దాగడం, దాచడం చేతకాని
నన్ను వెన్ను తట్టి….
నీకు బలాన్ని నేనంటూ
లోకంలో నలుగురిలో
వినపడేలా చేసింది నాలో “నిజం”…
కానీ
అసత్యాలరుచిలో లోకానికి
నిజం అరాయింపు కాక
నేను నచ్చక బయటకి తోసి
ఏమి లేనివాడిగా కానివాడిలా చేసి
ఒంటరిగా వదిలేస్తే
ఇంకెవవరుంటారు నాకు ?
నిజం నాకు అబద్దం చెప్పిందని
అచ్చంగా నిజాలని నమ్ముకుంటే
మిగిలేది చేదు అనుభవమే
ఆదుకొనేది అని తేలింది.
-చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~