కూలీలు
రాళ్ళేత్తుతున్నారు
బండలు తేలికే
బతుకే బరువు
****
కులవృత్తుల్ని
నమ్ముకున్న పల్లెలు
కట్టి మీద సాము
జీవితాలు
సర్కారు బడిలో
పూసిన పూలు
ఈ సేవ పరిమళం
అక్కడిదే మరి !
***
స్కూలు నుండి
కాలేజీకి మారాను
బడి పరిమళం
ఎప్పటికీ పోదు
****
మళ్లోక్కసారి
పాతబడికి వెళ్ళాలి
పుట్టింటికి
పిలుపు అవసరమా !
****
భూమీ
అలకలు పూచింది
నీలాకాశం
చినుకై ముద్దాడింది
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~