ప్రశ్నించే స్త్రీల అనుభవాల కథనాల వ్యధలు ట్రోల్స్ (వ్యాసం) – వెంకట్ కట్టూరి

“నువ్వు నాలో సగ భాగమేమిటి?
నేనే నీ అర్ధాన్ని.
నువ్వొక్కతివే పూర్ణాకాశానివి
నేను నీ ఛాయాచిత్రాన్ని మాత్రమే”.
ఇది అక్షర సత్యం.ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీఉంటుంది. కానీ ఆ స్త్రీకి గుర్తింపు ఇస్తున్నామా? నేటి ఆధునిక సమాజంలో స్త్రీకి మనం అనుకున్న స్థాయిలో స్థానమిస్తున్నామా? అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి.
మన ఉమ్మడి రాష్ట్రాలలో ప్రధాన రాజకీయ పార్టీలు మరియు సామాజిక మాధ్యమాల సంస్థల సమూహాల ఆధిపత్య పోరులో,అభ్యుదయవాదులం అని చెప్పుకుంటూ….స్త్రీలు,స్తీవాద రచయితలు,వారికి అండగా నిలబడే సామాజిక కార్యకర్తలను,మహిళా సంఘాల నేతలను,ఐద్వా వంటి సంస్థలను,మహిళా జర్నలిస్ట్ లను, మహిళా సాధికారత కై పోరాటం చేస్తున్న సంస్థలను,ఉన్నత విద్యావంతులైన మహిళలలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంతెందుకు ఈ మధ్యనే ఒక సాధారణ గృహిణి జీవితం సామాజిక మాధ్యమాల ట్రోల్స్ వల్ల అర్దాంతరంగా ముగిసి పోయింది.దీనికి ఎవరు బాధ్యులు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి?ఆ తల్లిని కోల్పోయిన బిడ్డలకి, ఆమె జీవిత భాగస్వామి కి న్యాయం జరిగేదెలా? ఈ అకృత్యాలు ఇక్కడితోనే ఆగిపోతాయా ? ఇంకెందర్ని బలితీసుకుంటారు? ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు.పాలక పక్షమా,ప్రతిపక్షాలా? అని ప్రశ్నించే గొంతులకే తప్పడం లేదు ఈ సామాజిక ప్రసార మాధ్యమాల వేధింపులు.వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఈ రాజకీయ,సామాజిక మాధ్యమాల కార్పొరేట్ సంస్థలు.అదీకాక వ్యక్తిగత కక్షతో ఎదుటి వారి ఎదుగుదలను తట్టుకోలేక, వేధింపులకు గురిచేసే కుహనా మేథావులు మరికొందరు. వీటిని పెంచి పోషించేది ప్రధాన రాజకీయ పార్టీలే.వీటికి కొనసాగింపుగా కొన్ని మతతత్వ శక్తులు కూడా వంత పాడుతూ ఉన్నాయి.వీటి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది.వీళ్ళంతా భావప్రకటన స్వేచ్ఛ పేరుతో పేస్బుక్,వాట్సప్,మెసెంజర్ లలో అశ్లీల రాతలు రాస్తూ, వ్యక్తిత్వహననానని గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.ఇలాంటి ప్రభుద్దుల పిచ్చి రాతలకి బలైపోయిన అభాగ్యులెందరో.
“ప్రశ్నించడం అలవాటు. ప్రశ్నించకుండా ఉంటే ఎలా “?అని గొంతెత్తి నినదించిన ఆ గొంతునే బెదిరింపులకి గురిచేసి,బెదరగొట్టి చివరకు కాపురాలనే కూల్చివేసిన ఘనత మన సామాజిక మాధ్యమాల నిర్వాహకులది. బహిరంగ సభల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్లు అని గొంతు చించుకు అరుస్తూ,మరోపక్క ఒక ఆడది మనల్ని ప్రశ్నించడమా?…అంటూ ఘీంకరించే మహానుభావులెందరో.సమాజంలో ప్రశ్నించే గొంతునే మానసికంగా వేధించి,వ్యక్తిత్వ హననానని గురిచేస్తే ఎలా? వీళ్ళనే ఇలా వేధిస్తే, ఇక సామాన్య మహిళ సమాజంలో ఎలా మనుగడ సాధిస్తుంది.
వ్యక్తి గా జీవించడం
కాదు.వ్యవస్థగా జీవించడం ముఖ్యం.

“స్త్రీ తన స్వేచ్ఛనే భయంకరంగా చేసిన పురుషుడు ఆమెకి స్వేచ్ఛని తిరిగి నేర్పాలి”.ఇపుడున్న కాలంలో ఇది ఊహకందని విషయమే.ప్రతి పురుషుడుకీ స్వేచ్ఛగా తిరిగే స్త్రీని చూస్తే ఇష్టమే. కానీ ఆమె మరొకరి భార్య కావాలని కోరుకుంటాడు.ఇదెంత దుర్మార్గపు ఆలోచనో కదా.చలం అనట్లు ఆధునిక సమాజంలో “స్త్రీ ఆర్థిక స్వతంతత్రురాలై, ధైర్యశాలీ,అనుభవశాలీ,ధీరురాలూ కాగానే, ఆమె సంతతి కూడా అట్లానే మారుతుంది”అనేది అక్షర సత్యం.

ఈమధ్య ఎవరైనా మహిళ సరదాగా ఒక పోస్ట్ పెడితే సవాలక్ష ప్రశ్నలు వేస్తూ,వెకిలిగా ట్రోల్ చేస్తూ సునకానందం పొందే మహామహులు ఎందరో.’నిజం గుమ్మం దాటేలోపు అబద్దం ఊరంతా చుట్టి వచ్చేస్తుంది’ అనే సామెత లా ఉంది. నేటి సామాజిక మాధ్యమాల తీరు.నిజ నిజాలు గ్రహించకుండా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ,కుటుంబాలనే కూల్చేస్తున్నారు.మహిళలను ట్రోల్స్ చేస్తే ఆమె వెనకున్న కుటుంబ సభ్యులు ఎంతటి మానసిక క్షోభకు గురౌతారో ఈ నెటిజన్లు గుర్తిస్తే బావుండేది.

ఒంటరి మహిళ అనితెలియగానే ట్రోల్స్(వేధించడానికి) చేయడానికి ముందువరుసలో ఉంటారు.ఈ ఆధునిక మనువాదులు.ఇక దళిత మైనార్టీల కుటుంబాలకు చెందిన ఉన్నతవిద్యావంతుల పరిస్థితి మరీ దారుణం.ఇంటా బయటా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.జాతి వైరం మరిచి జంతువులే కలిసి మెలిసి జీవిస్తున్న లోకంలో, సాటి మనిషి వ్యక్తిత్వాన్ని కించపరిచి, ఆనందం పొందే ఈ మానవ(మృగ)జాతిని ఏమనాలి? ఇక ట్రోల్స్ చేయడంలో మగవాళ్లు ఒక్కళ్ళే అనుకొంటే పొరపాటే.విద్యావంతులైన మహిళామహారాణులు కూడా అసూయ,అక్కసుతో మగవారితో సమానంగా అశ్లీల, అసభ్య పదజాలంతో, వ్యక్తిత్వహననానికి గురిచేస్తూ మగవారితో పోటీపడుతున్నారు. “ఒక దళిత స్త్రీ ఆధునిక ఆలోచనలను, నిర్భీదితత్వాన్నీ చాలామంది దళితవాదులు,ఆఖరికి చాలామంది స్త్రీవాదులే స్వాగతించ లేకపోయారు. వారి లోపల జీర్ణించుకుని ఉన్న పితృ స్వామ్య అవశేషాలు, ఒక అణచివేయబడ్డ స్త్రీ నుండి వచ్చిన ధిక్కారాన్ని ఒప్పుకోనివ్వకుండా చేసాయి.”అని రచయిత, సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు అరుణ గోగుల మండ రాసిన వ్యాసంలో, ప్రశ్నించే గొంతును అభ్యుదయ వాదులుగా చెలామణి అవుతూ, ఎంతలా వేధింపులకు(ట్రోల్స్ చేస్తూ) భయబ్రాంతులకు గురిచేసి వేధించారో మనం గమనించవచ్చు. ఈ ప్రశ్నించే గొంతుకకు బాసటగా నిలబడకపోయినా పర్లేదు.వేధించకుండా ఉంటే అదే పదివేలు.

“నిన్నటిదాకా
అణిచివేయబడ్డాను
ఇవాళ నేను
అంతర్జాతీయమయ్యాను
నేనిప్పుడు కొత్తమహిళను.”
అని చెప్పిన డా.పుట్ల హేమలత ఆకాంక్ష నెరవేరితే ఎంత బావుండు.ఆకాశంలోను,అంతర్జాలంలోను విహంగాలై విహరించే ఈ గొంతుకలకు తోడుగా నిలబడాలి.

ఆడ,మగ కలిసిన రూపంలో దర్శనమిచ్చే శివుణ్ణి దేవుడిగా పూజిస్తున్నాం. మరి ట్రాన్సజెండర్ గా పుట్టిన వ్యక్తులనేమో షోషల్ మీడియాలోనూ, సమాజంలోనూ,వ్యక్తిగతంగానూ గేలి చేస్తున్నాం.ఇదెక్కడి న్యాయం?ట్రోలింగ్స్ ని అరికట్టడం ఒక కల. “మూకదాడికి మూకుమ్మడి ఖండన ఒక పరిష్కారం”అని పిలుపు నిస్తున్నారు డా.సౌమ్య.వారి కోరిక నెరవేరాలి.శిలువను మోసిన క్రీస్తులా అనునిత్యం ట్రోల్స్ కి గురై సమాజంలో వివక్షకు గురవుతున్న సహనశీలురకు బాసటగా మనందరం నిలబడాలి. కరోనా సమయంలో చప్పట్లు కొట్టండి అనే మోడీ పిలుపు వ్యతిరేకంగా, బోర్డు మీద ‘సైన్సు మాత్రమే నమ్మండి సనాతన ధర్మమును పారద్రోలండీ’ అని పిలుపునిచ్చిన సామాజిక కార్యకర్త కాగుల శ్రీదేవిని ఎంతలా వేధించారో.అలాంటి సమయంలో కుటుంబ సభ్యుల అండతో ‘సత్యాన్ని చెప్పాలనుకోవడం కూడా యుద్ధం లాంటిదే’ అని చాటి చెప్పారు. ట్రోలర్స్ ఏకమైనంత ధృడంగా బాధితులు ఏకం కాలేరు. ఇటువంటి వాటి మీద స్పందించి అండగా నిలబడే ‘ఆలంబన వ్యవస్థ’ను తయారు చేసుకోవాలి.గౌరవం పొందడం నాహక్కు అని పిలుపుస్తున్నారు ప్రరవే సభ్యులు డా.కె.ఎన్ మల్లీశ్వరి. సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అంత ద్వేషానికి కారణం ఏమై ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది.’ట్రోలింగ్ అంటే పూర్తి విరుద్ధ భావజాలం ఉన్నవాళ్ళే చేస్తారని ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మన స్నేహ వర్గాల్లో ఉన్నవాళ్ల నుంచి ఆ చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటిని సమిష్టి కార్యాచరణతో ఎదుర్కోవాలి’అని పిలుపునిస్తున్నారు జర్నలిస్ట్ కె.సజయ. సామాజిక మాధ్యమాల్లో నాకు తెలిసి ఎవరి మీదైనా ట్రోలింగ్ జరిగినప్పుడు నేను తప్పకుండా వారి పక్షాన నిలబడతాను.

రాయదలుచుకున్నది,చెప్పదలుచుకున్నది ఎలాంటి జంకు లేకుండా భయం లేకుండా రాయడమే నాకు అలవాటు. ‘ఎవరు ఎంత దాడి చేసినా, ఎవరు ఎంత వ్యతిరేకించినా మహిళల పట్ల అవమానకరమైన, ఆమానవీయమైన భాషను ఎవరు వాడినా ఎట్టి పరిస్థితుల సహించను. ఎవరో ఒకరు నిలబడటం కాదు ఆ ఒకరు మనమే కావాలని చెబుతున్నారు.’భూమిక’సంపాదకులు కొండవీటి సత్యవతి. ఒక మహిళ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఎదిరించాలి? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ?ఎందుకు మమ్మల్ని నిలదీయాలి ?అనే పురుషాధిక్య అహంకారాన్ని చూస్తూనే ఉంటాము. ట్రోలింగ్ అనేది అంతం కాదు. అది మర్రిచెట్టులా పెరుగుతూనే ఉంటుంది.ఊడలుగా విస్తరిస్తూనే ఉంటుంది. కానీ ‘సామాజికంగా అన్యాయం ఎదుర్కోవడానికి మన గొంతు వినిపించడమే ప్రధానమైనది’అని చెబుతున్నారు సామాజిక ఉద్యమకారిణి ఖలీదా పర్వీన్. ‘సత్యం మన గతాన్ని వర్తమానాన్ని’భవిష్యత్తును శాసించనంత కాలం ట్రోల్ ఫ్యాక్టరీలు ఏమీ చేయలేవు.మన చుట్టూ ఉన్న ట్రోల్ మనస్తత్వాలు ఏమీ చేయలేవు.ట్రోల్ బాధితురాలిగా నిత్యపోరాటం చేస్తూ వాటిని ఎదుర్కొంటూ సమాజానికి మనవంతు సాయం చేస్తూ,స్వతంత్ర జర్నలిస్ట్ గా నిఖార్సయిన వార్తలు అందిస్తూ ప్రజలను మేల్కొలపాలని చెబుతున్నారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చందు తులసి. సమాజంలో ఏం జరిగినా మీకు మేమున్నాం అని బాధితులకు భరోసా ఇచ్చే ఒక సిస్టం అవసరం.

ముఖ్యంగా మనిషిగా ఎలా బతకాలి అనే బేసిక్ పాఠాలు కూడా అందరికీ చెప్పడం అవసరం. ‘తమ మీద ట్రోలింగ్ జరుగుతుందని చెప్పినప్పుడు దీటుగా తిరగబడి,చట్ట పరంగా చర్యలు తీసుకోవడం. లేకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేసి తన పని తాను చేసుకుంటూ పోవాలి అని పిలుపునిస్తున్నారు సోషల్ యాక్టివిస్ట్ దీప్తి సిర్ల. ట్రోలింగ్ తో ఉన్న సమస్య భిన్నమైనది. ముఖ్యంగా ప్రశ్నించదలుచుకున్న వాళ్ళని,ఉద్యమాల్లోకి రావాలనుకునే ఉత్సాహవంతులను వెనక్కి నెడతాయి ఈ ట్రోల్స్. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ వాదనల్ని ఎదుర్కోవాలి. ఈ పని చేయడానికి ఓపిక,జ్ఞానము రెండు అవసరం. దానికోసం బహుశా ఒక ‘యాంటీ రాత ఆర్మీ తయారు కావాల్సి రావచ్చు’. ఏది ఏమైనా ట్రోలింగ్ అనేది టెక్నాలజీ యొక్క చీకటి రూపం.దీన్ని సమిష్టిగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి.అని పిలుపునిస్తున్నారు సాంస్కృతిక కార్యకర్త దేవి. ట్రోల్స్ చేయడం మానసిక అనారోగ్యం అని చెబుతున్నారు కవి,నటకకర్త మెర్సీ మార్గరెట్.’నీతి అనేది బూతుగా తయారైంది.ఎదుటి వాళ్లతో ఎలా వ్యవహరించాలో ఇంట్లోనే మొదలవ్వాలి అంటూ, పాఠశాలల్లో కూడా సామాజిక మాధ్యమాలు ఎలా వాడాలి అనే పాఠం చేర్చాలి. ఏ సమాచారం నిజం, ఏది కాదనేది ఎలా వెతకాలో చెప్పాలి.

ఇపుడు ముఖ్యంగా మతాలు ,కులాలుగా కాదు మానవత్వం గొప్పదని,పిల్లలకు నొక్కి చెప్పాల్సిన సందర్భం ఇది’.అని నేటి సమాజానికి చెబుతున్నారు. సమాజంలో పెరుగుతున్న ఈ ‘ట్రోలింగ్ అరికట్టడానికి ,పౌర సమాజ స్పందన-మద్దతు, మీడియా ఎంపతీతో వ్యవహరించడం, సమూహాలుగా శ్రేణులు స్పందించడం,ప్రజా ఉద్యమాల నిర్వహించడం, చట్టాల సమగ్ర అమలు మాత్రమే ఈ ట్రోలింగ్ ను కొంత మేరకు అరికడుతుందని’ చెప్తున్నారు. ‘మాతృక’ పత్రిక సంపాదకురాలు వి. సంధ్య.

ఈ మధ్య కాలంలో మీడియాలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్లు గా పనిచేసే వాళ్లను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలు నమ్మే వాళ్ళ ట్రోలింగ్ మరో లెవల్లో ఉంటుందంటూ చెబుతున్నారు. తెలుగు టీవీలో తొలి మహిళా యాంకర్ రిపోర్టర్ సి.వనజ. దాదాపు అందరం ట్రోలింగ్ కి గురవుతున్నాం. కనుక ఒకరికొకరు తోడుగా ఓదార్పుగా ఉండటం మాత్రమే చేయగలిగింది. ఈ ట్రోలింగ్ ని ఆపాలన్న పొలిటికల్ విల్ ఉంటేనే ఇవి ఆగుతాయి.కాబట్టి పౌర సమాజంతో పాటు పాలకులు,ప్రభుత్వం ప్రజాపక్షం వహిస్తే ఈ భౌతికదాడులు,ఆన్లైన్ వేధింపులు అగుతాయి. రాబోయే రోజుల్లోనైనా నెరవేరితే అదే పదివేలు. ‘ట్రోల్స్ ఎంత బాధించాయో అంత స్పష్టత ఇచ్చాయి అంటారు ప్రొఫెసర్, నూరేపల్లి సుజాత. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది.’అణగారిన ప్రజలే నాకు గురువులు, జీవితాన్ని నేర్పించిన వాళ్ళు, ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమాలు చేసేవాళ్లు ఆదర్శం అని చెబుతారు.’మలితరం తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమాలకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎన్నో వ్యాసాలు రాసాను. ప్రజలను చైతన్య వంతులను చేసాను.ఆ రాతల ద్వారా ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నారు. ఈ విధమైన ట్రోలింగ్ అరికట్టడం సాధ్యమని చెప్పలేను. కానీ మనం దూరంగా ఉండటం సాధ్యమని చెబుతున్నాతూ, నా వరకైతే ట్రోల్స్ ఎంత బాధ పెట్టాయో అంతే స్థాయిలో చేసే పనిలో మరింత స్పష్టతను పెంచాయని చెబుతున్నారు.సమాజంలో వార్తలు రాయడం తోనే కాకుండా,సామాన్య ప్రజానీకాన్ని ఆలోచింపజేసే కార్టూన్లు ఎంత ప్రభావం చూపుతాయో,అవి ఉన్నత వర్గాల వారిని,హిందుత్వ వాదులను ఎంత అలజడికి గురిచేస్తాయో జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడి వేసిన కార్టూన్ చెబుతుంది.

ఇక ఈ ప్రశ్నించే స్త్రీల అనుభవ కథనాలు ‘ట్రోల్’ కథనాల వరుసలో మహిళా రచయితలు, సామాజిక వేత్తలు,జర్నలిస్టులు,ప్రొఫెసర్లు, మహిళా సంఘాల ఉద్యమ కారులు,పత్రికా సంపాదకులు ఈ ఆధునిక పితృస్వామ్య సమాజంలో ఎదుర్కొన్న వేధింపులు, వాటి తాలూకా అనుభవాలను ఈ ‘ట్రోల్ ‘సంకలనం లో వివరించారు.’ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక’సభ్యులు డా.కె.ఎన్ మల్లీశ్వరి, ప్రొ. కాత్యాయని విద్మహే గార్లు సంపాదకులుగా తెలుసువచ్చిన ఈ సంకలనం లోని స్త్రీలు అందరూ ప్రశ్నించారు. మతతత్వాన్ని నిలదీసారు.సమానత్వం కోరుతున్నారు.సమనహక్కు కల్పించవలసిన అవసరాన్ని వివరించారు.సామాజిక మాధ్యమాలలో చేసే ట్రోల్స్ ని ఎలా ఎదుర్కోవాలో చెప్పారు.దైర్యంగా నిలబడి కలబడి ఎదుటి వ్యక్తి ఎంతటి గొప్పవాడైనా సరే సూటిగా సమాధానం చెప్పి, ఆధునిక మహిళ శక్తి ఎంత గొప్పదో నిరూపించాలని పిలుపు నిస్తున్నారు.బరితెగించి బలాదూర్ గా తిరిగే వ్యక్తులం గాదు. సమాజం పట్ల బాధ్యతతో మెలిగే మానవతా మూర్తులం అని సాటి చెప్పారు ఈ ఆధునిక స్త్రీలు.డా.పుట్ల హేమలత గారనట్లు…

“నేను మానవిని!
నన్ను నేను కనుగొన్న కొత్త దీవిని…
నేనొక కొత్త దీపాన్ని..
నేనొక కొత్త రూపాన్ని..
నేనిప్పుడు కొత్త మహిళను!
ఆరని జ్వాలను!!”
ఈ వ్యాఖ్యలు నిజమైతే ఈ కొత్త దీపాలకి,సరికొత్త రూపాలకు తమ కుటుంబ సభ్యులు,వ్యవస్థలు అండగా నిలబడాలి.అప్పడే వారు భావి భారతాన్ని నిర్మించి,మహిళాభ్యదయం సాధిస్తారు ఈ వేగుచుక్కలు.ముఖ్యంగా ప్రశ్నించే గొంతులకు అండగా నిలబడదాం.

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో