రోమన్ మహోన్నత మూర్తి  – లుక్రే షియా (వ్యాసం) – గబ్బిట దుర్గాప్రసాద్

రోమన్ నోబుల్ మహిళ లుక్రేషియా  సెక్సాస్ టార్క్వయినస్  చేత రేప్  చేయబడి ,ఆత్మహత్య చేసుకొన్న ఫలితంగా ప్రజాందోళన తిరుగుబాటు జరిగి ,రోమన్ సామ్రాజ్యం పతనం చేయబడి రిపబ్లిక్ పాలన క్రిందకు వచ్చింది . లూమినస్ టార్ క్వి నస్ సూపర్ బస్  చివరి రోమన్ చక్రవర్తి గా చరిత్రలో మిగిలిపోయాడు . ప్రజా తిరుగు బాటు  రాజును పరివారాన్ని రోమ్  నుంచి శాశ్వతంగా బయటి నెట్టేసింది . ప్రజాపాలన అనే రిపబ్లిక్ కు మద్దతు పలికింది .

  ఈ సంఘటనలకు సరయిన చారిత్రక ఆధారాలు లేవుకాని చరిత్రకారుడు లెవీ ,గ్రీక్ -రోమన్ చరిత్రకారుడు  డయో నియస్  లు ఆతర్వాత అయిదు వందల ఏళ్ల తర్వాత  దీన్ని కనుగొని బయట పెట్టారు.

  బాల్యం:

     ప్రాచీన రోమ్  లెజెండరీ  హీరోయిన్ లుక్రే షియా .ఆమె లూషియస్ టార్క్వి నస్ కొల్లాటి నస్  భార్య . ఈ దంపతులు అన్యోన్య ఆదర్శ దంపతులుగా ప్రసిద్ధి చెందారు. స్పూరియస్  లుక్రే షియస్ ,లూషియస్  టార్క్వి న్ కొల్లాటి నస్  దంపతుల కుమార్తె  లుక్రే షియా .. లుక్రే షియా  అందం ,పవిత్రత లకు ఆటపట్టు .  భర్త  యుద్ధాలతో దూర ప్రాంతాలలో ఉన్నప్పుడు  ఆమె అతడి క్షేమం కోసం ఇంట్లో ఎప్పుడూ ప్రార్ధనలు చేస్తూ ఉండే  ఆదర్శ మూర్తి  . ఆమెను ఇతర రోమన్ స్త్రీలకంటే భిన్నంగా ఆరాధనా భావంగా చూసేవారు అక్కడి ప్రజలు . ఇతర యుద్ధ వీరుల  భార్యలు  భర్తలు యుద్ధం నుంచి తిరిగి వచ్చే సరికి తాగుతూ ,పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటూ కనిపించేవారు . వీరికి విభిన్నంగా లుక్రే షియా ఒంటరిగా ,మౌనంగా ప్రార్ధనలతో ఊలు  అల్లుతూ ఉండేది  .అందువలన రోమన్ మహిళలకు ,ప్రజలకు ఆమె పతివ్రతా శిరోమణి .ఆరాధ్య దేవత .

  లుక్రే షియా  రేప్  చేయబడిన సంవత్సరం క్రీ. పూ.50 9  -50 8 . ఆమె చనిపోయింది 509   బి.సి.  ఆర్డియస్  పై దండయాత్ర చేసే ప్రయత్నం లో చివరిరాజు లూషి యస్ సూపర్ బస్ తనకొడుకు టార్క్విన్  ను కొల్లాషియా కు మిలిటరీ పనిమీద పంపాడు . అక్కడి గవర్నర్ అతడిని రాజ గౌరవంతో ఆహ్వానించి ,రాజు కజిన్  అయిన టార్ క్విన్ కొలాషియస్  సౌధం లో రాకుమారుడి హోదాకు తగినట్లు గొప్ప ఆతిధ్యమిచ్చాడు .

 అప్పుడు ఒక వైన్ పార్టీ లో టార్క్విన్ ,కొల్లాటినస్ లు భార్యల గుణ శీలాలపై  చర్చించుకొన్నారు . ఈవాదాన్ని తీర్చటానికి కొల్లాటి నస్ మధ్యవర్తిగా ఉన్నాడు .ఇంటికి వెళ్ళి లుక్రే షియా  ఏం చేస్తోందో చూసిరమ్మన్నాడు . ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె తన సేవికలతోకలిసి  నేతపని  చేస్తూ కనిపించింది . ఆపార్టీ ఆమె విజేతగా ప్రకటించింది . వాళ్ళను ఇక్కడే ఉండమన్నాడు కొల్లాటి నస్ .కానీ  వాళ్ళు కాంప్ కు వెళ్లిపోయారు .

   ఆరోజు రాత్రి రాకుమారుడు టార్క్విన్ ,చెలికత్తెలు నిద్రపోతుండగా  లుక్రే షియా బెడ్ రూమ్ లోకి వెళ్ళి ,చెలికత్తేలు  ఆమెను  తన కామ వాంఛ తీర్చమన్నాడు,ఆమెను రోమన్ సామ్రాజ్యానికి రాణి ని చేస్తానని   లేకపోతే ఆమెను, ఒక మగ కాపాలాదారుడిని  చంపి ఒకరి శవాలపై ఒకరిని ఉంచుతానని భయపెట్టాడు . ఆమె ఏమాత్రమూ లొంగలేదు . పతివ్రత అయిన ఆమె  భర్తపై భక్తి ఆరాధనాలతో వాడిమాట వినలేదు లొంగిపోలేదు . రేప్  చేసి చంపేస్తానని బెదిరించి రేప్ చేశాడు . అవమానం భరించలేక మర్నాడు ఉదయం తండ్రి దగ్గరకు వెళ్ళి మో కాళ్ళపై పడి  మొక్కీ,కత్తితో గుండెల్లో పొడుచుకొని తండ్రి చేతులలో అక్కడికక్కడే చనిపోయింది   This dreadful scene struck the Romans who were present with so much horror and compassion that they all cried out with one voice that they would rather die a thousand deaths in defense of their liberty than suffer such outrages to be committed by the tyrants.”[10]

 

చనిపోతూ ‘’ By this blood—most pure before the outrage wrought by the king’s son—I swear, and you, O gods, I call to witness that I will drive hence Lucius Tarquinius Superbus, together with his cursed wife and his whole blood, with fire and sword and every means in my power, and I will not suffer them or anyone else to reign in Rome

  అని శపించింది పరమ పతివ్రత లుక్రే షియా . ఆ సాధు శీల  మరణాన్ని తట్టుకోలేని రోమన్ ప్రజలు తిరుగుబాటు చేసి రాజ కుటుంబాన్ని వెలివేశారు .ఆ తిరుగుబాటుకు లూషియస్  జూనియస్  సీజర్ నాయకత్వం వహించాడు . టార్క్విన్ రాజకుటుంబాలను రోమ్  నుంచి తరిమేశారు . రిపబ్లిక్ ను అంటే ప్రజాపరిపాలన ఏర్పాటు చేసుకొన్నారు . ఆమె చనిపోయిన 509 బి. సి . ని రోమన్ రిపబ్లిక్ సంవత్సరంగా భావిస్తారు . షేక్స్ పియర్ ఆమెపై ‘’ది  రేప్  ఆఫ్ లారెన్స్ ‘’కవిత రాశాడు .పతి వ్రతలు మన దేశం లోనేకాదు ,అనేక దేశాలలో కూడా ఉన్నట్లు లుక్రేషియా  జీవిత చరిత్ర వలన తెలుస్తోంది .

 -గబ్బిట  దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో