మందు కొట్టనీయండి భక్తుణ్ణి
మందిరంలో కూర్చొని
లేదా ! నాకా ప్రదేశం చూపించండి
ఎక్కడ భగవంతుడు లేడని ?
-దాగ్ దేహల్వీ
ఎంత తాగించాలనుకున్నావో
అంత తాగించేయ్ సాఖీ !
మళ్ళీ వస్తానో లేదో మరి
ఈ మధు వసంతంలోకి
-రాణా గన్నౌరీ
వాళ్లకు తాగాదమూ తెలియదు
తాగించడమూ తెలుసుకోరు
మర్యాదస్తులు పాపం
మద్యపాన మంటపంలో కూర్చున్నారు
-నీరజ్
ఒకప్పుడు మధుపానమే జీవనం
ఇప్పుడు జీవనమే పానం
ఎవరో తాగిస్తున్నారు
ఇప్పుడిక ఇదే సుమా సేవనం
-జిగర్
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~