జనాజా

అమ్మ… అమ్మ… అని

ఆక్రోశించింది హృదయం

కానరాదేమని కలవరించిన కళ్ళు

ఇక రాదనీ తెలిసి తెల్లబోయిన మనస్సు

చివరిసారిగా తెలిసింది అమ్మ మనసు

చెయ్యి చాచిన నేను తెలుసుకోలేదు

నన్ను వదిలి వెళ్ళాలని లేదని

జన్నత్ కే వెళ్లి తల్లిదండ్రుల వొడిలో వోలలాడేవో

చెల్లీ తమ్ముడుతో ముద్దుమురిపాలలో తేలియాడావో

ఇక్కడ నీ బిడ్డల కన్నీరు ఎవరు తుడుస్తారమ్మా

పాలబంధం తెంచుకున్నారు

వాళ్ళతో పని ఏమిటి అనుకోకమ్మా

నోటితో ఆ మాట అన్నామేకాని

మనసంతా నీ జ్ఞాపకాల బంధాలేనమ్మా

మా పాశంకన్నా  యమపాశమే జయించింది

జహాజ్ ఎక్కి వెళ్ళిన అమ్మ తిరిగి వస్తుంది

జనాజా ఎక్కి వెళ్ళిన అమ్మ తిరిగి వచ్చేనా

                                                                                                – మున్వరున్నీసా 

కవితలు, , , , , , , , Permalink

One Response to జనాజా

  1. sowmya says:

    really mother is great person in life . nice poem .