నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ఈ తడిసిన రాత్రి

ఈ వర్షపు పెనుగాలులు

ఎంత మర్చిపోదామన్నా

ఎదనిండా అవే ఊసులు.

-అసర్ లఖ్నవీ

 

ఒకప్పుడు ఆమె హృదయంలో

ప్రాణంకంటే మిన్నగా ఉన్నాను

ఇవాళ ఆమె వీధి చివర

ఒక దోషిలా నిలబడ్డాను

– మజ్రూహ్ సుల్తాన్పురే

 

ఏ నిప్పు నీవు రగిలించావో

వాటిని నా అశ్రువులార్వేశాయి

ఏ కన్నీళ్లు నాలో మరుగుతున్నాయో

ఎలా అవి చల్లబడతాయి?

-మోయిన్ అహాసన్ జజ్బీ 

 

నక్షత్రాలనదుగు

నా నేత్రాల నడుగు

నేనెక్కడ వున్నా

నీ వెంటే నా అడుగు

 

– ముజీబ్ 

 

-– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో