భావి దీపాలు (కవిత)– గిరి ప్రసాద్ చెలమల్లు

నమ్మినోడి నయవంచన 
దానికే పేరు పెట్టుకున్నా
అది మోసమే! మోసగాడే! కానరాని మరో కోణం!!
నీకోసం ఆరాటపడని వాడ్ని వదిలేయి!
నాడే నీ మనసు కొత్త పుంతలు తొక్కు
వస్తుంటారు
పోతుంటారు
మాటల తూటాలను ఈ చెవి నుండి ఆ చెవికి
అటునుండి గాలిలోకి వదిలేయ్
నీ బతుకు నీవు కోరుకున్న గాడి లోకి సజావుగా
పొందికగా పోయే దాకా నిమ్మలపడు!!
నీ నిజాయితీ యే నీకు రక్ష! దాన్ని మాత్రం కోల్పోవద్దు!!
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా!!
అతనే జీవితం కాదు
అతనే సర్వసం కాదు
విశాల ప్రపంచంలో నువ్వంటే ఇష్ట పడే వాడు
వుంటాడు!
టార్చ్ లైట్ వేసి మరీ
వెతుక్కు
దొరుకుతాడు
దాపరికం ఏమీ లేదు
నీ జీవితం ఓ తెరచిన పుస్తకం
అందులో ఓ నెమలీక చేరిక స్పష్టం!
ఎవడో కాదన్నాడని
నీవెందుకు ఒంటరి పక్షిలా!
భయాన్ని శాసించు
వెలుతురు ను ఆహ్వానించు
పోయేదేమీ లేదు బానిసత్వం తప్ప
వేదాంతం కాదు! వర్తమానం లో వుండు!!
గతం పునాదుల పై ఓ కొత్త చరిత్ర సృష్టించు!
పోనీ పోతే పోనీ
చస్తూ బతకడం ఏల
కన్నీరు కార్చే కళ్ళకి చెప్పు
కళ్ళల్లో వెలుగు సుస్పష్టమని
ఎందుకు ఏమిటి ఎలా నిన్ను నీవే ప్రశ్నించుకో
జవాబు తథ్యం!
ఏళ్ళుగా దేని కోసమో పరిగెడుతున్నావ్
ఎత్తు గడల లొల్లి నీవెరుగవు
వున్నది వున్నట్లు తేటతెల్లం
ఉపకారమెరుగు అపకారం నీ డైరీ లో లేదు
నవ్వేది సంఘమే
ఏడ్చేది సంఘమే
నీ దారిలో పల్లేరు గాయలు ఏరుకుంటూ
గాయాలు మాన్పుకుంటూ సాగు!
నీకు నీవే గురువు వి! నీకెవ్వడు లేడు సాటి!
ఫలాలు నీ చేతుల్లోకి !
ఊహలకి వాస్తవానికి మధ్య దూరం తగ్గే కొద్దీ
పల్లకీ లో కేరింతల హోరు!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో