ఆమె ఎంత హాయిగా
నా కౌగిట్లో ఒదిగిందో ఎలా చెప్పను ?
ఆమె నా చెంత ఉన్నంత సేపూ
నేను మూయులేదు రెప్పను
-జిగర్ మురాదా బాదీ
మదిరాక్షీ
కాదిది నీ కనుదోయి చేసిన తప్పు
ఇది నాకు నేనే
కొని తెచ్చుకున్న ముప్పు
– అస్గర్ గొండ్వీ
చాలా కాలమయింది చానా !
నిన్ను మర్చిపోయి
ఈ వయసులో తలచుకుంటే
గాయాలెన్నో ఉబికి వచ్చాయి
-అహ్మద్ నదీం కాస్మీ
మరచి పోయి కూడా నువ్వెప్పుడూ
స్మరించలేదు నన్ను
నీ జ్ఞాపకాల్లో మాత్రం
నేను సర్వం మరచిపోయాను
-బహుదూర్ జఫర్
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~