యానాదుల గడ్డపార ముహూర్తం (వ్యాసం )- డా.వి.ఎన్.మంగాదేవి,

భారతీయ సంస్కృతిలో భిన్నత్యంలో ఏకత్వం ఒక ప్రత్యకమైన, విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన ఉదాహరణే ఈ గడ్డపార ముహూర్తం కూడా.

శిష్ట, సంస్కృతిలో ఒక విశేషమయిన ముహూర్తం అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తమే గిరిజన జాతిగా గుర్తింపబడిన యానాదుల వివాహ ముహూర్తం గడ్డపార ముహూర్తం. ఈ యానాదులు మాంగోలియన్ జాతికి చెందిన వారని,యానాదులు, చెంచులు ఒకరే అని, నల్లమల అడవులలో వీరిని చెంచులని, కొండలు దిగి ఆ చెంచులే యానాదులయ్యారని, చెంచులకు, యానాదులకు, బేధమున్నా పోలికలూ వున్నాయని, చెంచులు, ఈ యానాదులను ఊర చెంచులని, వ్యవహరిస్తారని పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. సముద్ర తీరాన్ని యానం అంటారు. ఆ తీరాన్ని ఆశ్రయించి జీవనాన్ని సాగించే జాతి కాబట్టి యానాదులు అయి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ వీరి వివాహ ఆచారాలను పరిశీలించినట్లయితే వీరు గడ్డపార ముహూర్తంలో తాళి బొట్టు కడతారు.

ఈ గడ్డపార ముహూర్తం అంటే వీరు ఒక గడ్డపారను(గడ్డ పలుగును) భూమిపై నిలబెట్టి నిదా భూమిపై ఎప్పుడుపడదో అప్పుడు తాళి బొట్టు కట్టిస్తారు. అంటే మిట్ట మధ్యాహ్నం.
శిష్ట సంప్రదాయంలో ఈ ముహూర్తమే అభిజిత్ ముహూర్తం. అసలీ అభిజిత్ ఒక నక్షత్రం యొక్క ఛాయ భారతీయ సంస్కృతిలో 27 నక్షత్రాలలో ఒక నక్షత్రమైన శ్రవణా నక్షత్రం యొక్క ఛాయ అని ఒక పురాణ కథ ఉంది.

దక్ష ప్రజాపతి కుమార్తెలే మన 27 నక్షత్రాలు. ఈ 27 మందిని చంద్రుని కిచ్చి వివాహం చేసాడు తండ్రి అయిన దక్షుడు. అయితే చంద్రునికి రోహిణి నక్షత్రం అంటే ఇష్టమట. శ్రవణా నక్షత్రం ఒక రోజు తన ఛాయ ను తన స్టానంలో ఉంచి తండ్రి వద్దకు చంద్రుని విషయం తేల్చుకునేందుకు వెళ్ళిందట. ఆ శ్రవణా నక్షత్రం స్టానంలో వున్నా ఛాయ ఈ అభిజిత్ నక్షత్ర మట. అభిజిత్ కాంతి లేని నక్షత్రం అంటారు. ఇది 28 వ నక్షత్రంగా చెబుతారు. ప్రతిరోజూ ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది. ఆ సమయం మధ్యాహ్నం సమయము.
ఈ అభిజిత్ లగ్నం సమయంలో సూర్య కాంతి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. అందుకే ఈ లగ్నం చాలా మంచి లగ్నం అంటారు. ఈ లగ్నం సర్వ దోషాలను పోగొడుతుంది. క్షీరసాగర మధనం ప్రారంభం ఈ ముహూర్తంలోనే జరిగిందట. శ్రీరామ చంద్రుని కళ్యాణం ముహూర్తం ఇదేనట. మహాభారతంలో భీష్ముడు యోగ స్టితిలో ప్రాణములు విడిచింది ఈ లగ్న సమయములోనేనట. వేద శాస్త్రములు తెలిసిన శిష్టులు ఈ లగ్నమును వివాహ లగ్నముగా చేసుకున్నారంటే ఆశ్చర్యము లేదు. కానీ ఈ భారతదేశంలో కొండల్లో, అడవుల్లో నివసించి సముద్ర తీరానికి చేరి, ఎలుకల మాంసాన్ని ఆహారంగా తీసుకొనే యానాదులకు, వేట ప్రధాన వృత్తిగా, వ్యవసాయం ఒక పరిమితి వృత్తిగా చేసుకొని, వేదం శాస్త్రాలు అంటే తెలియదని నాగరిక సమాజం అనుకొనే ఈ యానాదుల ఈ అభిజిత్ లగ్నాన్ని ఎలా వివాహ లగ్నంగా స్వీకరించారు. వేద జ్ఞానము, శాస్త్రజ్ఞానము ఒకరి వద్దే అగిపోయిందా. పరిమిత సమాజానికీ పరిమితమయి పోయిందా. ఈ జాతి నరనరానా వ్యాపించిందా ఏది సత్యం? సత్యాన్ని తరచి చూసినట్లేతే, వేద జ్ఞానము, శాస్త్ర జ్ఞానము పరిమిత పరిధులలో ఉందిపోయింది అనుకుంటే అందులోని అభిజిత్ లగ్నం దాని విశిష్టత. యానాది వారి వద్దకు ఎలా చేరింది. వారికి ఆచరణ యోగ్యం ఎలా అయింది? ఈ విశాల భారతదేశంలో జ్ఞానము మూల, మూలకి ఎలా ప్రసరింప చేయబడింది.ఈ దృష్టి కోణంలో మన మొకసారి ఆగి, మన దృష్టిని సారించినట్లతే ఈ దేశము యొక్క సంస్కృతిలోని భిన్నత్యంలో ఏకత్వం అర్థమవుతుంది. జ్ఞానం ఒకరి వద్దే ఆగిపోలేదు. స్వీకరించి ఆచరించే మనసున్న ప్రతి మనిషి దాకా ప్రసరించింది.

సూర్య కిరణాలు ప్రసారాన్ని అర చేతిలో ఎవరూ ఏలా ఆపలేరు. అలాగే జ్ఞానాన్ని కుడా జ్ఞానతృష్ణ ఉన్నవారిని చేరి తీరుతుంది.
కొండలపై అడవులలో జీవనం కొనసాగించే చెంచులకు,యానాదులకు ఆ జ్ఞానతృష్ణ ఎంతదిదో ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది. మానవ జాతికి అవసరమైన వివాహ బంధం స్త్రీ, పురుషుల మద్య నిలబడి ఉండాలనే తపన వారిలో ఉంది. అందుకే ఈ ముహూర్తాన్ని అంది పుచ్చుకునే జ్ఞానాన్ని, వారు వెతుక్కొని సంపాదించుకోగలిగారు. వారి జాతికి ఏది అవసరమో వారి మనుగడకి ఏది ప్రాధాన్యమో దానిని శోధించి, సాధించుకున్నారు అంటే యానాదుల దృష్టి ఎంత గొప్పదో వారి ఆలోచనా పరిధి ఎంత మహోన్నతమైనదో గిరిజన సాహిత్యంపై పరిశోధన చేసి ఈ విషయాలను అందిస్తూన్న పరిశోధకుల దృష్టి ఎంత విశాలమైనదో అర్థం చేసుకోగలిగితే సమాజానికి వారు ఎంత హితం చేస్తున్నారో అర్థం అవుతుంది.

ఆధార గ్రంధాలు:
1. నాయక్, గోనా,ఆచార్య. గిరిజన సాహిత్యం. తెలుగు అకాడమీ, 2012.
2. భోజన్న, తాటికాయల.డా. సంపా. గిరిజన సాహిత్యం,భాష సంస్కృతి.ఆనంది ప్రచురణలు,
ధర్మపురి,జగిత్యాల.2022.
3. యం.ఆర్.వి.శర్మ.డా. వశిష్ట సంహిత. మోహన్ పబ్లికేషన్స్,రాజమండ్రి 2016.
4. శివరామకృష్ణ,శక్తి. తెలుగులో గిరిజన సాహిత్యం. సాహిత్య అకాడమి, 2021.

యానాదుల గడ్డపార ముహూర్తం
డా.వి.ఎన్.మంగాదేవి,
తెలుగు శాఖాధ్యక్షులు
మారీస్ స్టెల్లా కళాశాల.విజయవాడ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో