రంగురంగుల ప్రపంచంలో
ముసుగు వేసుకుని తిరిగే
నిజాలెన్నో
కళ్ళను మోసం చేసే
మాయలెన్నో
చడి చప్పుడు కాకుండా
తిరిగే రహస్యాలు
ఎన్నో
ఈ గందరగోళాలు,
హడావిడి మధ్యలో
ఓ మానవుడు
ఏం చేయాలో
ఎక్కడికి చేరాలో
తెలియక అయోమయ
అవస్థలో
ఏది చేయొచ్చు
ఏది తప్పో తెలియని
భయోపోహ అవస్థలో
అది ఇది అని తెలియని
దారి వెంబడి వీటన్నింటి
మధ్యలో సాగిపోతున్నాడు .
ఆ అమాయకపు మానవుడు
ఏమవుతాడో ?
ఎక్కడికి చేరుకుంటాడో?
పైనుంచి చూసే
ఆ భగవంతుడికే తెలియాలి.
– శశి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~