ్ళీ మాట్లాడుకుందాం

నిన్న ఒక స్నేహితురాలూ నేనూ కలిసి “లవ్ ఫెయిల్యూర్”  అన్న సినిమా  చూసినప్పటి నుంచి ఒకే విషయం చర్చించుకుంటూ వున్నాం. అదేమిటంటే “బ్రేక్ చేసుకోవడం”. ఆ సినిమా లో అబ్బాయిలు అమ్మాయిలూ కూడా ఈ మాట చాలా ఎక్కువగా వుపయోగించారు “బ్రేక్ ఐపోయింది”, “బ్రేక్ చేసేసుకున్నాం” అంటూ. వాళ్ళు బ్రేక్ చేసేసుకుంటున్నది వాళ్ళ వాళ్ళ ఎఫైర్స్ ని అనమాట. వాళ్ళు చాల సునాయాసంగా ఆ మాటని వుపయోగించడం చూస్తుంటే ఎంతో చిత్రంగా అనిపించింది. అందుకే ఇంటికొచ్చాక కూడా ఆ విషయమే మాట్లాడుకుంటూ వుండిపోయాం.

వాళ్ళంతా బాగా డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చి, బాగానే చదువులు చదువు కున్నవాళ్ళు. సాఫ్ట్ వేర్  లాంటి కొత్త సంస్కృతి కి చెందిన కార్యాలయాలలో వుద్యోగాలు కూడా చేస్తున్నవాళ్లు. వాళ్ళు ఒకరితో ఒకరు పరిచయాలు చేసుకోవడమూ, వాటిని ప్రేమలు గా మార్చుకోవడమూ, ఎక్కడో ఏదో తేడారాగానే  ఆ ప్రేమ సంబంధాన్ని బ్రేక్ చేసేసుకోవడమ్, కొద్ది కాలం గడవగానే మరో సంబంధం లోకి తాజా గా వెళ్లడమ్, ఇదంతా ఎంతో సహజమైన విషయం లా మనల్ని నమ్మింపజూసారు.

అది మా ఇద్దరికీ కొరుకుడు పడలేదు. తరం తాలూకు అంతరం ఒక కారణం అనుకున్నా అది చాలా చిన్న కారణం. పెద్ద కారణం ఏమిటంటే ఇటువంటి సాఫ్ట్ వేర్ నాగరికత సమాజమంతా విస్తరించి లేదు. చాలా పరిమితం గా వున్న సమాజం లోనే వుంది. అలాంటి నాగరికత మంచిదా, చెడ్డదా అన్నది వేరే విషయం.

మిగిలిన సమాజం అంతటా ఇంకా ఆడవాళ్ళు శరీరాలు గానూ, తినుబండారాలు గానూ  చూడబడుతు వున్నారు. పేద,మధ్య తరగతి స్త్రీలకి శారీరక హింస, మానసిక హింసలు  ఇంకా యధాప్రకారంగా కొనసాగు తూనే వున్నాయి. నిత్యమూ మన చుట్టుపక్కల జరిగే ఎన్నో సంఘటనలు మీడియాలలో చూపిస్తున్నది నిజమే అని రుజువు చేస్తున్నాయి.

అలాంటి హింసని తీవ్రం గా నిరసిస్తూ తీసిన ఒక సినిమా చూసానీమధ్య. అద్దేపల్లి జ్యోతి అనే సాహితీ మిత్రురాలి ఆహ్వానం మీద, ఆమె ఆహ్వానం ఎందుకంటే ఆమె ఆ సినిమా కి ఒక పాట రాసారు “ఆగస్టు పదిహేను –అర్ధరాత్రి” అన్న పేరున్న ఆసినిమా ను భాస్కర్ అనే ఒక యువకుడు తీసాడు.విడుదల రోజే మరో ధియేటర్ లో స్పెషల్ గా చూపెట్టారు.హాల్ అంతానిండుగా జనం.కానీ సినిమా చూస్తున్న రెండు గంటల సేపూఏదో ఒక కామెంట్ వినిపిస్తూనే వుంది హాల్ లో.నాతొ పాటు మా బంధువుల కుర్రవాడు( సాఫ్ట్ వేర్ ఇంజనీర్ )కూడా వచ్చాడు. ఆ అబ్బాయి సినిమా చుస్తున్నంతసేపూ అసహనంగా కూర్చున్నాడు. ఐపోయాక ,బయటికి వచ్చాక “అబ్బ నాకు కడుపులో తిప్పేసింది” అన్నాడు. అతని లాంటి వున్నత వర్గాల యువకులకు తెలియని, అట్టడుగు వర్గాలస్త్రీ ల మీద జరిగే అత్యాచారాల,హింసలే ఆ సినిమా అంతాను.

నాకు కూడా మనసంతా కకా వికలం ఐపోయింది . సాధికారత కోసం ఇళ్లువిడిచి బయటికొచ్చిన స్త్రీల మీద సమాజం లో ఏదో ఒక రూపం లో అత్యాచారం జరుగుతూనేవుంది. దారుణమైన హింస అనుభవిస్తూనే వున్నారు. వాళ్ళంతా  అంగ బలం, అర్ధబలం లేనివాళ్ళు.ఏదో విధంగా తాము తమ గౌరవం కాపాడుకుంటూ ఈ సమాజం లో నిలదొక్కుకోవాలని తాపత్రయపడేవాళ్ళు. కానీ వాళ్ళంతా రక రకాలు గా హింసించ బడుతున్నారు. ముఖ్యంగా లైంగిక హింస. అదంతా ఆ దర్శకుడు ఆ సినిమా లో చూపించాడు.కాముక కోణాన్ని అతిగా చూపించిన ధోరణి కూడా వుంది. అది అనవసరమే. ఐతే సమాజం లో బయటి ప్రపంచం లో అడుగు పెట్టిన ఆడవాళ్ళ భద్రతా రాహిత్యం గురించి మాత్రం భయం కలేగేలా చెప్పాడు.వున్నదున్నట్టే.

బ్రేక్ చేసుకున్నాం అని మాట్లాడుకునే పరిమిత వర్గానికి ఈ సమాజం తాలూకు వికృత రూపం గురించి ఎక్కువ తెలియదేమో అనిపించింది. కారణం వాళ్ళు వాళ్ళ గురించి తప్ప మిగిలిన సమాజం పట్ల ఉపేక్ష తో  వుండడమే.

ఆ సినిమా చూసాక నాకు ఒక విషయం బలంగా అర్ధమైంది. పూర్వం రోజుల్లో స్త్రీలు ఇళ్ళల్లో ఉండిపోయి అక్కడ అణచివేతలకి, హింసలకి, గురి ఐయ్యారని బాధ పడ్డాం. అలాగని బయటికి వచ్చి తమ జీవితాన్ని నిర్మించు కోడానికి ప్రయత్నిస్తుంటే మరింత ఎక్కువ హింసల పాలవుతున్నారు. ఏది దారి ? అనిపించింది.

అందుకే మేధావులంతా దీనికంతటికీ చదువు,విజ్ఞాన సముపార్జనే పరిష్కారాలు గా చెప్పేరని అనిపించింది. మనుషుల లోంచి మానవత్వాన్ని నిద్ర లేపడమే ప్రధాన కర్తవ్యమని వారంతా అనేక విధాలుగా గగ్గోలు పెట్టేరని అనిపించింది. పేదరికం పోవాలని, అక్షరాస్యులవ్వాలని చేసిన, చేస్తున్న బోధలు అందుకే అనిపించింది .

 అంతవరకూ ఎన్ని చట్టాలు చేసినా ఈ స్త్రీల మీద జరిగే లైంగిక హింసలు ఆగవేమో అనిపించి ఎంతో దుఃఖం కలిగింది.

                          ఎవరికి చెప్పాలి? చదవండి, ఆలోచించండి , మనుషులుగా ప్రవర్తించండి, అని ???

                                                                                        –  వాడ్రేవు వీరలక్ష్మీదేవి

Uncategorized, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)