కౌమార బాలికల ఆరోగ్యం

5. సంప్రదింపులు :

*           సంప్రదింపులు మనుషులు సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, ఘర్షణల్ని తగ్గించుకోవడానికి, సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయి.

*           ఇరువురు వ్యక్తులకూ పట్టువిడుపులు వుండడం సంప్రదింపులకు అవసరం.

*           ఒక సమస్యను తొలిథలోనే పరిష్కరించాలనుకుంటే సంప్రదింపుల పద్ధతి విజయవంతమవుతుంది.

*           సమర్ధవంతంగా సంప్రదింపులు జరపడానికి కొన్ని నైపుణ్యాలు అవసరం. అవి:

                – అ) వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించడం,  సరైన హావభావాల వ్యక్తీకరణ

                – ఆ) చక్కగా మాట్లాడడం

                – ఇ) తనను తాను ఎదుటివారి స్థానంలో వున్నట్లు ఊహించుకోవడం

                – ఈ) ఒక పరిస్థితిని కూలంకషంగా అన్నివైపుల నుండి అంచనా వేయడం

                – ఉ) ఒక పరస్పర అంగీకారానికి రావడం

*           సంప్రదింపులు జరిపేటప్పుడు ఏ ప్రత్యామ్నాయాలను అంగీకరించవచ్చో, ఏ అంశాలతో రాజీపడకూడదో నిర్ణయించుకోవాలి.

*           అనేక సంబంధ బాంధవ్యాలను, లైంగిక సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు.

6. ఇతరులతో సంబంధాలను పెంపొందించుకునే నైపుణ్యం :

          ఇతరులకు మనకు మధ్య వున్న సంబంధాలను అర్ధం చేసుకోవటానికి సహాయపడే నైపుణ్యం, పరస్పర సానుకూల బాంధవ్యాలను నిర్మించుకునే నైపుణ్యం స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ  సవ్యమైన సంబంధాలను నిర్మించుకోవడానికి, అవసరంలేని, నష్టం కలిగించే సంబంధాలను వదిలించు కోవడానికి సహాయపడతాయి.

7. స్వీయ అవగాహన :

          మన గురించి మనం తెలుసుకోవడం, మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, కోరికలు, అయిష్టాల్ని గుర్తించడం సమర్ధమైన భావ వ్యక్తీకరణకు, పరస్పర సంబంధాలకు, సహానుభూతిని పెంపొందించుకోవడానికి తప్పనిసరి.

8. సహానుభూతి :

        మనకు తెలియని, పరిచితంకాని, జీవిత సందర్భమయినా సరే, ఇతరుల జీవితం ఎలాగడుస్తూందో ఊహించగల నైపుణ్యం. ఇది ఇతరుల్ని అర్ధం చేసుకోవడానికి, వారి ప్రవర్తన భిన్నంగా వున్నప్పటికి వారిని స్వీకరించడానికి సహాయపడుతుంది.

                        ”హృదయం నిండా ప్రేమ ఉంటే జీవితం నిండా ఆనందం ఉటుంది” – సత్య సాయిబాబా

11. జననాంగ ఇన్ఫెక్షన్లు రకాలు :       

                1.  లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు

                2.  ఇతర రకాలుగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు :

            అ) యోనిలో సహజంగా ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు మామూలుగాకంటే అతిగా పెరగడం వలన వచ్చే ఇన్ఫెక్షన్లు.

            ఆ) సరైన పరిశుభ్రత, ఇన్ఫెక్షన్‌ని నివారించే ఇతర జాగ్రత్తల్ని తీసుకోకుండా ఆరోగ్య సిబ్బంది ప్రసవాలు, గర్భవిచ్ఛిత్తిలు నిర్వహించడం, లూప్‌ని పెట్టడం, పెల్విక్‌ పరీక్షలు చెయ్యడం మొదలైన కారణాలవల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు.

లైంగిక వ్యాధులు:

                లైంగిక సంపర్కం ద్వారా ఒక వ్యక్తినుండి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధుల్ని ‘లైంగిక వ్యాధులు’ అని అంటారు. లైంగిక వ్యాధులు జననాంగ ఇన్ఫెక్షన్లలో ఒకభాగం.

తరుచుగా సోకే లైంగిక వ్యాధులు

              1. గనేరియా, 2.సిఫిలిస్‌, 3.క్లమీడియా, 4.ట్రైకోమోనియాసిస్‌ , 5.హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ ,6. హెర్పిస్‌ , 7.హెపటైటిస్‌-బి, 8. హెచ్‌.ఐ.వి.

లైంగిక వ్యాధులు సోకడానికి కారణాలు

అ) ప్రధాన కారణాలు :

1. ఎక్కువమందితో లైంగిక సంబంధాలు

2. ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న వ్యక్తితో లైంగిక సంపర్కం.

లైంగిక వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి ?

1. ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యకితో లైంగిక సంపర్కం

2. ఇన్ఫెక్షన్‌ ఉన్నవ్యక్తి రక్తాన్ని ఇన్ఫెక్షన్‌ లేని వ్యక్త్తికి ఎక్కించడం

3. స్టెరిలైజ్‌ చెయ్యని బ్లేడుల్ని, సూదుల్ని, సిరంజిల్ని వాడడం.

4. ఇన్ఫెక్షన్‌ ఉన్నతల్లినుండి గర్భస్థ శిశువుకి

కౌమార బాలికలు – లైంగిక వ్యాధులు

కౌమార బాలికలకు అదే వయసు బాలురకంటే, పెద్ద వయసు స్త్రీలకంటే ఎందుకు ఎక్కువగా లైంగిక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది ?

1. శరీరధర్మాలు, నిర్మాణం : బాలిక గర్భాశయపు క్రింది భాగం సర్విక్స్‌ ఇంకా పూర్తిస్థాయికి ఎదగదు. దాని బయటి ద్వారం చుట్టూ ఉండే ప్రత్యేక కణాల పరిధి స్త్రీలలో సర్విక్స్‌ మార్గం లోపలికి ఉంటుంది. కాని బాలికలకు ఈ పొర బయటికి ఉండడం వలన ఈ పొరకణాల  ద్వారా రోగక్రిములు సులభంగా వారి శరీరంలో చేరతాయి. యోనిలోపలి పొరకూడా బాలికలకు ఇంకా పూర్తిస్థాయిలో ఎదగదు. పలచగా తక్కువ కణ వరుసలు ఉండే ఈ పొర రోగక్రిముల ప్రవేశాన్ని అడ్డుకోలేదు. ఇన్ఫెక్షన్‌ నుండి భౌతిక, ఇమ్యునొలాజికల్‌ రక్షణ నివ్వగల జిగురులాగా ఉండే యోని స్రావం బాలికలకు తక్కువగానూ, పలచగానూ ఉంటుంది.

2. సమాచారం : తమ శరీరనిర్మాణం, ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణం, విధులు, తమకు రాగల వ్యాధులు, వాటికి కారణాలు మొదలైన వాటిగురించి సరైన సమాచారం లభించక పోవడంవల్ల బాలికలు తగిన జాగ్రత్తలు తీసుకోక వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి.

3. జెండర్‌ అసమానత : జెండర్‌ అసమానత, కుటుంబంలోనూ, సమాజంలోనూ తక్కువస్థాయి కారణంగా కౌమారబాలికలు సులభంగా ఈ వ్యాధులకు గురవుతున్నారు.

4. సామాజిక బలహీనత : సామాజిక బలహీనత కారణంగా కౌమారబాలికలు లైంగిక అత్యాచారాలకు గురవడం వలన లైంగిక వ్యాధులు సోకుతున్నాయి.

5. ఆర్థిక బలహీనత : దారిద్య్రం, ఇతరులపై ఆధారపడి బ్రతకడం వలన చాలామంది బాలికలకు, స్త్రీలకు తమ శరీరంవిూద, లైంగిక కార్యకలాపాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు మొదలైన వాటివిూద నియంత్రణ ఉండదు. కూడు, గూడు, గుడ్డలాంటి తక్షణ కనీస  మానవ అవసరాలు రక్షితసెక్స్‌ గురించి, నైతిక విలువల గురించి పట్టించుకోనివ్వవు.

6. సామాజిక నియమాలు : కొన్ని సందర్భాలలో సామాజిక నియమాలు అరక్షిత పరిస్థితులలో కౌమారబాలికలు లైంగిక జీవితం గడపడాన్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని సంస్కృతులలో బాల్యవివాహాల కారణంగా బాలికలు చిన్న వయసులోనే సెక్స్‌ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.మరికొన్ని సంస్కృతులలో అవివాహిత బాలికల్ని వారి స్నేహితులు లైంగిక సంపర్కం కోసం ఒత్తిడి చేస్తున్నారు. సామాజిక నియమాలు బాలబాలికలకు సెక్స్‌ గురించి నమ్మకమైన, ఖచ్ఛితమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాల్ని ఇవ్వవు. చాలా సమాజాలలో సెక్స్‌ గురించి మాట్లాడడం తప్పు. చాలా లైంగిక వ్యాధుల్ని చికిత్సతో నయం చెయ్యవచ్చు. కాని సిగ్గు, భయం, సంకోచం వారిని సరైన సమయంలో చికిత్స చేయించుకోనివ్వవు.

కౌమార బాలికలపై లైంగికవ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు :

1. ఖచ్చితమైన, నమ్మకమైన సమాచారం 2. వివక్ష నుండి రక్షణ 3. అనుకూల ప్రభుత్వ పాలసీలు 4. తగిన ఆరోగ్యసేవలు 5. సమాజంలో మార్పులు

లైంగిక వ్యాధులు – దీర్ఘకాలిక పరిణామాలు :

1. పొత్తి కడుపులో, నడుములో నొప్పి, 2. సంతానం కలగని స్థితి 3. గర్భస్థ శిశువుకు అంగవైకల్యాలు 4. గర్భంలోపల లేక పుట్టగానే శిశువు చనిపోవడం 5. గర్భస్రావాలు 6. నెలలు నిండకముందే ప్రసవాలు 7. ‘ఎక్టాపిక్‌ ప్రెగ్నెన్సీ’ 8. హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌ 9. జననాంగ వ్యవస్థకు కాన్సర్లు

ఎ లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌ వచ్చే ప్రమాదం 10 రెట్లు ఎక్కువ. ఎ లైంగిక వ్యాధుల నివారణ :

1. తగిన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కౌమార బాలలు పెంపొందించుకోవాలి. కౌమార బాలలు క్షణికోద్రేకంతో తీర్చుకునే సెక్సు కోరికలను సమాజం అనుమతించదు.

2. బూతు పుస్తకాలు, నీలి సినిమాలు, నగ్నప్రదర్శనలు, బూతు పాటలు, ‘సెక్స్‌’ని గురించి స్నేహితులతో చర్చించడం లైంగిక కోరికల్ని ఎక్కువచేస్తాయి కనుక వాటికి దూరంగా ఉండాలి.

3. ఒకే ఒక్క భాగస్వామితో విశ్వసనీయమైన లైంగిక సంబంధం ఉండాలి. ఆ లైంగిక భాగస్వామికి వేరెవరితోనూ లైంగిక సంబంధాలు ఉండకూడదు.

4. లైంగిక కలయికలో తప్పనిసరిగా కండోమ్‌ని వాడడం వలన, సక్రమంగా కండోమ్‌ని ఎలావాడాలో తెలుసుకోవడం వలన వ్యాధి అరికట్టబడుతుంది.

5. పరీక్షించిన, వ్యాధి క్రిములులేని రక్తాన్నే అవసరపడినప్పుడు ఎక్కించుకోవాలి.

6. గర్భవతికి ఇన్ఫెక్షన్‌ వస్తే తక్షణం చికిత్స చేయించుకోవాలి.

ఒక వ్యక్తికి లైంగికవ్యాధి ఉన్నప్పటికీ లక్షణాలేవిూ ఉండకపోవచ్చు, పైకి ఆరోగ్యంగా ఉన్నట్లుగానే కనిపించవచ్చు. అందుచేత తను లైంగిక సంపర్కంపొందే వ్యక్తికి లైంగికవ్యాధి ఉందో లేదో తెలుసుకోవడం కష్టం.

విశ్వాస పాత్రమైన లైంగిక సంబంధాల్ని కలిగి ఉండడమే ఈ వ్యాధుల నివారణకు ఉత్తమమార్గం.

లైంగిక వ్యాధులు – చికిత్స:

1. హెచ్‌.ఐ.వి., మరికొన్ని వైరస్‌ ఇన్ఫెక్షన్లకు తప్ప మిగతా అన్ని లైంగిక వ్యాధుల్ని నయం చెయ్యడానికి మందులు ఉన్నాయి.

2. వ్యాధి సోకాక సాధ్యమైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించాలి.

3. ఇన్ఫెక్షన్‌ ఉన్నవ్యక్తితోపాటు అతని / ఆమె యొక్క భార్య / భర్త కూడా చికిత్స చేయించుకోవాలి. వారితో లైంగిక సంబంధాలు ఉన్నవ్యక్తులందరూ అదే సమయంలో చికిత్స చేయించుకోవాలి.

4. వాడవలసినమందుల్ని సూచించిన మోతాదులో సూచించినంతకాలం వాడాలి.

5. మందుల్ని వాడినంతకాలం సెక్స్‌లోపాల్గొనగూడదు లేక కండోమ్‌ని ఉపయోగిస్తూ మాత్రమే సెక్స్‌లో పాల్గోవాలి.

12. హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌

హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌ – పేద దేశాలలో ఆర్థిక, సామాజిక ప్రభావాలు :

1.  పిల్లల్ని, వృద్ధుల్ని సంరక్షించవలసిన ఉత్పత్తిదాయక వయసు వారు ఈ వ్యాధికి గురవడం వలన కుటుంబంలో ఒకరుగాని, ఇద్దరుగాని ఈ వ్యాధిపీడితులయితే ఆ కుటుంబానికి వివిధ కోణాలలో జరిగే నష్టం అపారం.

2.  హెచ్‌.ఐ.వి. ఎయిడ్స్‌రోగుల్ని సమాజంవెలివేయడం.

3. ఎయిడ్స్‌ వ్యాధిసోకిన తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతల్ని నిర్వహించలేని అశక్తులయినప్పుడు వారి పిల్లలు తమ చదువుల్ని మానేసి బాలకార్మికులై తమ లేలేత భుజాలపైకి కుటుంబభారాన్ని ఎత్తుకుంటారు.

4. ఎయిడ్స్‌ వ్యాధి మిలియన్లమంది పిల్లల్ని తల్లిదండ్రులు లేని అనాధల్ని చేస్తుంది. ఇప్పటికే 100 మిలియన్లకు పైగా ఉన్న వీధి బాలల సంఖ్యను మరింత పెంచుతుంది. ఈ వీధి బాలలకు హెచ్‌.ఐ.వి. ఇన్ఫెక్షన్‌కు దారితీసే హానికర ప్రవర్తనలు అలవడే ప్రమాదం ఎక్కువ.

హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌ – స్త్రీలు అవడం కారణంగా ఉండే అదనపు ప్రమాదాలు:

శారీరక అంశాలు :

1. అరక్షిత సెక్స్‌ కారణంగా హెచ్‌.ఐ.వి. ఇన్ఫెక్షన్‌ ప్రమాదం పురుషులకంటే స్త్రీలకు 2-4రెట్లు ఎక్కువ. యోని స్రావాలలో కంటే వీర్యంలో వైరస్‌ సాంద్రత ఎక్కువ.

2. వీర్యంతో తడిచే యోని మ్యూకస్‌ పొర, సర్విక్స్‌విూద మ్యూకస్‌ పొర ఉపరితలం పెద్దదిగా ఉండడం వలన, యోనిలో పురుషుడి వీర్యం ఎక్కువసేపు ఉండడం వలన పురుషుని నుండి స్త్రీ సులభంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. 3. కౌమార బాలికకు ఈ మ్యూకస్‌ పొర పూర్తిగా పరిణతి చెందకపోవడం వల్ల, వైరస్‌ యోని గోడలోకి చేరకుండా అడ్డుపడే మ్యూకస్‌ తగినంతగా ఉత్పత్తి అవకపోవడం వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువవుతుంది. 4. తమ శరీరాల గురించి, సెక్సువాలిటీ గురించి సరైన సమాచారం అందే అవకాశం లేని పరిస్థితులలో, ఆరోగ్యసేవలు తగినంతగా లేని పరిస్థితులలో జననాంగ ఇన్ఫెక్షన్లనూ, లైంగిక వ్యాధులనూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈ వ్యాధుల కారణంగాఏర్పడే కురుపులు, పుండ్లు, బొబ్బలు, పిలకలవలన ఆ గాయాల ద్వారా వైరస్‌ సులభంగా శరీరంలో  ప్రవేశిస్తుంది. 5. లైంగిక వ్యాధులు, హెచ్‌.ఐ.వి. ఇన్ఫెక్షన్‌ పురుషులకంటే తక్కువ వయసులో స్త్రీలకు సోకుతాయి. చాలామంది స్త్రీలకు వీటికి చికిత్స లభించదు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో లైంగిక వ్యాధులు సోకిన స్త్రీలు 20-30 శాతం ఉన్నారు. 6. స్త్రీలు అనేక కారణాలవలన రక్తహీనతతో బాధపడతారు. అంతేకాక వారు నిర్వహించవలసిన ప్రత్యుత్పత్తి విధుల కారణంగా ఎదురయ్యే అనేక ప్రమాదకర పరిస్థితుల్లో వారికి రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఎక్కువ ఉంటుంది. కలుషిత రక్తాన్ని ఎక్కిస్తే వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

స్త్రీలకు అతి తక్కువ కంట్రోలును అనుమతించే సామాజిక, సాంస్కృతిక అంశాలు:

1.  స్త్రీలు సెక్స్‌ విషయాలగురించి మాట్లాడడమే తప్పు అని భావించే సమాజంలో స్త్రీలు హెచ్‌.ఐ.వి. గురించి, కండోమ్‌ని ఉపయోగించడం గురించి తెలుసుకోవడం అరుదు.

2.  హింసకు గురవుతామేమోననే భయంతో, విడిచిపెట్టబడతామేమోననే భయంతో భర్తని కండోమ్‌ని ఉపయోగించడం గురించి ఒత్తిడి చెయ్యరు.

3.  స్తీలు శీలం కోల్పోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించని ద్వంద్వ ప్రమాణాల సమాజంలో స్త్రీల శీలంపై తీవ్రమైన నిఘా ఉంచబడుతుంది. పురుషుల విశృంఖల లైంగిక ప్రవర్తనను చూచీ చూడనట్లు ఊరుకోవడమే కాక స్త్రీలకు తమ భర్తల లైంగిక ప్రవర్తన పట్ల ఓర్మి వహించమని, మౌనంగా సహించమని బోధింపబడుతుంది.

                                                                                      -  డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gyn)

(ఇంకా వుంది)

This entry was posted in ఆరోగ్య దీపిక, కౌమార బాలికల ఆరోగ్యం and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Heads up! You are attempting to upload an invalid image. If saved, this image will not display with your comment.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)