తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

మసూమా బేగం 7-10-1901న హైదరాబాద్ లో విద్యా వంతుల కుటుంబం లో జన్మించింది.తండ్రి ఖదివే జంగ్ బహదూర్ (మీర్జా కరీం ఖాన్ ).తల్లి తయ్యబా బేగం భారత ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు .మాతామహుడు ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ హైదరాబాద్ లో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడు .సోదరుడు ఆలీ యవార్ జంగ్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం లో విద్యా మంత్రి.ఈజిప్ట్ కు భారత రాయబారి .మహారాష్ట్ర గవర్నర్ మెహదీ నవాజ్ జంగ్ ఆమె మేనమామ . .మసూమాకు చిన్నప్పటి నుంచి సాంఘిక సేవ అభిమాన విషయం .మహబూబా బాలికల పాఠశాలలో చదివింది.

విశాల నేత్రాలు ,సాత్వికత ఉట్టిపడే ముఖం ,సౌమ్యత జాలువారే క౦ఠధ్వని ,ఆత్మీయత తొణికిసలాడే మాట ,తెల్లని శరీర ఛాయ మసూమా సహజ ఆభరణాలు .స్కౌటు,జనరల్ గైడ్ లలో నిష్ణాతురాలు .తల్లి సేవాగుణం వ్యక్తిత్వం ఆమెకు వారసత్వంగా లభించాయి .తల్లికి భారత కోకిల సరోజినీ నాయుడు అత్యంత అభిమాని మిత్రురాలుకూడా .ముస్లిం పరదా పాటిస్తూ తయ్యమాబెగం ,ప్రైవేట్ గా చదివి ,పిల్లల తల్లి అయి ,మద్రాస్ యూని వర్సిటి పట్టభద్రు రాలై,ఇండియాలో ,మొట్ట మొదటి ముస్లిం మహిళా గ్రాడ్యుయేట్ గా రికార్డ్ స్థాపించింది .తర్వాత ఎం ఏ పాసై ఉర్దూలో నాలుగు నవలలు రాసింది .ఇంగ్లీష్ లో అనేక పత్రికలకు వ్యాసాలూ రాసింది .తయ్యమా రాసిన ‘’భారతీయ లోక్ గీత్ ‘’ లండన్ పత్రిక లో ధారావాహికం గా ప్రచురితమైంది .1901 లో ‘’హైదరాబాద్ మహిళాసభ ‘’ స్థాపించింది .నిజాం ప్రభుత్వ ధనసాయం కోసం ‘’లేడీ హైదరీ క్లబ్ ‘’గా పేరు మారి ఇప్పటికీ సేవలు అందిస్తోంది ఆ సంస్థ .ఆడపిల్లలకు ప్రత్యెక స్కూళ్ళు నెలకొల్పమని ఎప్పుడూ ఒత్తిడి చేసేది .కొంతమంది మిత్రులతో కలిసి తయ్యమా మహబూబియా స్కూల్ ,అన్జుమానే భావాతీన్ ,మరికొన్ని స్కూళ్ళు స్థాపించింది .ప్రతి మహాల్లా లో ఉచిత స్కూళ్ళు ఉండాలని ప్రచారం చేసింది .గొప్ప వక్త అయిన తయ్యమా అఖిలభారత ముస్లిం మహిళా కాంగ్రెస్ కు కలకత్తాలో ,బ్రాహ్మ మహిళా సభకు హైదరాబాద్ లో అధ్యక్షత వహించింది .1908మూసీ నది వరదల్లో సగం ఊరు కొట్టుకుపోతే ,పరదా పాటిస్తూనే ,తోటి స్త్రీలతో కలిసి వరద బాధితులకు మాహా గొప్ప సాయం చేసిన దయార్ద్ర హృదయురాలు . ఈ విశిష్ట లక్షణాలన్నీకూతురు మసూమా బేగం కు సంక్రమించి సాంఘిక సేవలో ధన్యురాలైంది .

మసూమా తొమ్మిదవ ఏట నే లేడీ హైదరీక్లబ్ లో జూనియర్ మెంబర్ గా చేరింది .మహబూబియా స్కూల్ లో స్కూల్ ఫైనల్ చదివి ఉర్దూ భాషా పాండిత్యానికి బంగారు పతకం పొందింది .1922లో మసూమా వివాహం దగ్గర బంధువు విద్యా వేత్త అయిన హోసైన్ ఆలీఖాన్ తొ జరిగింది . ఈ దంపతులకు నలుగురు అబ్బాయిలు ,ఒక అమ్మాయి .1927లో ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ స్థాపించ బడినప్పటినుంచి మసూమా సభ్యురాలు .స్త్రీలసమస్యలను చక్కగా అర్ధం చేసుకొని వేదిక పై గొప్పగా ప్రసంగించేది మసూమా . అనేక హోదాలలో అందులో పని చేసి 1962-64 లో ఆసంస్థకు అధ్యక్షురాలైనది .1963లో లండన్ విమెన్స్ కౌన్సిల్ ఆమెను ఆహ్వానించి ,ఆమె గౌరవార్ధం హౌస్ ఆఫ్ కామన్స్ లో గొప్ప విందు ఏర్పాటు చేశారు .స్త్రీలలో చైతన్యం కలిగిస్తూ వారి సమస్యలను తీరుస్తూ ,మహిళాభ్యుదయానికి పాటు పడే విధానం పై ప్రసంగం చేసి అందరి ప్రశంసలు పొందింది .ప్రపంచదేశాలు పర్యటించి భారత మహిళకు ప్రాతినిధ్యం వహించింది మసూమా బేగం.’’ఇంటర్ నేషనల్ అలయన్స్ ఆఫ్ విమెన్స్’’-అంటే అంతర్జాతీయ మహిళా మైత్రీ సమాజం స్వర్ణో త్సవాలలో 1955లో శ్రీలంక –సిలోన్ వెళ్లి ప్రాతినిధ్యం వహించింది .1958,1963 లలో యుగోస్లేవియాకు ,ఇండో నేషియా కు భారత బృందానికి లీడర్ గా వెళ్లి పాల్గొన్నది .అంతర్జాతీయ మహిళా మైత్రీ సమాజం వారి 22 వ వార్షికోత్సవ కాంగ్రెస్ సభ ప్రారంభ౦ లో పాల్గొని ,1972లో జెనీవాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సభకు భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ,మన్ననలుపొంది దేశ గౌరవాన్ని పెంచిన సమర్ధురాలు .తల్లి తయ్యామా కు నిజమైన వారసురాలు అనిపించు కొన్నది .

1911లో తల్లి స్థాపించిన అన్జుమానేఖనాతీన్ ను తీర్చి దిద్దుతూ పేద పిల్లలకు ఉచిత పాఠశాలను నిర్వహిస్తూ సమర్ధత తొ నిర్వహించింది .అనేక విద్యాలయాలకు సలహా దారుగా గౌరవం పొందింది .1934 నుంచి ఒక శతాబ్దం పాటు ఉస్మానియా యూని వర్సిటి సెనెట్ సభ్యురాలుగా ,ఫైనాన్స్ కమిటి సభ్యు రాలుగా ఉన్నది .నిజాం ప్రభుత్వం ఆమెను 1950లో వయోజన విద్యా సమితి సభ్యు రాలిగా నియమించింది .స్త్రీ సమస్యలతోపాటు విద్యా వ్యాప్తి సమస్యలు కూడా ఆమెకు బాగా తెలుసు .న్యాయ శాస్త్ర చట్ట రీత్యా స్త్రీలకూ అరిగే అన్యాయాలు ,అక్రమాలను నిర్మూలించటానికి ఏర్పడిన ‘’లీగల్ డిజబిలిటిస్ కమిటి ‘’సభ్యురాలుగా ఆస్తులు వివాహాలు విడాకులు బాల్య వివాహాలు ,వృద్ధులతో వివాహాలు ,దత్తత సమస్యలు ,విద్యా ఉద్యోగ సమస్యలు మొదలైన వాటిని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు అందరకు సులభంగా వివరించే నేర్పు మసూమా స్వంతం .సామాన్య గృహిణులకు ఆమె వివరించే విధానం మనసుకు హత్తుకోనేది .ఇంతటి నేర్పున్న ఆమె 1966లో ‘’కేంద్ర సంఘ సంక్షేమ సమితి ‘’చైర్మన్ అయి ఆపదవికే వన్నె తెచ్చింది .మాతా శిశు సంక్షేమం కోసం యునిసెఫ్ వారి సహాయంతో ఎన్నో కొత్త పధకాలు అమలు పరచింది .ప్రత్యెక ఆంధ్ర ఏర్పడ్డాక ఆమె కేంద్ర సంఘ సంక్షేమ సమితి-ఆంధ్ర రాష్ట్ర శాఖలో తెలంగాణా విభాగానికి చైర్మన్ గా పని చేసింది .

1952 ఎన్నికలలో మసూమా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి,తాను శాలి బండ నియోజక వర్గం నుంచి గెలిచి అనేక సీట్లు గెలవటానికి దోహద పడింది .ఆమె వాక్చాతుర్యం ,వైదుష్యం అనితర సాధ్యం. అవే గెలుపుకు ముఖ్య కారణం . పానెల్ ఆఫ్ చైర్మన్ కు ఎంపికై,అనేక శాసన సభా కార్యక్రమాలను దక్షతతో హుందాగా నిర్వహించింది .1957లో మళ్ళీ పత్తర్ ఘట్టీ నియోజక వర్గం నుంచి ఎన్నికై శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిత్వం లో కాంగ్రెస్ శాసన సభ్యుల డిప్యూటీ లీడర్ అయింది .1960లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లో సంఘ సంక్షేమ శాఖ ,ముస్లిం ధర్మాదాయ ,,సాలార్ జంగ్ ఎస్టేట్ నిర్వహణ శాఖ మంత్రి అయింది .దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి గా గుర్తింపు పొందింది మసూమా బేగం .క్రమ శిక్షణ ,బుద్ధివికాసం సామాజిక చైతన్యాలే ఆమె ముఖ్యంగా భావించి సంకుచిత్వాన్ని దూరంగా పెట్టి సేవ చేసింది .సామాజిక కళ్యాణమే ఆమె ధ్యేయం .మధ్య దక్షిణ రైల్వే ప్రయాణీకుల సంక్షేమ సమితి లో కూడా సభ్యురాలు .రెడ్ క్రాస్ సంఘం లోనూ ఆమె సేవ విశిష్టమైనదే .దానికి ఆమె యావజ్జీవ శ్రేయో దాయిని-లైఫ్ అసోసియేట్ .అఖిలభారత గ్రామీణ మహిళా సంఘం ఆంధ్ర శాఖ కు పోషకురాలు.భారత స్కౌట్ ఉద్యమ సేవకు ఆమె కు ‘’బేడేన్ పావెల్ పతకం ‘’ఇచ్చి గౌరవించారు .జాతి ,కుల మత వర్గాలకు అతీతంగా మసూమా చిరస్మరణీయ సేవలు అందించింది .మసూమా బేగం 2-3-1990 న 89 ఏళ్ళ వయసులో మరణించింది .ఆమె భారత మహిళా మాణిక్యం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో