అక్కర్లేని చెత్తనంతా
అందంగా తీర్చిదిద్దుకున్న రంగవల్లికలు
కళ్ళను కనివిందుచేస్తూ
వారాలు, వర్జాలతో పనిలేని
జాతరలా సాగే నిత్య సంతలు
వేటగాడి ఉచితాల మోజులో
మధ్యతరగతి పావురాలు
స్వయంగా చిక్కుకునే
సువిశాల బహుళ అంతస్తుల వలలు
అక్కర్లేని భేషిజాలకు
బలపం కట్టుకుని ఊరేగేలా,
గింగిరీలు కొట్టించి
కాసుల కట్ట బుడిదయ్యేవరకూ
ఆశల మంట చల్లారనివ్వని
మనీ కొలిమలు ….
ప్రకటనల హోరునుపెంచి
అవసరానవసర తారతమ్య
విచక్షణను మరిపించి
బుట్టలు నింపించుకునేలా
చేసే సరుకుల గనులు
ఏదో కొనేయాలని , ఏం కొనాలని,
అన్నీ కొనేయాలని…
ఇతమిద్ధంగా ఎటూ తేల్చుకోనివ్వని
బేజారుల బజార్లు.
-రాధ కృష్ణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~