ఆకలితో కళ్ళు
దగ్గరకొస్తే
దూరాన్ని వడ్డించావు….
కళ్ళకు
కలే అన్యాయమై
నిద్ర శత్రువయింది.
* * * *
ఆకలి తీరని కాళ్ళు
వెళ్లిపోతుంటే
భారమై అనిపించావు….
కాళ్లకు
దారి రుచింపక
గమ్యం పగయింది.
* * * *
మోసిన మనసే
పలుచనై
మూగదై తెలిపోయింది
రాసిన కవితే
బరువై
గుండెలో ఉండిపోయింది.
….శ్రీ సాహితి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~