నగ్న రాజ్యం (కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

 

 

 

 

ఆమె లు
ఎన్ని రకాలు!!
భారత మాత బిడ్డలు కాని ఆమెలెందరు?!
ఆమె బిడ్డలు కావటానికి అర్హత లేమిటి?!

చెరచ బడ్డ
నిండు చూలాలు ఆ బిడ్డ గాదు!
గర్భగుడి లో చెరచబడి చంపబడ్డ బిడ్డ
ఆ మాత ముద్దు బిడ్డ గాదు!

పూజకు పనికిరాని పువ్వుల ఎంపికలో
నిత్యం వేట
వేటగాళ్ళు వేసే కాటుకి వేటుకి
మూలవాసి బిడ్డలే! బలి!!

పశ్చిమం నుండి మధ్య భారతం మీదుగా
ఈశాన్యం దిశగా కదిలిన
మతోన్మాద మేఘాలు!!
ఉరిమిరిమి చూసే చూపులు
వికృత చేష్టలు
చేతలుడిగి చూస్తున్న రాజ్యం!

బట్టలూడదీసి చేస్తున్న ఊరేగింపులు
ఏ మాత కోరిందో
ఏ రసిక రాయి చూడాలనుకున్నదో
ఆధిపత్య జాత్యహంకారం జూలు విదిల్చి దూకుతుంది!
రాజ్యం అండతో

బట్టలూడ దీసుకుని
నిస్సిగ్గుగా నడిబజార్లో ఊరేగుతున్న
రాజ్యాన్ని చూసి
నవ్వుకుంటున్న ప్రపంచం!
నవ్వుకుంటే నాకేం!! అనుకుంటూ మతం

కత్తులకి పదును పెట్టుకుంటున్న రాజ్యం!!

మూసుకో కళ్ళు మూసుకో
నీ ఇంటి తలుపు తట్టే దాకా గట్టిగా బిగించుకో

విరగగొట్టుకుని నిన్నుతాకితే భోరుమందువూ!!
గాఢనిద్ర నటించు నీలో సలపరింత మొదలయ్యే

రోజు అతిత్వరలోనే తస్మాత్ జాగ్రత్త!!
గళంవిప్పకపోతే!!

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో