జ్ఞాపకం- 95 – అంగులూరి అంజనీదేవి

“ఏ పని? సమాధి కట్టించటమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్ గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్లు, పెళ్లి చేసినట్లు, పిల్లల్ని చదివించినట్లు. అసలు నీకేం పనిలేదానే? ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావ్!” అన్నాడు తిలక్.

“ఇల్లు కట్టించటం, చదువులు చెప్పించటం, పెళ్లిళ్లు చెయ్యటం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించటం పిల్లలే చెయ్యాలి. అది పిల్లల పని. తప్పనిసరిగా పిల్లలు చెయ్యాల్సిన పని. అనాదిగా చేస్తున్న పని. అందుకే ప్రతి ఊరికో స్మశానం వుంది. అందులో సమాధులు వున్నాయి. మనుషులు వున్నట్లే సమాధులు కూడా వుంటాయి. దీన్ని ఎవరు వద్దంటారో చెప్పు” అంది.

“నేను వద్దంటున్నాను!”
“ఎందుకు వద్దంటున్నావ్?”
“నాకది అవసరంలేదు”
“ఇది అవసరం కాదు. ఆచారం”

“ఆచారాలు, మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయి?”
“ఇది ఆత్మ తృప్తికోసం, తండ్రి ఋణం తీర్చుకోవటం కోసం చెయ్యాల్సిన పని. ఆచారాలకోసం, మూఢనమ్మకాల కోసం కాదు”

“ఆ పనేదో నువ్వే చెయ్యి. ఆయనకు నాలాగే నువ్వూ పుట్టావ్. ఆయన ఋణాన్ని నువ్వు కూడా తీర్చుకోవాలిగా. పైగా పొలం అమ్మి పెద్దింటికి కోడల్ని చేశాడు నిన్ను. నాకన్నా నీ దగ్గరే డబ్బులు ఎక్కువున్నాయి” అన్నాడు తిలక్.
జుట్టు బాగా తెల్లబడిన ఇద్దరు ఆడవాళ్లు తిలక్ మాటలు విని బుగ్గలు నొక్కుకుంటూ “నువ్వేం కొడుకువురా! ఆడపిల్లను తండ్రికి సమాధి కట్టించమని అడుగుతున్నావ్. పైగా చెల్లెల్ని ఇంటికి తీసుకుపోయి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా చెట్టుకింద కూర్చోబెట్టి మాట్లాడతావా? నీ కసలు బుద్దివుందా?” అన్నారు.

“మీకేం తెలిసి మాట్లాడుతున్నారు? మా నాన్న నాకన్నా దీన్నే స్పెషల్ గా చూసుకున్నాడు. ఇదిప్పుడు మంచి పేరున్న రచయిత్రి అయ్యింది. తండ్రికి ఆమాత్రం చెయ్యలేదా?”
“తండ్రికి సమాధి కట్టించటం కొడుకులే చేస్తారు నాయనా! కూతుళ్లు అలాంటి పనులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. చేశారా ఇకవాళ్ల జన్మ ధన్యమైనట్లే. అది ఎంతమందికి దక్కుతుంది? ఎంత పుణ్యం చేసుకొని పుట్టాలి?” అంది వాళ్లలో ఒక పెద్దావిడ.

తిలక్ ఆమెను కొట్టేలా చూసి “అసలెక్కడున్నాయి మీరు చెప్పే ఈ పిచ్చిమాటలు? మొన్న ఇక్కడో ప్రొఫెసర్ చనిపోతే యూనివర్శిటీ వాళ్లు ఇచ్చిన డబ్బులు ఐస్ బాక్స్ కి, ఆయన్ని స్మశానం వరకు తీసికెళ్లే బండికి, ఆరోజు వచ్చిన వాళ్ల తిండికి మాత్రమే సరిపోగా, మిగతా కర్మలకి వాళ్ల బంధువులెవరో అప్పుగా ఇస్తే చేశారట. ఆయన సంపాయించిన డబ్బును బయటకి కన్పించనీయకుండా దాచుకున్నారు. కనీసం ఆయన పోయాక అయ్యే ఖర్చులకి కూడా ఆయన సంపాదనని వాడుకోలేదని అంతా చెప్పుకుంటున్నారు. కావాలంటే రండి మిమ్మల్ని స్మశానం దగ్గరికి తీసికెళ్లి చూపిస్తాను. అంత గొప్ప వ్యక్తికే లేదు సమాధి. మా నాన్నకెందుకు?” అన్నాడు.

“అలా అనకు నాయనా! ఇలాంటి విషయాల్లో పోలికల జోలికి వెళ్లకూడదు. మన తండ్రి మనం చూసే దృష్టితోనే మనకు కన్పిస్తాడు. ఉన్నతంగా ఊహిస్తే ఉన్నతంగా. నీచంగా భావిస్తే నీచంగా. అంతేకాని తనని హీనంగా భావించాలని ఏ తండ్రీ కొడుకుల్ని కనడు. నువ్వు పుట్టడమే ఆయనకో వరం అనుకొని వుంటాడు నీ తండ్రి. నీ తండ్రే కాదు ప్రతి తండ్రీ అలాగే అనుకుంటాడు. అందుకే దగ్గరుండి అన్నప్రాసన చేపిస్తాడు. అక్షరాభ్యాసం చేయిస్తాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి తండ్రికి ముందు తరానికి జ్ఞాపకం వుండేలా ఒక సమాధి కట్టిస్తే తప్పా? దానికోసం పక్కింటి తండ్రులతో, ఎదురింటి తండ్రులతో, కన్పించిన ప్రతి తండ్రితో నీ తండ్రిని పోల్చి అవమానిస్తావా? అది తప్పు. ఆయన ఆత్మకి ఏదో ఒకవిధంగా శాంతిని కల్గించటం కొడుకుగా నీ ధర్మం. క్షోభపెట్టకు” అందామె.

తిలక్ కోపంగా సంలేఖను చూసి “నువ్విక్కడికి వచ్చింది ఇందుకేనా? ఈ అవ్వల చేత నన్ను చీవాట్లు పెట్టించటానికా? నన్ను ఈమాత్రం మనశ్శాంతిగా కూడా వుండనివ్వవా?” అన్నాడు.

“నీకు నేను మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్యా నువ్వు. నాన్నకి సమాధి కట్టించమనేగా నేను అడిగేది. రాజారాం అన్నయ్యకు కాళ్లు సరిగా లేక మొన్నటి వరకు స్కూల్ కే వెళ్లలేదు. నువ్వు బాగానే వున్నావు. ప్రతిరోజు డబ్బులు సంపాయిస్తూనే వున్నావు. నీకు మనశ్శాంతి ఎందుకుండదు?”

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో