జ్ఞాపకం- 92– అంగులూరి అంజనీదేవి

మీరు నన్ను కావాలనే కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతయినా రైటర్ కదా!అంది ఎగతాళిగా చూస్తూ.

ఆ అమ్మాయికి కొద్దికొద్దిగా ఓడిపోతున్నానేమో నన్న అనుమానం వున్నా సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం చావటం లేదు.

సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ నీకు భేతాళుని కథ కావాలి. అంతేనా?” అంది.

అంతే! కానీ మీకు తెలియదని నాకు తెలుసుఅంది.

చెబుతాను. వినుఅంటూ భేతాళుడి కథ చెప్పటం మొదలు పెట్టింది సంలేఖ.

భేతాళ కథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. భేతాళుడు పూర్వజన్మలో తపఃసంపన్నుడైన బ్రాహ్మణుడుఅంటూ ఆపింది సంలేఖ.

అవునా! భేతాళుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడా?” అంది నిజంగానే ఆశ్చర్యపోతూ ఫ్రెండ్.

రజిత పరిస్థితి కూడా అలాగే వుంది. కానీ వదిన తన ఫ్రెండ్ చేతిలో ఓడిపోతే బావుండని వుంది. అవకాశం కోసం చూస్తోంది. అందుకే ఫ్రెండ్ ని మోచేత్తో పొడిచింది.

ఏదో ఒక క్రాస్ క్వొశ్చన్ వెయ్యవే! వెర్రిమొహం వేసుకొని వినకుండాఅన్నట్లు చూసింది.

అనవసరంగా ఇరుక్కున్నానే. అటు ఆమెను ఎదుర్కోలేకపోతున్నాను. ఇటు రజితను శాటిస్ ఫై చెయ్యలేకపోతున్నాను అని లోలోన బాధపడుతోంది ఫ్రెండ్.

ఆ తర్వాత ఏం జరిగిందో ఆ బ్రాహ్మణుడు భేతాళుడుగా ఎలా మారాడో చెప్పు వదినా? మా ఫ్రెండ్ కి నువ్వంటే వున్న చిన్నచూపు తొలగాలిగా!అంది రజిత.

రజిత ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుందో, ఎంత వెటకారంగా ఆలోచిస్తుందో సంలేఖకు అర్ధమైంది. అందుకే చెబుతాను వినండి!అంటూ చెప్పటం మొదలుపెట్టింది.

కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి తనకు కథలు చెప్పమని కోరుతుందట. అవి ఇంతవరకు ఎవరికీ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని అడిగిందట. అది విని తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలు చెబుతాడు మహాశివుడు. పార్వతీ, పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రాహ్మణుడు. ఎంతో ఉత్కంఠతను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకి చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతుకూడా పెడతాడు. కానీ ఆమె తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేకమందిలో ఆ కథలకు ప్రాచుర్యం వస్తుంది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఆ కథలు చివరికి పార్వతీదేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె. భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించారని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడన్న కోపంతో విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కుప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే వరకూ భేతాళుడుగా వుండి పొమ్మని శపిస్తాడు. అలా బ్రాహ్మణుడు భేతాళుడుగా మారి విక్రమార్కుడికోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే వుంటాడుఅంది సంలేఖ.

రజిత విసురుగా లేచి శుద్ద బోర్! రావే పోదాం!అంటూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది ఫ్రెండ్ ని తీసుకొని…

ఎంత ప్రశాంతంగా వుందామనుకున్నా ఆడపడుచు ప్రవర్తన సంలేఖ మనసును గాయపరిచింది.

రాత్రికి జయంత్ నువ్వేదో తెలివిగా మాట్లాడి రజితను, దాని ఫ్రెండ్ ను అవమానించావట. అది ఏడుస్తోంది. అమ్మ దాన్ని నేను ఆఫీసు నుండి వచ్చేవరకు సముదాయిస్తూనే వుంది ఎందుకలా చేశావ్?” అని అడిగాడు.

జయంత్ ఎప్పుడు మాట్లాడినా విసుక్కుంటూనే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. నిజానికి వాళ్లు తననెంత ఏడిపించదలిచారో జయంత్ కేం తెలుసు.

మీరు రజిత మాటల్ని బాగా నమ్ముతున్నారు. అసలు జరిగింది ఒకటి ఆమె మీతో చెప్పింది మరొకటిఅంటూ అసలేం జరిగిందో చెప్పింది.

నీకసలు రచయిత్రినన్న బలుపు రోజురోజుకి ఎక్కువవుతోంది. అయినా అదొక్క క్వాలిటీ తప్ప ఏముందే నీ దగ్గర? అది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మా రజితను అలా చూడవుఅన్నాడు.

భర్తను బాగా గమనిస్తోందామె. ఈ మధ్యన మనఅన్న పదం పోయి మా, మీఅన్న పదాలే ఎక్కువగా వాడుతున్నాడు. ఇప్పుడు తనేం మాట్లాడినా వృధాయే అనుకొని కళ్లు మూసుకొని పడుకొంది.

అతను గొణుగుతూనే నిద్రపోయాడు.

సంలేఖకి నిద్ర రాక లేచి కూర్చుంది. ఆరోజు పేపర్ ని మళ్లీ ఒకసారి తిరగేసింది. ఆమె చూపులు ఉదయం చూసిన న్యూస్ పై నిలిచాయి. మనసంతా నొప్పిగా అనిపించింది. ఆ న్యూస్ పక్కన బాగా పాతబడిపోయిన ఫోటో కూడా వుంది. ఆ ఫోటో ఒక ప్రముఖ రచయిత సమాధిది. దాన్ని పట్టించుకునే దిక్కులేక దానిమీద కుక్కలు, మేకలు పడుకొని వున్నాయి. అక్కడున్న స్థలాన్ని ఎవరో ఆక్రమించుకొని ఇల్లు కడుతున్నట్లుంది. అది చూడగానే తన తాతయ్య పాత సమాధి గుర్తొచ్చింది. ఎప్పటికైనా దాన్ని కూలగొట్టి కబ్జాచేసి అందులో పంట పండిస్తారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. తాతయ్యకు కనీసం పాత సమాధి అయినా వుంది. తన తండ్రికయితే అదికూడా లేదు. ఆయన్ని ఖననం చేసిన స్థలంలో ఒక చిన్న రాయిని మాత్రమే పెట్టి వుంచారు గుర్తుగా. దాన్నెప్పుడు కట్టించాలి? అన్నయ్య, తిలక్ తండ్రి సమాధి గురించి ఏమనుకుంటున్నారో ఏమో! వాళ్ల ఆలోచనలు ఎలా వున్నాయో! వెళ్లి తెలుసుకోవాలి. అని కళ్లు మూసుకొని పడుకొంది సంలేఖ. అదే ఆలోచనతో ఆమెకు నిద్ర రాలేదు.

(ఇంకా ఉంది)

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో