ఆమె ఆడాల్సిందే
కానీ ఏ ఆటో వాడే నిర్ణయించాలి
ఆమె కుస్తీ
పతకం తెచ్చినా వాడి చూపులో
అదే లోదృష్టి
రాజధాని నగరం నడి వీధిలో
ఆమె కంట కన్నీరు
వాడు తొణకడు
వాడు మను వారసుడు
అంగాంగ ప్రదర్శనకై వాడు ఆరాటం
తీరొక్క పట్టులతో పతకం కై ఆమె పోరు
ఆమెకి అండగా కదలదు సంఘం
సంఘం వాడి కను సన్ననలో కునారిల్లు
అనాదిగా ఆమె పై అదే దాడి
న్యాయం సుమోటో గా స్వీకరించలేని
వాడి ధృతరాష్ట్ర పాలన
కుస్తీ మైదానంలో
పట్టు పట్టాల్సిన చేతులు న్యాయం కోసం అర్థిస్తుంటే
మౌని మనువు స్వపక్ష రక్షణలో నిర్లజ్జగా
తల్లీ!
నువ్విలా దీనంగా పలవరించకు!
రాజ్యాన్ని అంతర్లీనంగా నడిపిస్తున్న మనువు ను చంపే
పదును చేతులకు కల్పించు
ఆలోచనలకు పదును పెట్టే మెదడు కు చురకంటించు
ఇక ఆయుధం ఏంటో నీ ఇష్టం!
ఏదైతే నిన్ను రక్షించగలదో అదే !!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~