అక్షరాలు
ఆత్మీయంగా పలకరిస్తున్నాయి
రాస్తుంది
అమ్మ గురించి కదా
***
అతని బాణీ
జానపద వాణి
పగలే వెన్నెల కురిపించే
మాంత్రికుడు
***
అతడు పేదవాడే !
ఆస్తులు లేక కాదు
అనురాగం
పంచే వాళ్ళు లేక
***
కులాల పేరుతో
జనాల రణం
కులం లేకుంటే
గడవదు క్షణం
***
వస్తే రాణికష్టాలు….నష్టాలు
భూమికి లేవా
పగలు…రాత్రులు
***
విత్తనం
మట్టిని ముద్దాడింది
రేపటి మహా వృక్షానికి
నాంది
***
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~