రూపం లేని చోట
ఎందుకీ వెదుకులాట
ఒకటీ… రెండూ.. మూడు
దాటుతున్న రోజుల్ని చూసి మురిసేలోగా
నెలనెలా నేనున్నానంటూ
ఆ నాలుగు రోజులూ
తిష్టవేసుకుని కూర్చుంటుంటే
ఐనా ఇంకా ఎందుకో ఆశల సయ్యాట!!
పురిటినొప్పుల బాధ అనుభవించాలని కలగంటుంటే
బహిష్టు కడుపునొప్పి వదలకుండా వస్తుంటే
రక్తమాంసాలతో ఏర్పడే ఓ చిన్ని రూపం ఏర్పడేవేళ
రక్తపు గడ్డలై నెలసరి పలకరిస్తుంటే
రూపం లేని చోట
ఎందుకీ వెదుకులాట!!
-గాయత్రి శంకర్ నాగాభట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~