సమస్య ఎప్పుడూ
చూసే చూపులోనే
మారింది కాలం కాదు
మనిషి
***
గూడు విడిచిన పక్షులు
తిరిగి వాలాయి…
పైచేయి ఎప్పటికీ
పల్లెదే …
***
వెదురు నిండా
రంధ్రాలు…
మనసుతో మీటితే
మదినిండా రాగాలు
***
భవనాలు పునాదులు
భూమిలోనే
మనుషులు మూలాలు
పల్లెల్లోనే…
***
రెడీమేడ్ ఇప్పుడు
అందరికిష్టమైన మాట
బట్టలైనా..
భోజనమైన…
***
కోవెల లేని
తెల్లనట్టల దేవుడు
మానవత్వాన్ని
పంచుతున్నాడు
***
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~