పచ్చి మామిడి రుచులు (ఊరగాయలు)

ఆవకాయ

కావాల్సిన పదార్ధాలు :

మామిడి కాయలు – 25

కారం – 1 kg

ఆవపిండి – 1kg

ఉప్పు-1kg

పసుపు- 25 grams

మెంతులు- 200 grams

నూనె- 2kgs

తయారు చేసే విధానం :

మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆవకాయ కత్తి పేటతో ముక్కలుగా కొట్టుకోవాలి.తరువాత ఆ

ముక్కలను పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బేసిన్లో ఒక పెద్ద గ్లాస్ తో 5 గ్లాసుల కారం

పొయ్యాలి.తరువాత 5 గ్లాసుల ఆవపిండి పొయ్యాలి.ఉప్పు3గ్లాసులు పొయ్యాలి.పసుపు 200 గ్రామ్స్ వెయ్యాలి.మెంతులు

కూడా 200 గ్రామ్స్ వేసి మొత్తం గుండ అంతా కలిసేలాగా కలిపి kg నూనె పోసికలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్న

ఆవకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి ముక్కలకు పిండి అంటుకునే లాగా బాగా కలిపి కొంచం పిండి ముక్కలుకలిపి జాడి

లోనికి వెయ్యాలి.మొత్తం ముక్కలన్నితిని ఇలానే వేసి జాడికి మూత పెట్టేయాలి.ఆవకాయ పెట్టిన మూడవ రోజున

జాడిలోనిఆవకాయను బేసిన్లో పోసి తిరగ కలపాలి.తరువాత ఆవకాయను జాడీలో పెట్టి ఒక kg నూనె ను పొయ్యాలి

.అంతే ఘుమ ఘుమ లాడే ఆవకాయరెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మామిడికాయ పచ్చడి

కావాల్సిన పదార్ధాలు :

మినపప్పు – 1 టేబుల్ స్పూన్

మెంతులు – 1 టీ స్పూన్

ఆవాలు – అర టీ స్పూన్

ఇంగువ -1 టీ స్పూన్

ఎండు మిరపకాయలు – 15

పచ్చి మిరపకాయలు – 5

మామిడి కాయలు – 3

పసుపు – చిటికెడు

ఉప్పు – 2 టీ స్పూన్స్

నూనె -2 టీ స్పూన్స్

తయారు చేసేవిధానం :

ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పెచ్చు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .తరవాత ఒక బాండి

తీసుకుని దానిలో నూనె వేసి పైన చెప్పిన మినపప్పు ,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు,ఎండు మిరపకాయలు,

వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి.పోపు చల్లారిన తరువాత ఒక స్పూన్ పోపుని తీసి పక్కన పెట్టుకుని ఈ పోపు

నంతా గ్రైండర్ లో వేసి పచ్చి మిరపకాయలు ,ఉప్పు ,మామిడి ముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.అవసరమైతే

కొద్దిగా నీరు పోసి రుబ్బుకో వచ్చు. తరవాత పక్కన పెట్టిన పోపుని పచ్చడిలో కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే

రుచికరమైన మామిడి కాయ పచ్చడి రెడీ.ఇంక మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పెసర ఆవకాయ

కావాల్సిన పదార్ధాలు:

6 – మామిడి కాయలు

2కప్పులు – పెసర పిండి

1 టీ స్పూన్ – పసుపు

నూనె -1 కే జి

ఉప్పు -ముప్పావు కప్పు

కారం – 1 /2 కప్పు

ఇంగువ-2 టీ స్పూన్స్

తయారు చేసే విధానం :

ముందుగ మామిడి కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి.తరవాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా

తరిగి పెట్టు కోవాలి.తరవాత ఒక బేసిన్లో పెసర పిండి ,ఉప్పు,కారం,పసుపు ,ఇంగువ వేసి బాగా కలపాలి ఈ

మిశ్రమాన్ని .తరవాత మామిడి ముక్కలను కూడా వేసి నూనె పోసి ఎక్కడా పొడిగా లేకుండా అంతా బాగా కలిసే

విధంగా కలిపి మూత పెట్టెయ్యాలి. మరుసటి రోజు ఒక గిన్నెలో అర కే.జి నూనె పోసి అది బాగా కాగాక అందులో 2టీ

స్పూన్స్ మెంతులు,1 టీ స్పూన్ ఆవాలు, 2టీ స్పూన్స్ ఇంగువ ,10 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి ఆ

వేడి నూనెలో వేసి చిటపట లాడగానే ఈ నూనె ను పెసరావకాయ లో పోసి బాగా కలపాలి.చల్లారాక జాడిలోనికి తీసి

పెట్టుకోవాలి.అంతే ఘుమఘుమ లాడే పెసర ఆవకాయ రెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చిన్నముక్కల ఆవకాయ ( తొణుకుడు ఆవకాయ )

కావాల్సిన పదార్ధాలు:

మామిడికాయలు – పది

ఆవపిండి – ముప్పావు గ్లాసు

ఉప్పు – ఒక గ్లాసు

కారం – రెండు గ్లాసులు

నూనె – అర కేజీ

పసుపు -ఒక టీ స్పూన్

తయారుచేసే విధానం :

ముందుగా మామిడికాయలను బాగా కడిగి తడి లేకుండా పొడిగా బట్టతో తుడిచి చిన్నముక్కలుగా తరగాలి.తరవాత

ఒక బేసిన్లో ఆవపిండి,కారం ,ఉప్పు,పసుపు,మామిడిముక్కలు వేసి నూనె పోసి బాగా కలపాలి.అంతే చిన్నముక్కల

ఆవకాయ రెడీ.ఇదిమరుసటి రోజుకు చాలా బావుంటుంది.త్వరగానే ఊరిపోతుంది. ఆవపిండి తక్కువ వేస్తాము

కనుక.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మెంతి బద్దలు

కావాల్సిన పదార్ధాలు ;-

మామిడికాయలు – 4
మెంతులు – అర కప్పు
ఆవాలు – పావు కప్పు
ఇంగువ – 2 టీ స్పూన్స్
మినపపప్పు – ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు -దోసెడు ,అంటే మన రెండు అరచేతుల్లో పట్టే అన్ని మిరపకాయలు
కారం – 4 టీ స్పూన్స్
ఉప్పు – 3 టీ స్పూన్స్

నూనె- 4 గరిటెలు

పసుపు -అర టీ స్పూన్

తయారు చేసే విధానం :-

ముందుగా మామిడి కాయలను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి.బాగా ఆరిన కాయలను చిన్నముక్కలుగా

తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బాండి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి స్టవ్ మీద  పెట్టి

మినపపప్పు,ఆవాలు,మెంతులు,ఇంగువ,మినపపప్పు,ఆవాలు,మెంతులు,ఇంగువ,ఎండుమిరపకాయలు వేసి

వేయించాలి.మెంతులు వేగకపోతే చేదు వస్తుంది.కనుక సన్న మంట మీద బాగా వేయించి స్టవ్ మీద నుంచి

దించేయాలి.చల్లారిన తరవాత వేయించిన మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇప్పుడు పక్కన పెట్టుకున్న

మామిడికాయ ముక్కల్లో ఈ పొడిని వేసి 4స్పూన్స్ ఉప్పు, 4స్పూన్స్ కారం ,పసుపు, 4గరిటెల నూనె పోసి

బాగాకలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే మెంతిబద్దలు రెడీ.ఇవి 4 రోజుల వరకు నిలువ వుంటాయి.

మామిడికాయ పప్పులోకి ఇవి చాలా బావుంటాయి.వైట్ రైస్ తో కూడా తినవచ్చు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 కొబ్బరి +మామిడికాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:

కొబ్బరికాయ – ఒకటి

మామిడికాయ – ఒకటి

సెనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్స్

మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్

ఆవాలు – అర టీ స్పూన్

మెంతులు – ఒక టీ స్పూన్

ఇంగువ – రెండు టీ స్పూన్స్

పసుపు – పావు టీ స్పూన్

ఎండుమిరపకాయలు – 20

పచ్చిమిరపకాయలు – 10

ఉప్పు – 2 టీ స్పూన్స్

నూనె – 2 టీ స్పూన్స్

తయారు చేసే విధానం :

ముందుగ ఒక బాండి తీసుకుని అందులో రెండు టీ స్పూన్స్ నూనె పోసి సెనగ పప్పు,మినప

పప్పు,ఆవాలు,మెంతులు,ఇంగువ,ఎండు మిరపకాయలు,పసుపు వేసి పోపును దోరగా వేయించి పక్కన

పెట్టుకోవాలి.ఇప్పుడు కొబ్బరి ,మామిడి కాయలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని ఒక టీ స్పూన్ పోపును

పక్కన పెట్టి గ్రైన్దర్ గిన్నెలో పోపునంత వేసి పచ్చిమిరపకాయలు,వుప్పుకుడా వేసి ఒక రౌండ్ తిప్పి కొబ్బరి,మామిడి

ముక్కలను వేసి కొద్దిగా నీళ్ళు పోసి రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టిన పోపును వేసి కలపాలి బాగా.

అంతే ఘుమ ఘుమ లాడే కొబ్బరి,మామిడి పచ్చడి రెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పులిహోర ఆవకాయ

కావాల్సిన పదార్ధాలు :

మామిడి కాయలు – 10

కారం – 3 గ్లాసులు

ఉప్పు – ఒక గ్లాసు

పసుపు – ఒక టీ స్పూన్

ఆవపిండి – ఒక గ్లాసు

మెంతులు – పావు గ్లాసు

పోపు కోసం :-

సెనగ పప్పు – 3 టేబుల్ స్పూన్స్

మినప పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్

ఆవాలు – అర టేబుల్ స్పూన్

మెంతులు – ఒక టేబుల్ స్పూన్

ఎండుమిరపకాయలు – 20 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి

కరివేపాకు -రెండు కట్టలు

ఇంగువ – ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం :-

ముందుగామామిడి కాయలను బాగా కడిగి తడి లేకుండా బట్టతో తుడిచి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్లో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు, పసుపు వేసి మామిడి ముక్కలను కూడా వేసి అర కేజీ నూనె పోసి బాగా కలిపి మూతపెట్టేయాలి. మరునాడు మూత తీసి స్టవ్ మీద అర కేజీ నూనె పెట్టి సెగ వచ్చేలాగ కాగాక పైన చెప్పిన పోపు దినుసులన్నీ వేసి చివరలో కరివేపాకును వేసి చిటపటలాడాక ఆవకాయలో వేసి పోపును బాగా కలపాలి. కరివేపాకును బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. అప్పుడే పోపులో వెయ్యాలి. తడి వుంటే బూజు పడుతుంది. చల్లారిన తరవాత పులిహోర ఆవకాయను జాడిలోనికి తీసి పెట్టాలి. అంతే ఘుమ ఘుమ లాడే పులిహోర ఆవకాయ రెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మామిడికాయ పులిహోర

 కావలసిన పదార్ధాలు

బియ్యం – ఒక కేజీ

మామిడికాయలు -3

పసుపు – 2 టీ స్పూన్స్

ఉప్పు – 4 టీ స్పూన్స్

సెనగపప్పు – 4 టేబుల్ స్పూన్స్

మినపపప్పు – 3 టేబుల్ స్పూన్స్

పల్లీలు-2 టేబుల్ స్పూన్స్

ఎండుమిరపకాయలు- 15

పచ్చిమిరపకాయలు-20

ఆవాలు – 2 టీ స్పూన్స్

అల్లం- 2అంగుళాల ముక్క

కరివేపాకు – 2 కట్టలు

ఇంగువ -1 టేబుల్ స్పూన్

నూనె – 3 గరిటెలు

తయారుచేసే విధానం :

ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం

ఆరబెట్టాలి.తరవాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నూనె  పోసి అందులోనే మినపపప్పు

,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ,ఎండుమిరప ముక్కలు , 4 మెంతి గింజలు , పసుపు వేసి దోరగా వేయించాలి .అల్లం

ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి . మామిడి కాయలకు పీలర్ తో  పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి గ్రైండ్ చేసి

పెట్టుకోవాలి.దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరవాత

గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి 5 నిమిషాలు ఉంచి బేసిన్లోని అన్నంలో బాగా కలపాలి. అంతే ఘుమగుమ

లాడే వేడి వేడి మామిడి కాయ పులిహోర రెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

తొక్కుడు పచ్చడి

కావాల్సిన పదార్ధాలు :-

మామిడికాయలు – 15

మెంతులు – ఒక గ్లాసు

ఆవాలు – అర గ్లాసు

కారం – మూడున్నర గ్లాసులు

ఉప్పు – ఒక గ్లాసు

పసుపు – 6 టీ స్పూన్స్

నూనె  – అర కేజీ

తయారు చేసే విధానం :-

ముందుగామామిడికాయలను బాగా కడిగి తడిలేకుండా పొడి బట్టతో తుడిచి పెచ్చుతీసి చిన్న

ముక్కలుగా తరగాలి. తరవాత ఆ ముక్కలలో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత

పెట్టేయాలి. మరుసటి రోజు మెంతులను, ఆవాలను విడివిడిగా నూనె వెయ్యకుండా

వేయించాలి. చల్లారిన తరువాత ఆవాలు, మెంతులను మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత

నిన్న మనము తరిగి పెట్టిన మామిడి ముక్కలను గట్టిగ పిండి కచ్చ పచ్చాగా అంటే

మెత్తగా కాకుండా కొంచం బరగ్గా గ్రైండ్ చెయ్యాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన

మామిడి తురుము, ఆవాలు, మెంతుల పొడిని, కారాన్ని ఒక బేసిన్లో వేసి ముక్కలను

పిండాక వచ్చిన రసం అందులో పోసి బాగా కలపాలి. ఇప్పుడు అర కేజి నూనెను ఒక

గిన్నెలో పోసి సెగలు వచ్చేలాగ వేడి చెయ్యాలి. నూనె  వేడెక్కేలోపు ఇరవై

ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ, రెండు టేబుల్

స్పూన్స్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని కాగిన నూనెలో పోసి చిటపట

లాడక పచ్చడిలో వేసి పోపు బాగా కలిసే లాగా కలపాలి. చల్లారిన తరవాత జాడీ లోకి

తీసి పెట్టాలి. అంతే ఘుమ ఘుమ లాడే తొక్కుడు పచ్చడి రెడీ.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మాగాయ

కావలసిన పదార్ధాలు :-

మామిడి కాయలు – 25

మెంతులు – ఒకటిన్నర గ్లాసు

ఆవాలు – ముప్పావు గ్లాసు

కారం – 5 గ్లాసులు

ఉప్పు – రెండున్నర గ్లాసులు

నూనె  – రెండు కేజీలు

పసుపు – 50 గ్రాములు

పోపు కోసం :-

ఆవాలు – రెండు టేబుల్ స్పూన్స్

మెంతులు – 3 టేబుల్ స్పూన్స్

ఎండుమిరపకాయలు – 25ముక్కలుగా చేసి పెట్టుకోవాలి

ఇంగువ – రెండు టేబుల్ స్పూన్స్

తయారు  చేసే విధానం :-

ముందుగా మామిడికాయలను బాగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా

తరిగి ఆ ముక్కలలో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.  మూడవ రోజున మామిడి ముక్కలను

గట్టిగా పిండిపెద్ద పళ్ళాలలో వేసి ముక్కలు కొంచం ముడుచుకునేలాగా ఎండ బెట్టాలి.   మెంతులు, ఆవాలను వేయించి

పొడి చేసిపెట్టుకోవాలి.  ముక్కలు పిండగా వచ్చిన రసాన్ని కూడా ఒక గంట ఎండ బెట్టాలి.ముక్కలు ఎండాక ఒక బేసిన్లో

వేసి, రసం పోసి,పొడి చేసి పెట్టుకున్న పొడినివేసి, కారాన్ని కూడా వేసి బాగా కలపాలి.  తరవాత ఒక పెద్ద గిన్నెలో పైన

చెప్పిననూనె పోసి,సెగలు వచ్చేలాగ కాగాక, పోపు దినుసులన్నీ వేసి చిటపట లాడాక  మాగాయలో పోపును వేసి

బాగా కలిపి, చల్లారాక జాడిలోనికి తీసి పెట్టుకోవాలి.  అంతే. ఘుమ ఘుమలాడే మాగాయ రెడీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మామిడికాయ పప్పు

కావాల్సిన పదార్ధాలు :-

కందిపప్పు – ఒక కప్పు

మామిడికాయలు – రెండు

మినపపప్పు – 2 టీ స్పూన్స్

ఇంగువ – పావు టీ స్పూన్

ఆవాలు – పావు టీ స్పూన్

మెంతులు – 4 గింజలు

ఎండుమిరపకాయలు – 5

పచ్చిమిరపకాయలు – 6

ఉప్పు – 2 టీ స్పూన్స్

జీలకర్ర – ఒక టీ స్పూన్

కరివేపాకు – రెండు రెమ్మలు

నూనె – 2 టీ స్పూన్స్

తయారు చేసే విధానం ;-

ముందుగాఒక గిన్నెలో కందిపప్పు వేసి నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఉడక నివ్వాలి,బద్ద మెత్త బడే వరకు. అప్పుడు మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపముక్కలు వేసి మరి కొంచం నీళ్ళు పోసి ఉడికించాలి. పప్పు వుడికిన తరవాత దించేసి ఒక చిన్న బాండీ తీసుకుని అందులో నూనె వేసి మినపపప్పు, ఆవాలు, మెంతిగింజలు, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు వేసి పోపును దోరగా వేగనిచ్చి కరివేపాకువేసి పోపును పప్పులో వేసి బాగా కలపాలి. అంతే ఘుమ ఘుమ లాడే చక్కటి మామిడి కాయ  పప్పు రెడీ.

తయారీ:
ఫోటోలు:

 – లక్ష్మి పిరాట్ల 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

9 Responses to పచ్చి మామిడి రుచులు (ఊరగాయలు)

 1. Lakshmi says:

  నా పోస్ట్లు నచ్చినందుకు ,మెచ్చినందుకు మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు .

 2. akondi prasanna says:

  లక్ష్మి గారు మామిడికాయల స్పెషల్ చాల బాగుందండి.విహంగ కి థాంక్స్.అన్ని ఒకే సారి ఇచ్చినందుకు మీ దయావల్లనా … ఉరగాయా పెట్టుకోవడం
  వచ్చింది

 3. ramamani immmi says:

  చాల బాగుంది ఇంకా పాత వంటలు ఉంటే చూపించండి

 4. m.s.r.prasad says:

  మీ సైట్] చాలా బాగుంది. కొత్తవేమైన
  ఉంటె మాకు చాఆలా సంతోషం …ప్రసాద్ ఢిల్లీ

 5. laxmanswamy says:

  అద్భుతం గా ఉన్నాయి మీ పోస్టింగ్స్ . నిజం గా మీకు కృతజ్ఞతలు ఇంకా ఉన్నాయా

 6. SURENDRA PATNAIK says:

  చక్కని మామిడి రుచులతో ఆనందింప చేసారు . చాల చాలా థాంక్స్ మీకు

 7. అద్భుతం గా ఉన్నాయి మీ పోస్టింగ్స్ . నిజం గా మీకు కృతజ్ఞతలు ……..

 8. jyothi says:

  లక్ష్మి గారు మామిడికాయల స్పెషల్ చాల బాగుందండి.విహంగ కి థాంక్స్.అన్ని ఒకే సారి ఇచ్చినందుకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)