ఆమె తలంపు
తీరాన్ని దాటి
శిఖరాన్ని చేరింది!
చేతిలో జెండా మురిసింది!
ఆమె
తనువు
ఆమె కఠోర శ్రమ కి
చరమ గీతం పాడేసింది!
ఆమె మేను
పట్టిన కుస్తీలకు గుల్ల కాలేదు
జీవచ్చవ సంఘ గొంతు పెగలక
ముక్కలైంది !
ఆమె గొంతు
అరచి అరచి
అరణ్య రోదన గా
రామ రాజ్యంలో రాముడే నెగ్గాడు!
రాజధాని వీధుల్లో నిరసన
లాఠీ ల స్వైర విహారం
ఆమె పోరాటం
మనువుని మట్టు పెట్టలేక పోయింది
ఆమె
ఎప్పుడూ లోకువే
పుట్టిన కాడి నుండి కాటికి పోయేదాకా
ఎండగట్టాల్సిన సమాజం
గాఢ నిద్ర నటింపు
థూ! థూ!
ఊంచినా తుడుసుకు పోయే
ఆధిపత్య వర్గాల తెరవెనుక తతంగాల
తెర తీయగా
సమాధులు తవ్వాలి! పూడ్చితే మళ్ళీ లేవకుండా!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~