కనిపించడానికవి పూల సంకెళ్ళు
తరచి చూస్తే బంధనాలే
మాట మాట్లాడాలన్నా
వెనుక డిటెక్టివ్ చూపులను ఎదుర్కోవల్సిందే
ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలే
పేరుకే స్వేచ్ఛావిహంగాన్ని
కాళ్ళకు అవరోధాల నిషేధాజ్ఞలే
అడుగు ముందుకు వేస్తే చాలు
కళ్ళ సైగల హెచ్చరికలు
పెదాల గుమ్మం దాటి మాటలు రావే
సంశయాల తలుపులు అడ్డుపడతాయి
కనులు అనుసరణ బాటలోనే
స్వతంత్య్రత లేని మనసులు
అన్నీ లోలోపల దృశ్యరూపాల్లోనే
చీరలు, ఆభరణాలు అన్ని వారిష్టమే
ధరించేది మనమైనా
అందాలు తిలకించేది మేమే కదా అనే అహంభావం
వేసుకొనేది ఎవరు అన్న ఆలోచనే రాదు
అన్నింటా అదే వంతు
స్వేచ్ఛావాయువులను పీల్చాలని ఎవరికుండదు?
అవి మాత్రం కరువే ఆడపిల్లలకు ! ! !
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~