స్త్రీల వస్త్రధారణే లైంగిక దాడులకు కారణమా? (చర్చ)

మహిళా దినోత్సవం సందర్భంగా –

పాఠకుల కోరిక మేరకు

ఉన్నత పదవిలోవున్న ఒక ప్రముఖ వ్యక్తి  స్త్రీల వస్త్ర ధారణ పై చేసిన వ్యాఖ్యలపై  చర్చ

ప్రారంభిస్తున్నాం.

ఈ వ్యాఖ్యల్లో   నిజం వుందా? పురుషులంతా ఇలా భావిస్తున్నారా? లేక కొంతమంది స్త్రీలకి కూడా ఇలాంటి అభిప్రాయా

లున్నాయా ? మరి చిన్న పిల్లలు,వృద్ధులపై జరుగుతున్న లైంగిక దాడులకి వస్త్ర దారణే  కారణమా?

పలు రంగాలకు చెందిన వ్యక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల సమాహారం ఇది.   ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలకు

వారే భాధ్యులు.  వారి సొంత అభిప్రాయాలు ‘ విహంగ ‘ అభిప్రాయాలు కావు.

– ‘విహంగ’ సంపాదక   వర్గం

 

                      అమ్మాయిలు వేసు కునే  కురచ దుస్తులు, వారి వస్త్ర ధారణ, మగ వాళ్ళని  రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి గనకే, అత్యాచారాలు జరుగు తున్నాయని,మగవాళ్ళ అత్యా చారాలకి ఆడవాళ్లే  కారణమని ఆరోపించడమే కాక, డిజిపి దినేష్ రెడ్డి, రేప్ లని   పోలీసువ్యవస్థ  ఏ రకంగాను ఆపలేదని నిస్సిగ్గుగా చెప్పడం, బాధ్యతారహితంగా మాట్లాడడం అనిపించుకుంటుంది. రేప్ చేసిన వాడికి కఠినశిక్ష పడితే, రేప్ లు  ఆగుతాయని  మామూలు బుర్రకి కూడా తడుతుంది. కానీ, డిజిపి మేధస్సుకి మాత్రం బాధ్యత నుంచి తప్పించుకోవడం, తప్పుని స్త్రీల మీదికి నెట్టడం  బాగా తెలుసని అర్థం చేసుకోవలసివస్తోంది. indecent dress code, సమాజంలో ప్రవేశించిందని ఒప్పు కోక తప్పదు. జబ్బలు,కండలు, నడుము భాగం కనిపించేలా కురచ షర్టులు; పిర్రల  మీద, తొడల మీద చిరుగులు,లింగభాగం expose చేసే జీన్స్  వేసుకోవడం  అబ్బాయిలలో  కనిపిస్తోంది. అరవై దాటిన మగవాళ్ళు కూడా జీన్స్, టీ షర్ట్స్, షార్ట్స్, వేసుకుంటున్నారు. మగ  వాళ్ళ ఈ  indecent dress code  గురించి మాట్లాడక్కరలేదా?.

 స్త్రీ  పట్ల లైంగిక దృష్టి పురష నైజం గా ఉందన్నది పచ్చి నిజం. అలా లేని మగవాళ్ళ శాతం చాలా తక్కువ. రేప్  నిందితులకి కఠిన శిక్షలు  పడడంవల్ల,  మగవాళ్ళు  స్త్రీలని  చూసే దృష్టిలో  మార్పు రావడంవల్ల  మాత్రమే  స్త్రీలపై  అత్యాచారాలు  తగ్గుతాయి. అంగ ప్రదర్శన చేసే వస్త్ర ధారణ  నేటి  యువతీయువకులిద్దరిలోను  ఉంది. నేటి యువత  westernize అవుతున్నారు  తప్ప, modernize  కావడం లేదు.modernization అంటే  democratic values and attitudes, rational thinking అలవరచు కోవడం. యువత  modernize అయ్యే విధంగా  విద్యా వ్యవస్థ, రాజకీయ, సామాజిక వ్యవస్థలు  పని చెయ్యాలి.

                                                                             –    డా.  పాలంకి  శోభారాణి.

నాగరిక ప్రపంచంలో, ఒక వ్యక్తికి (ఆడ లేదా మగ ) వారికి నచ్చిన పని చేసుకునే హక్కు ఉంటుంది. హైదరాబాద్ (లేదా మరే ఇతర ప్రాంతం లో అయినా) స్త్రీలకు కూడా అవే హక్కులు వున్నాయి – వారికి నచ్చిన ఏ దుస్తులను అయినావారు ధరించవచ్చు. “రెచ్చగొట్టే దుస్తులు” అన్నది ఒక్కొక్క మనిషి బట్టి వుంటుంది (subjective). ఒక స్త్రీ ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చో DGP రెడ్డి గారు చెప్పే పరిస్తితి వచ్చింది అంటే భారతదేశం యొక్క తాలిబానీకరణ మొదలు అయ్యింది అని అర్థం. ఇక్కడ మహిళలు చేస్తున్నది నేరం కాదు…మహిళలపై అక్రమాలు చేస్తున్న పురుషులు నేరం చేస్తున్నారు. చట్టం నిపరిరక్షించే బాధ్యత పోలీసులది. DGP రెడ్డి గారు తమ చేతగాని తనాన్నికప్పిపుచ్చుకోవడానికి మహిళలు మీద తిరిగి నింద వేస్తున్నారు. ఇది శోచనీయం.

– రఘు

ఆ మధ్య   డిజిపి చేసిన  వాఖ్యలు  చూస్తుంటే , అసలు  ఈ  మనిషి ఎక్కడ ఉన్నాడో , బుద్ధి  వుండి  మాట్లాడుతున్నాడో  లేదో  అర్ధం కాలేదు.
అమ్మాయిల వేషధారణ  చూసే  అబ్బాయిలకి  రేప్  చేయాలన్న  బుద్ధి పుడుతుంది  అని  అన్నాడు ,
అంటే చీర  కట్టిన  వాళ్ళ  మీద , అభం  శుభం  తెలియని  పసి  పాపల  మీద ఏ  అఘాయిత్యాలు   జరగలేదా ??
నేను  ఒక  3 సంఘటనలు  చెప్తా ,
1- హైదరాబాద్  నగర  శివార్లలో  ఒక 60  సంవత్సరాల  ముసలావిడ  ఆటో  కోసం  ఎదురు  చూస్తుంటే, ఒకడు  ఆటో ఎక్కించుకుని  ఆవిడని  ఊరు  బయటకి  తీసుకెళ్ళి
బలాత్కారం  చేసి  అక్కడే  వదిలేసి  పారిపోయాడు , ఎవరో  అటుగా  వెళ్ళిన  వాళ్ళు  ఆవిడని చూసి హాస్పిటల్ లో  అడ్మిట్ చేసారు ..
2- గుజరాత్  లో ఒకటిన్నర సం//పాప  ని  ఒక 30 సంవత్సరాల  వెధవ  రేప్ చేస్తే  ఆ  పాప అక్కడికక్కడే  చనిపోయింది ,
వాడిని  చుట్టూ  పక్కల  వాళ్ళు కొట్టి  చంపేసారు ..
3- హైదరాబాద్  చార్మినార్  దగ్గర  కన్న  కూతురిని , సొంత  చెల్లెల్ని  ఒకరు  తర్వాత  ఒకళ్ళు  అనుభవిస్తూ  ఆ పిల్ల  ప్రగ్నంట్ అయ్యేలా  చేసారు..
మాన భంగం  చేయాలి  అన్న  నీచానికి  దిగజారే  కుక్క  కి చీర  కట్టుకుందా  మిడ్డి  వేసుకుంద  అన్న ఆలోచన  ఉండదు , వాడొక  కుక్క లాంటోడు ,వావి  వరస  ఇంగిత  జ్ఞానం  వుండవు … వాళ్ళు చూసేది  ఆడదా  కాదా  అని…
మిడ్డి వేసుకునే  అమ్మాయని  చూసి సంస్కారంగా  ప్రవర్తించే  అబ్బాయ్ లు  వున్నారు , చీర  కట్టుకున్న కూడా  వంకర  బుద్ధి తో  చూసే అబ్బాయ్ లు వున్నారు
మారాల్సింది  వాళ్ళ  బుద్ధి …ఐన  సంస్కారం  మరచి  చిన్న  చిన్న బట్టలు  వేసుకుని  తిరిగే  వాళ్ళని , జాబు కంఫర్ట్ కోసం జీన్స్ వేసుకునే వాళ్ళని ఒకే  చెట్టుకి  కట్టేసి పిచ్చి  పిచ్చి  కూతలు  కూయటం సబబు  కాదు …ముందు  చట్టాన్ని  సరిగ్గా  అమలు  పరచి  పట్టుకున్నోడిని  ఎవడో  రికమండ్ చేసాడని  ఎవడో మంత్రి  కొడుకని  2 రోజులు  జైలు  లో పెట్టి వదిలేయకుండా సరైన  బుద్ధి  వచ్చేటట్లు  శిక్ష   వేయమనండి …

ఆ సత్తా  లేదు  గాని ఇలాంటి పనికి మాలిన మాటలు  బాగా మాట్లాడతారు. … పిచ్చి కూతలు  ఆపేసి  లంచాలు  తినకుండా , పిరికి  వెధవల్ల  ఉండకుండా స్త్రీలపై అన్యాయాలు జరిగినప్పుడు డ్యూటీ సరిగ్గా చేస్తే మంచిది ….

– అభిలాష,

– కవయిత్రి

స్త్రీల వస్త్రధారణవల్లే  మగవాళ్ళు రెచ్చిపోయి నేరాలు చేస్తున్నారు అనే డి జి పి గారి వ్యాఖ్య ఎంతమాత్రమూ సహించేదిగాలేదు . ఒక వ్యక్తి గా ఆయనకి ఎటువంటి అభిప్రాయాలయినా వుండచ్చు కానీ ఒక బాధ్యత గల అధికారిగా  మీడియా ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం  అసలే మదమెత్తిపోయి వున్న కొందరు మగ పశువుల్ని ప్రోత్సాహపరచడమే అవుతుంది .  వస్త్రధారణ అనేది ఆ వ్యక్తి అభిరుచిని తెలియచేస్తుంది .  అది పూర్తిగా వ్యక్తిగతం .  ఇక  స్త్రీలమీద జరుగుతున్న అత్యాచారాలగురించి చెప్పాల్సొస్తే , ముక్కుపచ్చలారని పసిపిల్లలనుండీ, మంచాన పడ్డ వృద్ద మహిళలవరకూ బాధితులుగా వుంటున్నారు . ఫేషన్ అనే మాటే తెలియక సాంప్రదాయాల ముసుగులో గుమ్మందాటని స్త్రీల మీద కూడా కీచకుల్లా విరుచుకుపడుతున్నారు . మనమధ్యనే నిత్యం జరిగే ఈ ఘోరాలకీ ఎక్కడో హైక్లాస్ సొసైటిల్లో ఆడవాళ్ళు ధరించే ఫేషనబుల్ వస్త్రాలకీ లింక్ పెట్టి  తాము తప్పించుకోవాలని చూడటం ,నేరస్తుల్ని వెనకేసుకొచ్చి బాధితుల్నే బలిపసువుల్ని చెయ్యటం   డిజిపి గారి అతితెలివినీ బాధ్యతా రాహిత్యాన్నీ సూచిస్తుంది.  నిజంగా నేరాల్ని అరికట్టాలనే చిత్త శుద్దేవుంటే , మనిషి బలహీనతను ఆసరాగా తీసుకుని సాగే లిక్కర్ వ్యాపారాలు, యువత ఆలోచనలని పెడదోవన నడిపిస్తున్న అశ్లీల సినిమాలు , వంటివాటి మీద తమ దృష్టిని నిలపాలి . మనిషిలో మృగాన్ని మేల్కొలిపేది అతడి ప్రవృత్తి మీద తీవ్ర ప్రభావాన్నీ చూపటంలో వీటి పాత్ర చాలా వుంది చీడపురుగుల్ని వదిలేసి పువ్వుల్ని చిదిమేసే లాంటి అజ్ఞానం నుండీ ముందుగా ఇటువంటి అధికారులు, నాయకులూ, బయటపడాలి .
చివరిగా మనలో మనంగా చెప్పుకోవాల్సింది , ముళ్ళుంటాయని తెలిసీ చెప్పులు లేకుండా తిరగాలనుకోవటం సాహసం అనిపించుకోదు . వస్త్రధారణ అయినా మరోటయినా  ఫేషన్ ని  అనుకరించేముందు ఎవరికి వారే దానిలోని మంచి చెడ్డలు గ్రహించుకోవాలి . మనం నివసిస్తున్న సామాజిక  పరిస్తితుల్నీ , మన చుట్టూ వుండేవారి ఆలోచనా ధోరణినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి . ధరించేది మోడ్రన్ డ్రస్స్ అయినా , సాంప్రదాయ వస్త్రాలయినా  వాటిని ధరించిన వ్యక్తి కి వాటివల్ల  అందం హుందాతనం పెరగాలి .

– దాట్ల లలిత

రచయిత్రి, గృహిణి

DGP దినేష్ రెడ్డి వ్యాఖ్యలు ఓ వర్గాన్ని ఉద్దేశించినట్టుగా ఉన్నాయి.అసభ్య వస్త్రధారణ ,(ఫేషన్ పేరిట) పేజి-3 వర్గాల్లో అంటే ధనిక వర్గాల్లో మాత్రమే జరుగుతున్న విషయం ఇది.
వివాహాది వేడుకల్లో సైతం అంగాంగ ప్రదర్శన చేస్తూ దుస్తులు ధరిస్తున్నారు.
పేద , మధ్యతరగతి వర్గాల్లో  తోడుగా మనుష్యులు లేనప్పుడు  మైనర్ బాలికల మీద అత్యాచారం చెయ్యటానికి కానీ,వృద్ధ మహిళలపై అత్యాచారం చెయ్యటానికి  కానీ  ఈ ముష్కరులు వెనకాడడం లేదు.
అలాంటప్పుడు ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్త పడటమే మనం చెయ్యగలిగింది.
DGP వ్యాఖ్యల్లో నిజం లేదు.

– కె. విజయ దుర్గ ,

ఉద్యోగిని, LIC 

 

జిహ్వాస్వస్తత

పెద్దన్న దినేష్ రెడ్డి

వాడి మనసు గుడ్డి

పదవి చానా పెద్దదే సరి

పెదవి జారుడు రోగి మరి

 – ఇందిరా శేఖర్ , గృహిణి

ఒక వున్నత మైన పదవి లో ఉండి డిజిపి దినేష్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యానాలు చెయ్యడం సముచితం కాదు. అమ్మాయిల డ్రెస్ సెన్స్ సరిగాలేదు అందుకే ఇన్ని సెక్షుఅల్ హర్రాస్స్మేంట్ కేసులు , రేప్ లు, మర్డర్ లు జరుగుతున్నాయా? ఒక ప్రశ్న కి రెడ్డి గారు  సమాధానం ఇవ్వాలి – పసిపిల్లల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి మరి అది కూడా ఆ పిల్లల డ్రెస్ సెన్స్ వల్లే జరుగుతునాయా? ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యాయుతమైన పోలీసు ఉన్నతుద్యోగి మాట్లాడవలసిన మాటలేనా? వారు నెరవేర్చాల్సిన బాధ్యత   మర్చిపోయి నెపం ఆడవాళ్ళ డ్రేస్సేస్ మీద నెట్టడం ఎంతవరకు సబబు? అయినా పురుషుడికి జంతువులకి తేడా లేదా ? మనిషికివున్న విచక్షణ జ్ఞ్యానం, విజ్ఞత అనేవి జంతువుల నుంచి వేరు చేస్తాయి. అలాంటప్పుడు ఒక మగవాడు ఆడవాళ్ళ వేషధారణ కి ఉద్రేకపడి రెచ్చిపోయి ఇంత అసహ్యమైన జంతు ప్రవర్తన ప్రదర్శిస్తారా? do the common man accept this statement and agree with mr. dinesh reddy?

– హిమ బిందు ,అధ్యాపకురాలు

చర్చావేదికPermalink
0 0 vote
Article Rating
20 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
rameshraju
rameshraju
7 years ago

ధనువంతుల కుటుంబాల్లో స్త్రీల వస్త్రధారణ మరీ దారుణంగా ఉంటోంది. ఎక్కువగా కుటుంబ యజమాని (భర్త) లేదా మగవారు వీక్ గా ఉన్న కుటుంబాల్లో అమ్మాయిల వస్త్రధారణ రెచ్చగొట్టే విధంగా ఉంటోంది. నేను మాత్రం సంప్రదాయ వస్త్రధారణ (చీర లేక పంజాబీ) లో ఉన్న స్త్రీలను మాత్రమే గౌరవిస్తాను.

Devi Ram.
8 years ago

కొద్దిగా ఆలస్యంగా ఈ చర్చ గురించీ చూశాను. అన్ని వ్యాఖ్యలూ చదివాను.,ఈవిషయాన్ని గురించి mails కొద్దీ చర్చించడం కంటే జరగవలసిన విషయాన్ని చర్చించడం మంచిదేమో! కాలం పవిత్రమైనదికదా! అసలు ఈనాడు ఈ మగ మృగాలకు ఎందువల్ల ఇంత కళ్ళుకానని కామం, ఒళ్ళుతెలీని మదం పుట్టుకొస్తున్నాయో అందరం ఆలోచించాల్సిన విషయం. ఆహారంలో ఏదైనా మదం, కామం కలిగించే రసాయనాలు ఉన్నాయా! అలాఉంటే అదేఆహారం ఆడవారూ తింటున్నారాయె! మరేంటి?
చిన్నతనం నుండీ ప్రాధమికపాఠశాలల్లో నీతి , నియమాలగురించీకధలు ,మానవతావిలువలగుగించిన అవగాహన , మన సాంప్రదాయం గురించీ, ఏమీ చెప్పకపోడమా? హైస్కూల్ కెళ్ళగానే రెక్కలు వచ్చిన పక్షులై, కాలేజ్ లో అడుగిడగానే ఎగిరిపోయే సంస్కృతి ఎక్కడవచ్చింది?
అసలు క్లబ్బులు, పబ్బులూ , పార్టీలూ , మనకు తగినవేనా? అక్కడ ఏమి జరుగుతుంది? ఎందుకోసం అక్కడికి వెళ్ళాలి? మన చదువుల సార్ధకత ఏంటి? ఎందుకోసం చదువుతున్నాం? చదువులు చంకనాకి పోవటం , పరమార్ధం పారిపోటం , మనకు తెలుస్తున్నదా?
బిడ్డలకు పాలిచ్చేప్పుడైనాగానీ పమిటకప్పుకుని వక్షం ఇతరులకు కనిపించకుండా జాగ్రత్తపడే –భగవంతుడు ఏప్రత్యేకతకోసం ఆడవారిని ఈరీతి శరీర ఆకృతిని ప్రసాదించాడో మరచి,లేక తెలీక ,తెల్సుకునే ప్రయత్నమేచేయక పడుపువృత్తిచేసి ధనం సంపాదించినట్లు [క్షమించండి పచ్చిగాచెప్పవలసి వస్తున్నందుకు] సినిమాల్లో డబ్బులకోసం సిగ్గులేకుండా జాకెట్లేలేక , వక్షస్థలం తమకు కాంగా ఉందని బయటికి కనిపించేలా , తొడలు మర్మావయవం వరకూ కనిపించేలా , లోపలి అవయవాలన్నీ లోదుస్తుల్లోంచి బయటికి కనిపించేలా, బొడ్డునుండీ బొజ్జంతా , మొలక్రిందకు పొత్తి కడుపువరకూ కనిపించేలా ధరించి, డబ్బొసుకుంటూ,నీచ నికృష్ట [వారికి కాక పోవచ్చు ] సంస్కృతిని దేశంలో పాదుకొలిపు తూ , నటిస్తే రోజూ వాటినే చూసేవారికి లైంగికపరమైన కోరికలు కలుగవచ్చేమో! అదీ ఆలోచించాల్సిన విషయమేనేమో! ఒంటినిండా గుడ్డలతో పూర్వం నటించిన నటీమణుల సినిమాలు ఈరోజుకూ అంతా చూస్తూనే ఉన్నారు. ఒక కుఱ్ఱ వెధవ సినిమా డబ్బుకుమ్మరించాలంటే గుడ్డల్లేని ఆడవాళ్ళు నటించాలి, గోచీలతో నృత్యంచేసే ఆడగ్యాంగునుపెట్టల్సిందే ! ఈ డైరెక్ట్ర్స్, నిర్మాతలూ, పడుపుకూడు తింటున్నారనటంలో తప్పేమీ లేదు. అలాంటి సినిమాలను స్త్రీలు చూడకుండా , ఆ సినిమాలు ఆడకుండా అలాంటినటీమణులనూ వెలేయాలి. దీనికి స్త్రీశక్తి సంఘటితంగా పనిచేయాలి. ఒక సంఘటన జరిగాక కొద్దిగా అరచి ఊరుకుంటే తాటాకుమంట, ఉట్టుట్టి భేషజం అవుతుందితప్ప. ఉపయోగమేమీ ఉండదని మరువకండి.
టివి.సీరియల్స్ దగ్గరికోస్తే తరాలకోద్దీ సాగుతూ ఘోరాలూ,దుర్మార్గాలూ చూపుతూ, ఆడవారిని ఆడవారే చండాలంగా హింసించే విధానమూ, చూసేవారిమనస్సులకు ఎక్కదంటారా? ఇహ చిన్నతెర నృత్యాలేం బ్లూ ఫిలింస్ కు తీసిపోడంలేదు. యాడ్స్ చూస్తే ఎవరికైనా తిక్కరేగేట్లే ఉంటున్నాయి.
బ్లూ ఫిలింస్ ను మొబైల్స్ లో చూస్తూ’ ఆడ ‘కనిపిస్తేచాలు ముసలైనా ముతకైనా అంగాంగ ఫోటోలు తీసి, తలలుమార్చి పరువు తీస్తామని బెదిరించటమూ,అవి అందరికీ పంపి ఒకర్నోకరు రెచ్చగొట్టుకోడమూ, ఈ ఆధునిక పరికరాలన్నీ మంచికి కాక చెడును పంచేవీ పెంచేవిగా ఉంటున్నాయి, వీటి సంగతేంటి? వీటిని గురించి సినిమాల్లో మహబాగా చూపి కుర్ర కారుకు కుటిఒలత నే రప్రవృత్తీ పెంచుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి పల్లెపల్లే వ్యాపించి , టెన్స్ ఫైల్, ఇంటర్ ఫైల్ ఐనవారే ఎక్కువ అరాచకాలకు, అత్యాచారకూ పాల్పడుతున్నారన్నది మనం తెల్సుకుంటున్న విషయమే!
బాగా చదువుకున్న .వారు తమతోటి మహిళలను గౌరవించి మర్యాదగా ఉంటున్నదీ వింటూనే ఉన్నాం. జరుగుతున్న అన్ని అత్యా చారాలకూ, హత్యలకూ, దారుణ హింసలకూ కారణం విద్యాహీనులేకానీ, విద్యావంతులుకాదనేది నిర్వివాదాంశం. ఐతే కొన్ని కార్యాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ విద్యార్ధులనూ, తోటి ఉద్యోగినులనూ లైంగిక హింసలకు గురిచేరిచేసేవారూ లేకపోలేదు.వీరంతా ఏకేటగిరీక్రిందికొస్తారో ఆలోచించాల్సిందే! ముఖ్యంగా ఆదుర్మార్గుల ఇళ్ళలో మహిళలు తల్లికానీ చెల్లికానీ, భార్యకానీ ఎవరైనాకాని అలాంటి దుర్మార్గులను సమాజానికి, మహిళాసంఘాలకూ, పోలీసులకూ పట్టిచ్చి అవసరమైతే సాక్ష్యం చెప్పి దండనపడేలాచేయాల్సి ఉంది.
డిల్లి బాధితురాలి విషయానికోస్తే ఇంతదారుణంగా ఆమెను చంపిన [నిర్భయ] దుర్మార్గులను మర్మావయవాలు కోసేసి [మరొకరిపై అలాచేసే అవకాశం ఇవ్వకుండా ]వదలాలి. ముఖ్యంగా ఆ14ఏళ్లకిరాతకుడిని వదిలినా తల్లో చెల్లో చంపేయాలి.
మహిళాల్లో ఇలాంటిమార్పు వస్తే తప్ప , చైతన్య వంతులైతే తప్ప స్త్రీ పసిబిడ్డ ఐనా, పరువంలో ఉన్నదైనా, ముసలిదైనా కఠినశిక్ష పబ్లిగ్గా అమలుచేస్తే తప్ప దుర్మార్గుల అరాచకాలు తగ్గవు. దీనికిమాత్రం, ముస్లిం దేశాలవారిని ఆదర్శంగా తీసుకుని ‘ కంటికి కన్ను పంటికిపన్ను, హత్యకు హత్య, మానానికిమానం, ప్రాణానికిప్రాణం, గా శిక్షాలు అమలుచేసి, ఆదుర్యోధన ,దుశ్శాసన, కీచకులను కొర్జాలను చేసి వదలాలి. పబ్లిగ్గా ఉరిశిక్ష విధిస్తే అంతాచూసి కొంతైనా భయం ఉండవచ్చు
దేవిరాం.

Dadala Venkateswara Rao
Dadala Venkateswara Rao
8 years ago

మగవారు ఆడువారు
ఈ సమాజంలో
ఒకరికి = ఒకరు
ఆడ – మగ
అమ్మ అక్క భార్య – ఆడ
నాన్న తమ్ముడు మొగుడు – మగ
అనుభందాలు ఆప్యాయతలు
అల్లుకున్న సమాజం మనది
నమ్మకాలు న్యాయాలు ధర్మాలు
పెనవేసుకున్నఅతుకుల
బ్రతుకులు మనవి
అందరు మనలాంటి మనుషులే
అందరు మనలాంటి ఆలోచనలు ఉన్నవారే
ఆనందాలు ఆలోచనలు కోరికలు గౌరవ మర్యాదలు
కావాలను కున్న మామూలు మనుషులం మనం
మంచిని పెంచాలని మంచిగా మెలగాలని
మనస్పూర్తిగా మదిలో కోరుకున్న
మనసున్న మనుషులం
క్షమాగుణం సహనం
శాంతి దయ జాలి కరుణ
కొంచెం కొంచెంగా పెంచుకున్న
ఆసలైన ఆడువారు
ఆవేశం వీడి ఆలోచనలో
తమ ఉనికిని గుర్తించి తెలివిగా
పరిస్తితులను ఎదుర్కోవలసిన ఆవశ్యకత
అప్పుడు ఇప్పుడు ఆడువారిమీద అల్లానే ఉంది
వారేదో అన్నారని వీరేదో వ్రాసారని అనుకునేకన్న
ఆడువారు ఆడువారిలా ఉంటె అందంగా ఉంటుంది
మగవారి ఆలోచనా విధానాలలో మార్పులు తీసుకు రావడానికి
ఆడువారు తమ వంతు కృషి తప్పని సరిగా చేయాలి
సమాజంలో ఎప్పటినుండో పాతుకుపోయిన మూఢ నమ్మకాలకు స్వస్తి చెప్పి
శీలానికి మించిన పవిత్రత మానవత్వం అని తెలుసుకుని
న్యాయ అన్యాయాలను అవగాహన చేసుకునే విధంగా
ప్రతి దంపతులు తమ వంతు సహకారం తమ పిల్లలకు అందచేయాలి
తనకు చేరిచిన వారి తలతీయిన్చ్డానికి తల ఎత్తి నిలిచే స్త్రీ గా ఎదగాలి
సహజంగా సిగ్గును తమలో పొండుపరచుకున్న ఆడువారు
తమ ఎదుట తప్పుగా ప్రవర్తించిన వారికి తగిన బుద్ది చెప్పాలి
ఆడుదానిని ఎ మగవాడైనా తలెత్తి చూడడానికి కూడా భయపడాలి
వేష ధారణ ఏదైనా మాటతీరు ఏదైనా రంగురూపు ఏమైనా
ఆడువారిని అవహేళన చేసే అధికారం ఎవ్వరికి లేదు
వాడు మొగుడైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా
మగవాడు మగవాడే
వాడి వాడి చూపులతో
ఆడువారిని చూడడం
మగవాడిని పట్టి పీడిస్తున్న వైరస్
చనిపోయేవరకు ప్రతి మగవాడిలో ఉన్న
ఒకే ఒక భయంకరమైన వ్యాది లక్షణం
అందం సొంతం చేసుకోవాలనే
నిరంతర మధనం

rameshraju
rameshraju
8 years ago

మన సంస్కృతి ఆత్మీయ సంస్కృతి. అనాదిగా భారత దేశం లో స్త్రీలకు పురుషులచే పత్యేక గౌరవస్థానం ఇవ్వబడింది. కనుక రెచ్చగొట్టే దుస్తుల్లో ఉన్న మహిళను చూస్తే భారతీయ పురుషుడు జీర్ణించుకోలేడు. సౌకర్యం సాకుతో స్త్రీలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నంత కాలం అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ముందు మహిళలు గౌరవాన్ని తెచ్చిపెట్టే వస్త్రధారణ కలిగి యుండాలి, నిత్యం కనిపించే వ్యక్తికి లభించే గౌరవం కంటే అరుదుగా కనిపించే వ్యక్తికి గౌరవం లభించడం సహజం. అందుకే పూర్వం మహిళలకు అపూర్వ గౌరవం దక్కేది. కనుక మహిళలు మగరాయుడిలా రోడ్లపై ఎక్కువగా తిరగడం తగ్గించాలి. ఎన్ని చట్టాలు వచ్చినా లాభం ఉండదు. రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్ల ఆ గౌరవ స్థానం పోతుంది, పైపెచ్చు పురుషుల కంటికి లైంగిక వస్తువులగా కన్పిస్తారు. ప్రకృతి పరంగా స్త్రీ శరీర ఆకృతి పురుషుడిని ఆకర్షించేలా ఉంటుంది. ఆ ఆకృతి భర్తను ఆకర్షించేలా ఉండాలి కాని పరాయి పురుషులను ఆకర్షించేలా ఉండకూడదు. రెచ్చగోట్టే దుస్తులు వేసుకున్న అమ్మాయి అత్యాచారం చేయబడింది అంటే అన్నివేళలా కేవలం పురుషుడినే నిందించడం సరికాదు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నది లౌకిక సంస్కృతి కాబట్టి స్త్రీలు అక్కడ రోడ్లపై నగ్నంగా వెళ్ళినా, బికినీలో వెళ్ళినా పట్టింపు వుండదు. హక్కుల గురించి మాట్లాడం కంటే బాద్యతలు తెలుకోవడం మిన్న అని అందరూ గ్రహించాలి. ప్రశ్నించే తత్వాన్ని వీడి పూర్వం పెద్దలు పెట్టిన కట్టుబాట్లు స్త్రీల మంచి కోసమేనని నేటి మహిళలు గ్రహించాలి.

rameshraju
rameshraju
8 years ago

అమ్మాయిలు వేసు కునే కురచ దుస్తులు, వారి వస్త్ర ధారణ, మగ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి గనకే, అత్యాచారాలు జరుగు తున్నాయని,మగవాళ్ళ అత్యా చారాలకి ఆడవాళ్లే కారణమని చెప్పిన డి.జి. పి గారి వాఖ్యలు సమర్ధిస్తున్నాను. నూటికి నూరు పాళ్ళూ ఈ రోజుల్లో అమ్మాయిలు వేసుకొనే టైట్స్ జీన్స్, స్లీవ్ లెస్, షార్ట్ స్కర్ట్లు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఈ మధ్య హైదరాబాదు ఎర్రమంజిల్ కాలనీలో ఇద్దరమ్మాయిలను టైట్స్ మరియూ షార్ట్ స్కర్టు లో చూశాను. నాకే అదోరకంగా అనిపించింది. వారు పంజాబీ లో లేదా చీరలో ఉంటే గౌరవభావం కలిగి ఉండేది. దురదృష్టమేమిటంటే పెద్ద చదువులు, ఆర్ధిక స్వేచ్చ వలన అమ్మాయిలలో ప్రశ్నించే తత్వం పెరిగిపోయింది. అనాదిగా భారత దేశం లో స్త్రీలకు పత్యేక గౌరవస్థానం ఇవ్వబడింది. రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్ల ఆ గౌరవ స్థానం పోతుంది, ఫలితంగా లైంగిక వస్తువులగా కన్పిస్తారు. ప్రకృతి పరంగా స్త్రీ శరీర ఆకృతి పురుషుడిని ఆకర్షించేలా ఉంటుంది. రెచ్చగోట్టే దుస్తులు వేసుకున్న అమ్మాయి అత్యాచారం చేయబడింది అంటే అన్నివేళలా కేవలం పురుషుడినే నిందించడం సరికాదు. సౌకర్యం సాకుతో టైట్ జీన్స్, షార్డ్ స్కర్టులు వేసుకోవడం సరికాదు. స్త్రీలు తమకు ఇవ్వబడిన గౌరవ స్థానాన్ని దిగజార్చుకుని హక్కులు కోసం మాట్లాడటం సరికాదు.

Swetha
Swetha
8 years ago

చర్చ ఇక్కడ జరుగుతుంటే ఇంకో చోట గుసగుసలు వినిపిస్తున్నాయన్న మాట.
ఆరేళ్ళ అమ్మాయిలని , డెబ్బయి ఏళ్ళ ముసలమ్మలని కూడా ఇంగితం మర్చిపోయి మానభంగాలు చేసే మృగాల గురించి మాట్లాడరెందుకు?
ఆ వయసు వాళ్ళ వస్త్రధారణ కూడా మీకు అట్లాగే కనిపిస్తుందా? సమర్ధించుకోవటానికి కూడా హద్దులుండాలి.

Vanaja Tatineni
Vanaja Tatineni
8 years ago

ఈ లింక్ చూడండి.. కొంత మంది అభిప్రాయాలు మరింత తెలుస్తాయి.
http://* seperateandhra.blog. spot.in/2012/03/blog-post.html*
*remove stars and copy paste in your browser.

ప్రసాదు
ప్రసాదు
8 years ago

ఇంకో విషయం గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాదు ఒక చిత్రంలో ఆకాశంలోకి వింతగా చూస్తుంటాడు, అక్కడ ఉన్న జనం కూడా అక్కడ ఏమి వింతగా ఉంది అని తెలుసుకోవడానికి అదే చేస్తుంటారు.
ఇంతలో అలా వచ్చిన ఒక బాటసారి ఆత్రుతతో అడుగుతాడు ఎందుకు ఆకాశంలోకి చూస్తున్నారు అని, అక్కడ విఘ్నత లేని జనం పక్కవాడు చూస్తున్నాడు అని అంటారే తప్ప ఆలోచించారు, చివరిగా రాజేంద్ర ప్రసాదు ని అడిగితె మా ఊళ్ళో ఉన్నట్టే ఇక్కడ కూడా ఆకాశంలో మబ్బులు, ఆకాశం నీలి వర్ణంలో ఉంది అని చెబుతాడు.

ఇక్కడా అంతే, ఒకళ్ళకి పిచ్చి పట్టింది దాన్ని మిగిలిన వాళ్ళకి ఎక్కిచడం ఈ వస్త్ర ప్రపంచ …కోరులకు అలవాటు. అదే జరుగుతుంది. అసలు ఈ అసభ్య వస్త్రధారణ మొదలు పెట్టిన వారిని అడగాలి ఎందుకు ఇలాంటి వస్త్రాలు అందుబాటులోకి తెస్తున్నారు అని, నా అభిప్రాయం ముందే(ప్రత్యుత్తరము లో) తెలిపాను.

ప్రసాదు
ప్రసాదు
8 years ago

తయారు అవుతున్నది ఎందుకు
నాలుగురు కలిసి చెబితే అబద్దం నిజం అవుతుంది, ఇదీ అలాగే.

ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే వాటిలో మధ్య వర్తుల లాభాలు ఎక్కువ, చీరలు లంగా ఓణి లో నేత కార్మికులు రైతుల లాభాలు ఎక్కువ.

లాభం వచ్చే వాడే అబద్దాన్ని నిజంగా చూపించ గలడు.

gitasairam
gitasairam
8 years ago

కొందరు పెద్దవారు ఒకోసారి నోటికోచ్చినట్లు ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నట్లు మాట్లాడతారు అనడానికి ఇదో నిదర్శనం .. డి.జి.ఫై . దినేష్ రెడ్డి వూహించి వుండరు ఇంట రచ్చ అవుతుందని .. .. అధికారం ఒకటే చూసుకున్నారు గాని, తమ ఇంటిలో కూడా ఆడవారు వున్నారు అన్న సంగతి మరచిపోయి మాట్లాడారు .. వస్త్ర ధారణ రిజల్ట్ తరువాత సంగతి.. , ఆడవారు ఎందుకు బలహీనులుగా tayaaru cheya badutunnaaru, ఎందుకు laingika vivakshaku guri cheyabadutunnaaru annadi aa DGP కి తెలియదు ante evarainaa nammutaaraa ?

ప్రసాద్ గారు , మీరు అడిగిన ప్రశ్న బాగుంది .. kaani ఇంకో ప్రశ్న అడగడం మర్చిపోయారు …అలాంటి వస్త్రాలు ఎందుకు తయారు అవుతున్నాయి ? అని .. వస్త్రధారణ మీద కన్నా maanasika స్థితి గురించి ఆలోచించి వుంటే బాగుండేది …

Anonymous
Anonymous
8 years ago

Everything needs to be taken into account to solve this problem . And vulgar, sexually provocative way of dressing by women is just one of them too.

gitasairam
gitasairam
8 years ago

అది అపరిపక్వత కాదండి .. వాళ్ళ ఆలోచనా విధానం.. సమస్యని సైడ్ ట్రాక్ పట్టించాలనే ప్రయత్నం ..

Vanaja Tatineni
Vanaja Tatineni
8 years ago

ఈ చర్చ చాలా అవసరం.
లైంగిక దాడులు జరగడం వెనుక వస్త్రధారణ కన్నా లైంగిక దాడికి పాల్పడిన వారి మానసిక స్థితి..పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. ఇంట్లోకి జొరబడి లైంగిక దాడి జరిపే తుచ్చులు ఉన్నారు.
ఈ నాడు.. నైతికంగా దిగజార్చే,ప్రేరేపించే.. ప్రకటనలు,చిత్రాలు,అశ్లీల సాహిత్యం,సైట్లు,ఇవన్నీ మర్చిపోయి.. మహిళల వస్త్రధారణ గురించే మాట్లాడటం అపరిపక్వత కి చిహ్నం అనుకోవాలేమో!

Surfizenn
Surfizenn
8 years ago

The DGP did not say that skimpy clothes are the only factor accounting for sexual assaults. He just meant to say that they are one of the main factors encouraging sexual crime. Yeah I think he has got a point. It is not correct to unnecessarily paint him with misogyny, for he himself is the father of a pair of daughters. So his views have some validity backed by this fact. If his views are not logical, better lay bare that illogicality with your own logical arguments. But it is in bad taste to abuse him in feministically emotional and filthy language. When men cover all their body from top to toe, why are women exposing some parts of their body which are by nature exciting to men ? (knowing fully well that it could arouse men)

ప్రసాదు
ప్రసాదు
8 years ago

మీరు చెప్పింది నాకు కొంచం కూడా అర్ధం కాలేదు.
నా ప్రశ్నలకు బదులు చెప్పండి
అసలు అలాంటి వస్త్రాలు ఎందుకు వేసుకుంటారు
అబ్బాయి మంచి బాడీ బిల్దర్ అయితే అమ్మాయిలకు ఎలా ఉంటుంది

gitasairam
gitasairam
8 years ago

మేము ఈ మధ్య ఒక బట్టల షాప్ కి వెళ్ళాము .. పాప వద్దు అంటుంది . కాని తండ్రి గొడవ చేస్తున్నాడు , స్లీవ్ లెస్స్ డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా వున్నది తీసుకో మని … ఎవరిదీ తప్పు ?

ప్రసాదు
ప్రసాదు
8 years ago
Reply to  gitasairam

ఇద్దరిదీ కాదు చూపిస్తున్న వారిది.
ఒకప్పుడు కొండపల్లి బొమ్మలు అంటే జనాలకు ప్రాణం. వాటిని ఇప్పుడు తిరిగి ఉపయోగ పాడనీ Barbie Dolls తొక్కేస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు వస్త్ర ప్రపంచంలో గానీ వస్తు ప్రపంచలో గానీ వచ్చిన వాణిజ్య పోకడలు Advertisements, మొన్న ఒక Advertisement చూసాను అవేవో మాట్లాడే కదిలే బొమ్మలు, వాటి copyright ౨౦౦౮ అంటే నాలుగు సంవత్సరాలక్రితం బొమ్మలు, మరి వాటి గురంచి.
కొండపల్లి బొమ్మలు బాగోలేదు అని ౫వ తరగతి చదువుతున్న blogger ని చెప్పమనండి, తను తీసుకున్న barbie బొమ్మ గురించి వ్రాసింది గానీ తరువాత దాని వాళ్ళ పర్యావరణానికి కలిగే హాని గురంచి!
ఇక పొతే వీటి గురించి మాట్లాడు కుందాము.
ఈ క్రింది స్థాయిలో ఉన్న వారంటే అమ్మాయిలకు మోజు
ధనవంతులు, అందగాళ్ళు, సంస్కృతిని ద్వేషించే వాళ్ళు, అబద్దాన్ని అందంగా నిజంలా చూపించే వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు?
సరే మీరన్నట్టు వస్త్రధారణకు ఈ అత్యాచారాలకు సంబంధం లేదు అని, కానీ అలాంటి వస్త్ర ధారణా ఎందుకు చేసుకుంటున్నారు అని ఒక స్త్రీ ని అడగండి!.

Swetha
Swetha
8 years ago

వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన రేప్ చేసేస్తారా? విదేశాల్లో , పెద్ద నగరాల్లో స్త్రీలు నచ్చినట్టు డ్రెస్ చేసుకుంటారు. అక్కడి మగాళ్ళు దాన్ని పట్టించుకోరు కూడా. మన దేశంలోనే ఎందుకీ విపరీత బుద్ధి? సంప్రదాయం పేరు మీద తెగ నీతులు చెప్పే మగాళ్ళంతా పంచలు కట్టుకోవచ్చు కదా?ఎందుకు విదేశీ వస్త్రధారణ?.

rameshraju
rameshraju
7 years ago
Reply to  Swetha

ఇతర దేశాల సంస్కృతులతో మనల్ని పోల్చుకోవడం సరికాదు. అక్క స్త్రీ గుడ్డలు విప్పేసి తిరిగినా పట్టించుకోరని అంటున్నారు. కాని అక్కడ కూడా రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. వారిది లౌకిక సంస్కృతి, మనది ఆత్మీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఒక పవిత్ర స్థానం ఇవ్వబడింది. హిందూ గ్రంధాల్లో స్త్రీ దేవతా స్వరూపిణిగా చెప్పబడింది. పూర్వం బయట తిరిగే స్త్రీలను పరాయి తెగలవారు ఎత్తుకుపోయి చెరచేవారు. స్వపురుషులు తమ స్త్రీలను కాపాడుకోవడానికి కొన్ని కట్టుబాట్లను ప్రవేశబెట్టారు. అందులో భాగంగా స్త్రీలు ఎక్కువగా ఇంటిపట్టున ఉండేవారు, వారికి గౌరవం పెరిగేది. రోజూ కనిపించే వ్యక్తికంటే అరుదుగా కనిపించే వ్యక్తికి గౌరవం లభించడం సహజం. ఆనాడు స్త్రీలు ఇంటిపట్టున ఉండి అరుదుగా కనిపించేవారు కాబట్టి వారికి ఎక్కువ గౌరవం దక్కేది. కాని స్త్రీ కాని నేటి స్త్రేలు కట్టుబాట్లనే ప్రశ్నించే స్థాయికి ఎదికిపోయారు. పూర్వం నుండీ పవిత్రంగా భావించబడ్డ స్త్రీ నేడు సరైన బట్టలేకుండా తిరుగుతుంటే పురుషులకు జీర్ణించుకోవడం కష్టమే. సౌకర్యం సాకుతో లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులువేసుకొని తిరుగుతుంటే పురుషుల దృష్టిలో వారి మీద పూర్వం నుండీ అప్పటి వరకూ ఉన్న గౌరవం పోవడం సహజం. ఈనాడు స్త్రీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా కేవలం విలాస వస్తువుగా భావించబడుతోంది. ఏది ఏమైనా భారతీయ స్త్రీ అలా రోడ్ల పైకి రెచ్చగొట్టే దుస్తుల్లో రావడం దురదృష్టకరం. ఈ మధ్య ఢిల్లీలో సిగ్గు లేకుండా కొంతమంది అమ్మాయిలు ‘మేం ఏం డ్రస్సు వేసుకుంటే మీకేంటీ అని స్లట్ వాక్ చేసారు. డిజిపి దినేష్ రెడ్డి గారు అన్న మాటలు సరైనవే. రేప్ కేసులు పెరిగిపోవడానికి ఒక కారణం అమ్మాయిలు రెచ్చ గొట్టే దుస్తులు వేసుకొవడం అని అన్నారు.

vanaja .y
vanaja .y
8 years ago

స్త్రీ లైంగిక దాడుల కోసం చర్చ చాల బాగుంది .