ప్రవాసాం ధ్ర భాషా జీవ నాడి – తెలుగు నాడి

(ఉత్తర అమెరికాలో – ఉన్నత సాహిత్య ప్రమాణాలతో  – మేలైన కాగితం మీద  ప్రచురింపబడుతున్న “తెలుగునాడి” పత్రిక గురించి పరిచయ వ్యాసం ఇది.)

నిన్నా మొన్న మొదలైనట్టుగా వున్న పిల్లల స్కూల్ ఇయర్ ఇంకో నెల రోజుల్లో తరగతి  మార్చుకోవడానికి పరుగులు తీస్తోంది.  బడులలో పరీక్షల హడావిడి, వర్షాంతపు వేడుకల సందడితో మార్చ్ 21 న మొదలైన ఉత్తర అమెరికా వసంత కాలం  తన ఉత్సాహాన్ని ఈ బడి ఉత్సవాల్లో నింపినట్టు అనిపిస్తోంది. ఈ కోలాహలాన్నంతా చూస్తూ ప్రతీ సారి  లాగే మళ్ళీ ఒక్కసారి గడిచిపోయిన బడి రోజులు, వేసవి శలవులని గుర్తు చేసుకున్నాను. ప్రస్తుతానికి జరుగుతున్న కాలాన్ని- ఆట్టే శ్రమ పడకుండానే లభించే చిన్ని చిన్ని ఆనందాలని ప్రోగు చేసుకుంటూ – అనుభవిస్తూ, ఆస్వాదిస్తున్నా వెనకటి రోజులు తలచుకున్నప్పుడు మళ్ళీ మనసు ఉత్సాహపు క్రొత్త చిగుర్లు వేస్తున్నట్టే అనిపిస్తుంది. 

వేసవి కాలం వస్తూనే రోజుని పెద్దది చేసి, బడి సమయాన్ని చిన్నదిగా చేసేది – ఒంటి పూట బడులతో. ఆ ఎండ వేళల మధ్యాహ్నాల ఎండ వేడిని తెలియనీయకుండా “బాల మిత్రులతో” “చందమామ” వెన్నెల్లో కట్టిన “బొమ్మరిల్లులతో” మొదలుపెట్టి వేసవి శలవులలో నాన్నమ్మ కి చదివి వినిపించే ఆంద్ర పత్రిక ధారావాహికల దాకా  పుస్తక  పఠనా ప్రస్థానం జరిగిపోతూ వుండేది.   

అమ్మ, నాన్నలు ఇరుగు పొరుగు వారితో చెప్తుంటే విని, నేర్చుకున్న “ఇంటికి” అనే మాటని ఆరిందాలా వాడుతూ, శ్రీ రామ నవమి పందిరిలో నాలుగు స్తంభాలాట ఆడుతూ “మేము వచ్చే ఆదివారం ఇంటికి వెళ్తున్నామోచ్” అని అరుచుకుంటూ, ఎప్పుడెప్పుడా అని రోజులు లెక్కపెట్టుకుంటూ ఆ “ఆదివారం” రాగానే బస్సెక్కి కోనసీమ లో మా పెదనాన్నగారింటికి వెళ్ళడం వేసంకాలపు వెచ్చనైన జ్ఞాపకం. మా పెదనాన్నగారు రెండు తెలుగు దినపత్రికలు, ఆంగ్ల దినపత్రిక – ది హిందూ,  పిల్లలకి చందమామ, పెద్దలకి ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ వార పత్రికలు, స్వాతి, యువ మాస పత్రికలు, ఇంట్లో కాలేజ్ వయసు పిల్లలు చదవడానికి సితార, జ్యోతి చిత్ర తెప్పించే వారు. ఇవి కాక ఇంటి అలమారుల్లో ఎన్నో గ్రంథాలు, నవలలు…ఇవి, అవి అని కాకుండా అన్ని వయసుల వారికీ, అభిరుచులకి తగిన పుస్తకాలు ఉండేవి. బహుశా …అప్పుడే పుస్తకాలతో నా చెలిమి మొదలయిందేమో. 

ఇంట్లో నలుగురం- నాన్నమ్మ, నాన్న, శ్రీనన్న, నేను – శుక్రవారం కోసం తెగ ఎదురు చూసేవారం. ఆరోజు వార పత్రికలు నాలుగు వచ్చే రోజు. పేపర్ అబ్బాయి వచ్చే సమయానికి ఎవరు అరుగు మీద  వుంటే వాళ్లకి దక్కే అక్షరాలా అక్షరాల పెన్నిధి. సాధారణంగా నేనో, శ్రీనన్నో వుండేవాళ్ళం. శ్రీనన్న వున్న రోజున తను తన చేతికి వచ్చిన అన్ని పుస్తకాలని ఒక దాని మీద ఒకటి దొంతరగా పెట్టుకుని సావిట్లో పడక్కుర్చీలో కూర్చుని గబా గబా కళ్ళజోడు సర్దుకుంటూ “శ్రీ రామ నుంచి చిత్తగించవలెను” దాకా అన్నట్టు అట్ట మీద బొమ్మ మొదలు ఆఖరి పేజీ రీటా ప్రకటన దాకా చదివితే గానీ ఒక్కో పుస్తకం ఇచ్చేవాడు కాదు. తను ఒక పుస్తకం చదివి ఇవ్వగానే ఆ క్రొత్త కాగితాల కానుకని  తెరిచి ముక్కు మధ్య పేజీ లో పెట్టి గాఠిగా వాసన పీల్చి అరమోడ్పు కన్నులతో పుస్తకం తెరిస్తే ప్రక్కనే పెట్టిన ప్లేట్లో తరిగే జంతికల, దేవుడి పెళ్లి గారెల సాక్షిగా పుస్తక పఠనోత్సవం సాగేది.

అలా మొదలుపెట్టిన పుస్తకాలతో నా  స్నేహం నిరాటంకంగా సాగింది 2000 సంవత్సరం వరకూ. తేట తెలుగుతో బాటు ఇష్టం గా నేర్చుకున్న (నేర్చుకోగలిగిన) కన్నడ కస్తూరి ఘుమ ఘుమలూ, ఆంగ్ల సాహిత్యమూ  ఆస్వాదిస్తూ వున్న సమయంలో మాతృదేశం వదిలేయడమే కాక మాతృ భాష లో పుస్తకం చదవగలిగే అవకాశం దూరమయింది – ఉద్యోగ నిమిత్తం వలస రావడం వల్ల. ఉత్తర అమెరికా వచ్చిన క్రొత్తలో అంతర్జాలం లో వెతుకుతూ వుంటే సిడ్నీ – ఆస్ట్రేలియా నుంచి భాస్కర రావు గారు నడిపే ఈ-పత్రిక కనిపించింది ఒకసారి. అంతే – పోగొట్టుకున్న ప్రియమైనదేదో దొరికిన భావన. ఒక్కో కథని, వ్యాసాన్ని గబగబా చదివేస్తే తొందరగా అయిపోతాయి అని రోజుకి ఇంతే చదవాలి అనుకుని కొంచెం కొంచెం గా చదివేదాన్ని. ఆన్లైన్ లో ఎంత చదివినా పుస్తక స్పర్శ లేని లోటు లోటుగానే వుండేది. 

2005 లో అనుకోకుండా మిత్రులని కలవడానికి షికాగో వెళ్ళినప్పుడు అక్కడ అందమైన పరికిణీ-ఓణీ  వేసుకున్న ఆడపిల్లలాంటి, క్రొత్త పెళ్లి కూతురులాంటి, పండు ముత్తైదువ లాంటి, పూలతో నిండిన చెట్టులాంటి – ఇన్ని విశేషణాలు చెప్తున్నానంటే ఎంతో అపురూపమయినది కనిపించి వుంటుంది అని మీకనిపిస్తోంది కదూ 🙂 అవును – ఫెళ ఫెళ లాడే కాగితాలతో, బోల్డన్ని కథలూ కబుర్లతో ముస్తాబయిన “తెలుగు నాడి” అనే అమెరికా తెలుగు పత్రిక కనిపించింది. వెంటనే అస్సలు మొహమాట పడకుండా అడిగి తెచ్చేసుకున్నాను మా ఇంటికి.  అప్పటినుంచీ ఇప్పటిదాకా మా ఇంటి తేనీటి బల్ల తెలుగు నాడ్యాలంకృతయై భాసిస్తూనే వుంది.

2005 నుంచి 2009 దాకా తెలుగునాడి జంపాల చౌదరి గారి సంపాదకత్వం లో వెలువడేది. ఉత్తర అమెరికాలో తెలుగు వారు చాలా మందే వున్నా- తెలుగునాడి గురించి అంతగా ఎవరికీ తెలియకపోవడం వల్ల, తగినంతమంది  చందాదారులు చేరకపోవడం వల్ల, ఆర్ధికంగా ప్రోత్సాహం లేక – కృష్ణుడు కర్ణుడి మరణానికి “నా చేతను …నీ చేతను…వరమడిగిన కుంతి చేతను…” అని చెప్పినట్లు అనేక కారణాల వల్ల 2009 జూన్ నెలలో తెలుగునాడి నిలిపివేశారు. అప్పుడే చిగురులు వేస్తున్న తెలుగు మొక్కకి నీరందక వాడినట్టు అయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 2009 నుంచీ కృష్ణ కుమార్ గారి సారధ్యంలో, వాసిరెడ్డి నవీన్ గారి సంపాదకత్వంలో తెలుగునాడి పునరుద్ధరింపబడింది – ద్వైమాసిక పత్రికగా. 

ఇంతకీ తెలుగునాడి లో ఏమేమి విశేషాలుంటాయో నేను చెప్పనేలేదు కదూ…సరే మరి… ఈ క్రింది జాబితా చూసేయండి మీకే తెలుస్తుంది….

*ప్రత్యేక వ్యాసం  – మన రాష్ట్రంలో, రాజధానిలో ఏదో ఒక ప్రదేశాన్ని/ సంస్థని /  విశేషాన్ని గురించి అన్ని వివరాలతో ఆసక్తికరమైన పరిచయం

*శ్రీధర్ గారి రాజకీయ కార్టూన్లు

*రాజకీయ నాడి – రాష్ట్ర ప్రస్తుత రాజకీయ వేదిక గురించి వేడియైన, వాడియైన వ్యాసం

*వ్యక్తిగతం – మన రాష్ట్రంలో పుట్టి  జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన గొప్ప వ్యక్తుల

పరిచయం

*కథలు – ముచ్చటగా మూడు – రాష్ట్ర వాసులైన రచయితలు వ్రాసే కథ ఒకటి; ప్రవాసాంధ్ర ప్రముఖులు వ్రాసే “అమెరికా కథ”;  పాత పరిమళాలని మళ్ళీ నెనపుకి తెచ్చే “అలనాటి కథ”

*సరదా గళ్ళు – మెదడుకి పదును పెట్టే తెలుగు పదబంధం 

*బాలల కోసం – తాత్పర్య సహిత సుమతీ శతక పద్యం; ఒక తెలుగు సామెత – అది ఎందుకు, ఎలా

వాడుకలోకి వచ్చిందీ; ఒక నీతి కథ; “పాటలంటే మాకిష్టం” అంటూ ఆటలలో పిల్లలు పాడుకునే పాట;

ఒక బుజ్జి పాపడి స్వగతాలతో “బాల కార్టూను”

*నవ్వుకుందాం – అంటూ సరదాగా నవ్వించే హాస్యపు చెణుకులు 

*పాపినేని శివశంకర్ గారు నిర్వహించే నెల నెలా ఒక పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక

*ధర్మ సందేహాలు – రామాయణ, మహాభారత, భాగవతాల గూర్చిన సందేహాల గురించి మల్లాది చంద్ర

శేఖర శాస్త్రి గారి సమాధానాలు .

*బూదరాజు రామకృష్ణ గారు నిర్వహించే తెలుగు మాటలను, జాతీయాలను పరిచయం చేసే శీర్షిక 

*నవలా పరిచయం – శీర్షికన పాత, క్రొత్త నవలా సమీక్షలు

*నివాళి – కీర్తిశేషులైన ప్రముఖుల ప్రస్తావన 

*కదిలే బొమ్మల కబుర్లు – సినిమా ప్రియులని అలరించే చలన చిత్ర విశేషాలు

*సినిమా సమీక్షలు

*కూనిరాగం – ఆపాత మధురాలలోని ఒక ఆణిముత్యం లాంటి పాట 

*ఇంకా బాపు గారి కార్టూన్లు…..

ఆంధ్ర దేశంలో వెలువడే అన్ని దిన, వార, మాస పత్రికలలోని ఆణిముత్యాలలాంటి కథలు, వ్యాసాల

సమాహారంగా వెలువడే “తెలుగునాడి” నాలాంటి పుస్తక స్పర్శా ప్రియులకి దాచుకోవలసిన పెన్నిధిలా

అనిపిస్తుంది. 

నేను చదివే ఒక మంచి ప్రవాసాంధ్ర పత్రిక గురించి నలుగురికీ తెలియజేస్తే-

ఆ నలుగురు పదుగురికి చెప్తే-

పదుగురు వందలై, వేలై-

ఒక్కొక్క చందా ఒక్కో క్రొత్త ఊపిరిగా-

నాలుగు కాలాల పాటు 

“తెలుగు నాడి” ప్రవాసాంధ్ర భాషా జీవ నాడై నిలుస్తుందనే ఆశతోనే నా ఈ “ఉడతా భక్తి” పరిచయ

ప్రయత్నం.

                                                          

                                                                                                       – లలితాTS

వ్యాసాలు, , , , , , , , , , Permalink

6 Responses to ప్రవాసాం ధ్ర భాషా జీవ నాడి – తెలుగు నాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో