
గిడుగు రామ్మూర్తి గారి 160వ జయంతి సందర్భంగా మారీస్ స్టెల్లా కళాశాల లో ఆగస్ట్29న తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డా.అరసిశ్రీ (ఆదిమూలం లక్ష్మణరావు) గారు విచ్చేసి అంతర్జాలంలో తెలుగు భాష, సాహిత్యం ఏ విధంగా విస్తరించిందో అనే అంశం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసిన విజయతోరణం అనే నాటికను తిలకించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు శాఖాధ్యక్షులు డా.వి.ఎన్. మంగాదేవిగారు అధ్యక్షత వ్యవహరించారు. ఈ సభకి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఉషారాణి, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపాల్ డా. డి.రామకృష్ణగారు, కళాశాలలోని ఇతర శాఖాధిపతులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొనారు.
ఇంకా ఆత్మీయ అతిధి గా విచ్చేసిన డా. అరసి శ్రీ గారిని కళాశాల అకడమిక్ అడ్మినిస్ట్రేషన్ డా.లీనా క్వాడ్రస్ శాలువతో సన్మానించారు. కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యం, కోలాటం, జానపద నృత్యం, శాస్త్రీయ నాట్యాలు, ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకులు డా. ఆర్. శ్రీనివాసరావు సంధానకర్తగా వ్యవహరించారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~