మళ్ళీ ఆమె పెదవుల మీద
ఒక చిరునవ్వు
తోటలోని ప్రతి మొగ్గా
సిగ్గుతో అయ్యింది పువ్వు
-మీనా కాజీ
మనసులోని బాధ మేల్కొన గానే
నేత్రాలు విప్పార్చుకున్నాయి
గుండె గాయాలు పైకి రాగానే
కన్నీళ్లు జలజలా వర్షించాయి
– షాయర్ అమ్రోహ్వి
నన్ను నా సమాధి దాకా చేర్చినందుకు
ప్రియా ! కృతజ్ఞతలూ ధన్య వాదాలు
ఇక ఇక్కడి నుండే మొదలవుతాయి
గమ్యం వరకూ నా పాదాలు
-చక్ బస్త్
కొన్ని అందమైన కలలు
మరి కాస్త కన్నీరు
ఇదే నేను బతుకంతా
సంపాదించుకున్న తీరు
-మజ్ హర్ ఇమాం
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~