నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా (కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

 

 

 

 

“నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా”
ఆది కవి నన్నయను పిలుచుకు వస్తాను
కొడగడున్న నా మాతృభాషకు
మళ్లీ జీవసత్వానిస్తాడు
మాహిత కథకు ప్రాణం పోస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
శివకవులను భువికి దింపుకువస్తాను
తేటతెలుగు వెలుగులతో
అక్షరతాండవం చేస్తారు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘ఉభయకవి మిత్రుని’తో తిరిగి వస్తాను
మాతృభాషలోని తియ్యందనాలను
రమణీయంగా వర్ణిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘దేశభాషలందు తెలుగు లెస్స’ యని
దశదిశలా చాటి చెప్పిన
కవి సార్వభౌముని దివి నుండి భువికి దింపుకువస్తాను
అభినవ అష్టదిగ్గజాలను ఏర్పాటు చేస్తారు
అక్షరసేద్యం చేస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని కొనియాడిన
నికోలో డి కాంటి ని పిలుచుకువస్తాను
ఐ డోంట్ నో తెల్గు అని మోరిగేవాళ్ళ నోరు మూయిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
తెలుగాంగ్ల నిఘంటువులను పరిచయం చేసిన
‘ఆంధ్రభాశోద్ధారకుడ’ను తోడుకు వస్తాను
గతకాలపు తెలుగు వైభవాన్ని పరిచయం చేస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
సరళమైన తెలుగులో రామచరిత రాసిన

మొల్లమాంబను వెంటబెట్టుకు వస్తాను
సరళంగా సుతారంగా రాయడమెలాగో
నేర్పిస్తుంది
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘పద కవితా పితామహుడి’ని తోడుకు వస్తాను
తందనానా భళా తందనానా అంటూ
తేనె లోలుకు పాటలతో
తేట తెలుగు సంకీర్తనలు ఆలపిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘ఆంధ్ర సంఘ సంస్కరణ పితమహుణ్ణి’ పిలుచుకు వస్తా
‘ఆంధ్ర కవుల చరిత్ర’ను విపులంగా పరిచయం చేస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
వాడుక బాషకు వెలుగు బాట వేసిన
గురజాడ తీసుకు వస్తా
‘ముత్యాల సరాల’ తోవలో
‘దిద్దుబాటు’ చెస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘వ్యావహారిక భాషోధ్యమ పితామహుణ్ణి’తోడుకు వస్తాను
‘స్వభాష స్వగృహం వంటిదని చాటి చెబు’తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘అనగననగ రాగమతిశయించునుండు’ ననుచూ
తత్వజ్ఞానిని వెంటబెట్టుకు వస్తాను
సరళంగా రాయగల నేర్పును పరిచయం చేస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘వేయిపడగల’,పై ‘జ్ఞాన(మణి)పీఠ’మై
తెలుగువెలుగులో నడచి వస్తాను
‘ఆంధ్ర పౌరుషా’న్ని ‘ఆంధ్రప్రశస్తి’ని పరిచయం చేస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
భావకవి’ఊహాసుందరి’ని వెంటబెట్టుకు వస్తాను
తెలుగు భాషలోని బావుకతని పరిచయం చేస్తుంది
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘గుండె గొంతుకలోన కొట్లాడే’ఎంకి పిల్లను
వెంటేసుకువస్తాను
పచ్చని చేల గట్లపై ‘ఎంకిపాట’ వినిపిస్తుంది
తెలుగు నేల పులకించేలా
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
నిప్పులలో కరిగి పోయిన ‘సత్కవీంద్రుని

కమ్మని కలము’ తో తిరిగి వస్తాను
‘విశ్వనరుడి’పద్యగానంతో గబ్బిలాల రాణితో
తెలుగు సందేశం పంపిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘అభ్యుదయ’ కవితామూర్తితో మరలి వస్తాను
‘తెలుగు వీర లేవరా,మహాప్రస్థాన’మిదిరా
మన తెలుగు భాష గొప్పరా అంటూ
నేటి తరాన్ని భుజం తట్టి లేపుతాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లల’ని
చాటిచెప్పిన దేవరకొండను మోసుకు వస్తాను
మధురాక్షర పదాలు వెండి వెన్నెల్లో వెదజల్లుతాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
“అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!”అని ఎలుగెత్తిన

‘రుద్రవీణ’ను ఇలపైకి తీసుకు వస్తాను
‘అగ్నిధార’లాంటి ‘కవితా పుష్పకం’తో
తెలుగు వీణా నాదం ఆలపిస్తాడు
తెలుగువారి కన్నులు తెరిపిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘విశ్వంభరు’డై జ్ఞాన పీఠ మెక్కిన
‘కర్పూర వసంతారాయల’తో వస్తాను
‘కడలి అంచులు దాటి కదిలింది తెలుగు’అంటూ
గతకాలపు వైభవాన్ని వివరంగా చెబుతాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
‘పాలేరు నుండి పద్మశ్రీ’వరకు పెరిగిన
ఆత్మకథను పరిచయం చేస్తా
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
ఆధునిక కథా సాహిత్య వికాసానికి కొత్తబాటలు వేసి
‘పాకుడు రాళ్ల’పై ‘జ్ఞాన పీఠ’మధిరోహించి
తెలుగు భాషాఖ్యాతి దశదిశలా వ్యాపింప చేసిన
రావూరిని తీసుకు వస్తాను
నేటి ఆధునిక యువతరానికి
తెలుగు పద పరీమళాల సువాసనలు వీచేలా
‘వెండి వెన్నెల గిన్నెలో
పాలబువ్వ’లాంటి
అక్షర రత్నాలను వెదజల్లుతాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం
ఆత్మార్పణ చేసిన అమరజీవిని
వెంటబెట్టుకు వస్తాను
భాష కోసం పాటుపడటం నేర్పిస్తాడు
నన్నెవరైనా దేవలోకం పంపిస్తారా !!
మాతృభాషామ తల్లి ముద్దు బిడ్డలందర్నీ
వెంటబెట్టుకు వస్తా
గతకాలపు మధురానుభూతితో
ముత్యాల కోవాల్లాంటి అక్షరాలను
మన మాతృభాషా వైభవాన్ని
కథలుగా చెబుతా
గజ్జెకట్టి కవితా గానం చేస్తా….

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో