అదేదో సామెత చెప్పినట్టు….(కథ)-కె. అమృత జ్యోత్స్న

సరిత ఓ గృహిణి. “ఇంటికి దీపం ఇల్లాలు “అన్నట్లుగా ఉండే గడుసు అమ్మాయి. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగానే ఉంటారు ఆమె భర్త, కొడుకు.స్కూల్ కి టైం అవుతున్నా వాళ్ళ అబ్బాయి “బెల్లం కొట్టిన గుండ్రాయి”ల వుంటే పాపం సరితే అన్ని చూడాలి. సరిత మొగుడు సరేసరి “గంతకు తగ్గ బొంత” మాదిరి పిల్లాడికి ఏమాత్రం తీసిపోరు ఆఫీసుకి త్వరగా తెమలరాయే. హమ్మయ్య ఎలాగో డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరారిద్దరూ. అమ్మో! ఆఫీస్ కి లేట్ అయ్యింది నేవెళ్ళాలి అని రఘు అంటుంటే ఆపి,తినేసి వెళ్ళమన్నాగా లేకపోతే సరిత చేసిన వంట “బూడిదలో పోసిన పన్నీరై”పోదు. అందుకే కాదు లెండి వచ్చే ఆదివారం పెళ్లి రోజు కదా ఇప్పట్నుంచే తన శ్రీవారిని  కాకా పట్టే ప్రయత్నంలో ఇదొక్కటి కాబోలు.”ఆడవారినోట్లో ఆవగింజ నానదు అన్నట్లె” రఘు టిఫిన్ తింటుండగా మొదలెట్టింది సరిత “ఏమండోయ్!వచ్చే వారం పెళ్లి రోజు కదా! నాకేమి ఇస్తారు? అని ఉత్సాహం ఆపుకోలేక “చెవిలో జోరిగల “నస పెడుతూ” అడగందే అమ్మ అయినా పెట్టదంటారు “కదా అనుకుంటూ అడిగేసింది సరిత.

ఐనా” ఇండ్లన్నాక కాసుల్దండ లేకపోయినా కాసెండైన ఉండాల” అంటారు కదండీ నాకు ఆ వెండి కూడా వద్దు ఓ మంచి పట్టు చీర కొనిస్తారా! నా పుట్టిన రోజుకు కూడా ఏమి తీసియలేదు.  ఏదో ఆ రోజు నా ఏడుపు మొఖం చూసి గుడికి తీసుకెళ్ళి తూతూ మంత్రంలా జరిపించారు .నేను ఏది అడిగినా “చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే గా.”ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు విలువ “అన్నట్లుగానే మన అబ్బాయి చింటు బర్త్ డే మాత్రం కేకు కోయించి, హోటల్ కి తీసుకెళ్ళి రాత్రికి ఓ సినిమా చూసుకొని భలే హంగామా చేస్తూ ముగించారే. అయినా “నోరున్నవాడిదే రాజ్యం” అన్నట్లుగా వాడు ముందు రోజు ఏడ్చి ఆగిత్తం చేయబట్టే అలా జరిగిందనుకుంటా బహుశా. “చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు “అన్నట్లుగానే వుంది మీ వ్యవహారం. నాపాటికి నేను ఇంతలా “చెవినిల్లు కట్టుకొని పోయిన”, ఇలా వాగుతున్నా “దున్నపోతు మీద వాన కురిసినట్లు”గా ఉండారే? అంటూ వాపోయింది సరిత.

టిఫిన్ తిన్నాక ప్లేట్ లో చేతులు కడుగుతూ రఘు సరితతో “సరితా! “చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద” అన్న విధంగా? నాకు టిఫిన్ పెట్టి ఇంకా పెట్టేదా? తింటారా? అని అడగకుండా నీ పాటికి నీవు” కల్లు తాగిన కోతిలా” మాట్లాడుతున్నావే క్యారి బాక్స్ రెడీ అయిందా? లేదా? నేను ఆఫీస్ కి వెళ్ళాలా? వద్దా? అని కోపడ్డాడు.దానికి సరిత వెంటనే “ఆడలేనమ్మ మద్దెలపై పడినట్లు” నాపై కోప్పడితే యెట్లా  నేనేమైన నగలడిగాన? నాణ్యాలడిగానా? అయినా “ఉన్నమాటంటే ఉలుకెక్కువలె” పిల్లోడు పుట్టాక నాపైన ప్రేమ తగ్గిందిలే  ఐన “ఆడదై పుట్టుటకంటే  అడవిలో మానై పుట్టుట మేలు” అని పెద్దలు ఊరకే అనలేదు” అని గొణుగుతూ క్యారీ రఘు చేతిలో పెట్టి” ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు” అయినా అనవసరంగా నిన్ను అడిగా అంటూ లోనికి వెళ్ళిపోయింది సరిత.

రఘు మనసులో “సముద్రం అయినా ఈదవచ్చు కానీ సంసారం ఈదడం కష్టంరా “బాబు అనుకుంటూనే సరిత వెనకాలే లోపలికి వెళ్లి సరితతో ఓ వెర్రిదానా! నీపై ప్రేమ తగ్గలేదే. నా జీతం అంతంత మాత్రమే. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది “అన్నట్లుగా “వస్తుంది “ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగానే ఖర్చు పెట్టుకోవాలి కాని, “అప్పు చేసి పప్పు కూడు” అవసరమా? అయినా “ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు “చిన్న పిల్లోడితో నీకేంటి పేచి.నువ్వు అర్థం చేసుకొంటావని అనుకున్నా “ఊపితే గుప్పెడు – పిసికితే పిడికెడు” అన్న చందంగా చేసేది సర్కారీ ఉద్యోగమైన నెలాఖరికి ఖర్చులు పోను జీతం “ఇసుకలో నూనె పిండినంత”గా మిగిలేదిఅని తెలుసుగా.”పిండి కొద్ది రొట్టె “అంటారు పెద్దలు మరిచిపోయావా?” అందని పండ్లకు అర్రులు చాచినట్లు”గా వుంది నీ వ్యవహారం సరిత .ఐనా సరిత నీవు పట్టు చీరే కట్టాలా వందరూపాయలు చీరలోనైన అందంగా ఉంటావు అంటూ “మనసుంటే మార్గమే” లేదా?అయినా సరితా “నోటికి అదుపు ఇంటికి పొదుపు ఉండాలిగా “అంటూ చిలక్కు చెప్పినట్లు చెబుతూనే “మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు”నీకేం తెలుస్తుంది “రెక్కాడితే గాని డొక్కాడని “మన స్థితికదా అంటూ రఘు సర్ది చెప్పాడు.

దానికి సరిత వెంటనే “ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు” అని ఇలా పొగడ్తలతో  అసలు విషయం దాటెయ్యక “పొగడ్త ఒక అగడ్త” అని నాకు తెలియదనుకోకండి.అయినా” అడిగే వాడికి చెప్పేవాడు లోకువ” అని నాకు చీర వద్దు ఏమి వద్దులే,”ఉట్టి కెక్క లేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట “అలా వుంది నా కోరిక.ఈ “గతి లేనమ్మకు గంజే పానకము” లెండి .పిల్లోడ్ని బడిలో వదిలి మీరు ఆఫీస్ కి బయలుదేరండి. మళ్ళీ ఆఫిసుకు ఆలస్యం ఐతే మళ్ళీ నాపైనే అరుస్తారు. ఐనా “ఎముక లేని నాలుక కదా ఎన్నైనా అంటుంది”లే అంటూ నిస్టూరపోయింది.

రఘు దానికి “రెడ్డొచ్చే మొదలెత్తుకో” అన్న మాదిరి మళ్ళీ మొదటికే వస్తున్నావు. “కాళ్లకేస్తే మెడకు, మెడకేస్తే కాలికేస్తున్నావు. ఏమన్నాఅందామంటే “తిట్టబోతే అక్క బిడ్డ, కొట్టబోతే వేకటి  మనిషి” అని ఈ పంచాయితి ఏదో సెలవు రోజు పెట్టుకోక ఇలా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఏంటి ఈ నిస్టూరాలు అన్నాడు.

ఆ వెంటనే సరిత అయినా కాని మీరేమో  “కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం “మాదిరిగా ఇంట్లో వుంటే టి.వి.,లేకపోతేనిద్ర,కాసేపు పిల్లాడితో కాలక్షేపం నాగురించి ఆలోచించరే?”నిమ్మకు నీరెత్తినట్లు”ఉంటారు అని అడిగితే ఏమో నిష్టూరాలు అంటారు. అయినా నాకేమి తీసియకు వద్దు అన్నాగా! మరి వదిలేయచ్చుగా ఆ సంగతి,వదిలేసి మీరు ఎంచక్కా ఆఫీస్ కి వెళ్ళండి అంది సరిత. రఘు దానికి ఇంతదాక వచ్చింది కాబట్టి నీకో విషయం చెప్పాలి. అమ్మో! ఎంత పగ వుందే నామీద  వెర్రిదాన! అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ సరిత దగ్గరకు తన గడ్డం పై చెయ్యి పెట్టి తల పైకెత్తి సరితా ! నీవు అలకలోను భలే అందంగా ఉన్నావే అమ్మడు. నీకు చీర కాదే బంగారపు ఉంగరమే కొన్నా! పెళ్లి రోజుకు సర్ప్రైజ్ గా ఇద్దామనుకున్నా! నీ పుట్టిన రోజుకే ఇవ్వాలనుకొన్న అప్పటికి డబ్బు సర్దుబాటు కాలేదు అందుకే పెళ్లి రోజుకు ఇస్తున్నా! కానీ నీ అలక ఇలా విషయాన్ని బయట పెట్టేసింది అని రఘు చెబుతున్నాడే గాని ఈ సరితకు మాత్రం బంగారపు వుంగరం అన్న మాట దగ్గరే చెవులు పనిచేయడం ఆగినట్లున్నాయేమో?

“మనసుంటే మార్గము” వుంది అని నిరూపించిన తన భర్తను చూస్తూ  “అనుకున్నదోక్కటి, అయ్యిందొక్కటి లాగా” సరిత ఒకే సారి ఆశ్చర్యం మరియు ఆనందంలో ఉండగా రఘు,బాబు చింటూ ని తీసుకొని బయటకు బయలుదేరారు. ఈ సరిత చీర చాలనుకొంటే తన భర్త ఉంగరం ఇస్తాడంటే తన భర్త ప్రేమను గుర్తించ లేకపోయినందుకు బాధపడుతూనే “తంతే బూరెల గంప”లో పడ్డట్లు గా వుంది అనుకొంటూ ఈ  ఆనంద విషయం” కల్యాణ మొచ్చినా కక్కొచ్చినా ఆగదు” అన్న తీరులో వెంటనే పక్కింటి పంకజం ఆంటీకి చెప్పేందుకు “లేడికి లేచిందే పరుగు “అన్నట్లుగా పరుగు పరుగున వెళ్ళింది సరిత.

-కె. అమృత జ్యోత్స్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో