మా అమ్మ….గయిరమ్మ..!(కవిత)- -కలమట దాసుబాబు

ఊట నీటి కోసం ….
అడుగంటిన పేట నేలనుయ్యికాడ
కోడి కూతకు ముందే …
పడి గాపులుపడ్డ నీళ్ళకుండ అమ్మ….!
ఊపిరాడని ఉబటలో…
కర్రపొయ్యి కమురు వాసన పంచన
మసిబారిన మంగలం పెంకు అమ్మ…..!

పగిలిన మట్టి పాదమై
నా కడుపు నింపిన కూటి ముద్ద అమ్మ…..!
బుగత పంట కల్లాన
సెరిగీ…సెరిగీ… చిరిగిన చింకి చేట అమ్మ…..!
ఎక్కీ దిగిన పొలం గట్లపై
నలిగీ నరుమైన పెనుగులాట అమ్మ….!
సెంటు భూమి లేని సేద్య క్షేత్రం అమ్మ…
‘పున్నమి’ నెరగని ‘గౌరి’
మా అమ్మ గయిరమ్మ….!

సట్టెడు సల్లందితో ఇంటిల్లిపాదీ కడుపు నింపగా మిగిలిన
సేరెడు గంజినీళ్ళ గుటక అమ్మ….!
కోడి…పంది…. పిల్లి…పిచ్చుక….
మా ఇంటి సకలజీవరాసుల ఆకలి భాషనెరిగిన ఆదిమ జీవలక్షణం అమ్మ..

ఇవ్వని తనమంటూ లేని
ఆశించే గుణమంటూలేని
నిశ్వార్థ హృది అమ్మ….!
అనుబంధాల గాఢాలింగనపు మార్థవం అమ్మ….!

అనేకానేక కష్ట సమయాల్లో
అవిసి పోతున్నా….
పెగలని దుఃఖ సాదృశ్యం అమ్మ….!
కరవడన పుట్టిన కసురు కాయనని….
నన్ను కంటి గుడ్డును చేసి పొదివిన రెప్పల గూడు అమ్మ….!
ఉప్పని చెమట చుక్కల్ని బీజాక్షరాల్ని చేసి….
పసుపాకుపచ్చ మడిలా
నా బతుకుని మిసమిస లాడించిన పగటి వెలుగు అమ్మ….!

అమ్మా….గయిరమ్మా….
నీకు…ఆదరువునయ్యే
స్వశక్తిగా నేను రూపు కడుతున్న వేళ…..
నన్నో కన్నీటి మూటను చేసి కనుమరుగయ్యావు…
కలలోనైనా ఒక్కసారి కానరావమ్మా….
పగుల్లీనిన నీ పాదాలకు లేపనాన్నై నా బతుకుని కాపడం చేస్తాను….

-కలమట దాసుబాబు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో