మణీపూర్ వ్యధ(కవిత)–ఎల్. ఉపేందర్.

కన్నీటి చుక్కలు కావమ్మా
అవి రక్తపు బొట్లు….
మానవ మృగాలు రక్కిన
రంపపు జాడలు….!

ఊరేగింపు అంటే పెళ్లి పల్లకి కాదమ్మా….
దేశద్రోహులు నలిపిన దేహాలు..
కమిలిన.. కుమిలిన.. కదిలిన
కురుల చిద్రాలు….!

భారత మాత అంటున్నారు..
బందుకులవుతున్నారు…..
బరిసెలు దింపుతున్నారు..
ఈ ప్రేమ పురుగుల ఆటేందమ్మా..,
తేనే పూసిన కత్తిలా…?

అమ్మలు గన్న అమ్మ ఆహార్యాన్ని
ఆటబొమ్మాల్లా ఆడుకుంటూ
ఆకృత్యాలు చేస్తుంటే…
అందలమెక్కినా…అందమేధమ్మా…?

మనువాదపు సంకెళ్లలోనే
నీ వ్యధ తిరగాడుతూ..
తొని కిసాలాడుతుందే తప్ప..
తరుణిలా తలుకు బెలుకు లేవి..?

అది గాయాల మండ్ర గబ్బ తల్లీ
మాటువేస్తూ, కాటువేస్తూ వుంటుంటే…
కాలంలో కన్నీళ్ల ఆవిరులు..
కనుమరుగవుతుంటే…
నా గుండె గడగడ లాడుతూ..
గోస పడుతుంటే…
ఈ అక్షరాలు అల్లుకున్నాయి తల్లీ….!

-ఎల్. ఉపేందర్. టీచర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో