మొక్కను నాటవు
చల్లదనం కావాలంటావు
కాలుష్యానికి కాలు దువ్వి
శుభ్రత పెంచాలంటావు
ప్రక్కవారితో పలకవు
సంఘజీవినంటావు
ఏం మనిషివి ?
ప్రాణదాతనే పక్కకు పెడతావా ?
పారిశుద్ధ్యపు బాటనే విస్మరిస్తావా?
తప్పు మానవా
చెట్లను పెంచు శ్వాసను పంచు
పరిసరాలను తెల్ల కాగితంలా మలుచు
పక్షులను జీవాలను కనికరించు
తోటి వానికి చేయూత హస్తాన్ని అందించు
మనిషి ననిపించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టు
మనీషిగా మారటానికి ప్రయత్నించు
మనిషి – మనిషి అని కూడా పేరు పెట్టవచ్చు
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~