ఆది నుండి నా
నివాసం చెరువు..
నేను చెరువులోని
నిర్మలమైన నీటిని..
జీవ జంతువులకు..
దూప తీర్చే తీర్థాన్ని.
పంట పొలాలకు..
దిక్కూ-మెక్కును..
జనుల ఆకలి తీర్చే
అన్న దాతను..
మట్టిలో మాణిక్యాన్ని..
బురదని ..
బురదలో మేలు చేసే పురుగుని..
నేను జీవిని ..
నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని..
కాని స్వార్థ భక్తులు
అర్థం కోసం..
స్వార్థం కోసం
నన్ను నిరర్థకంగా
నిరంతరం..
నామీద బలవంతంగా ..
రకరకాల రంగులు వేసి..
పీఓపీ పూతలు పూసి..
సంవత్సరానికో
అడుగును పెంచి..
మరింత పొడుగును చేసి..
బుడుగులకు దూరం చేసి..
బజారుకిడిసి..
ముత్తును తాగీ
గమత్తూ చేసి
ఆ ముత్తులో
బూతుల భజన చేసి..
వేకిలి డ్యాన్సులు వేసి
మసిపూసి
మారేడికాయ జేసీ..
ఖుసి-ఖుసిగా ..
నా నిర్మలమైన నీటిని
కలుసితం చేసి..
జీవ-జంతువులను ..
నిర్జీవులుగా మార్చి..
చూసి చూసి…
చూసి చూడనట్లు జేసీ..
ముక్కు మూసి..
మూసిని కలుసితం జేసీ..
ఆపైన అపవిత్రం జెసి..
నన్ను నిర్వాసతుణ్ణి చేసి..
తను విశేష శేషమని…!?
విర్రవీగుతున్నాడీస్వార్థ భక్తుడు..!?
-డా. బొంద్యాలు బానోత్ (భరత్ నాయక్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~