కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
నాటే చేతులు నా కిష్టం
అవి చేసే చేతలు నాకింకా ఇష్టం
విత్తనం నుండి నిద్రలేస్తాను
వేల ఆలోచనలను నిద్రలేపుతాను
కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
బూతల్లి సంతానం నేను
ఆకాశం వైపు ప్రయనిస్తాను
నువ్వు బ్రతకాలంటే తలెత్తి పైకి చూడు
నన్ను చంపాలంటే తలదించుకొని క్రిందకి చూడు
ఎండ నన్ను బయపెట్టలేదు
చలి నాకు లెక్కలేదు
వానకి గొడుగు పట్టను
మంట అంటే కొత్తచిగురే కదా
కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
నీకు ఇంటినౌతాను
పడవ నౌతాను
కడవ నౌతాను
కొడవలి నేనే
కంకి నేనే
నీ పాటకు ఎంకి నేనే
నాటే వాడు మిగలడు
చూసే వాడు మిగలడు
కోసే వాడు మిగలడు
నేనే మొదట పుట్టాను
నేనే చివరకు మిగులుతాను
కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
నీ కుడుకు
నీ చెలికి
నీ చలికి
ఆఖరికి నీ చితికి
మంటను నేనే.
అన్ని రంగులు నావే
అన్ని హంగులు నావే
ఋతువులు నావే
కృతువులు నావే
నేనే విశ్వం, నేనే నీ సర్వసం
గడ్డిలా నీ క్రింద నేనే
మానులా నీ పైన నేనే
నేనే విశ్వం, నేనే నీ సర్వసం
కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
విత్తును నేనే, మొక్కను నేనే
చెట్టును నేనే, మానును నేనే
నేనే మొత్తం నేనే సమస్తం….
కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను
– శీను .జి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~