నీ ఆప్యాయత అనురాగాలకై
గాలికే ఊపిరిని అవ్వనా
వెన్నెలకే కాంతిని ఇవ్వనా
పూలకే పూజ చెయ్యనా
ఆకాశానికే అంతులేని శక్తిలా
అవనికే నిట్టూర్పును నేర్పిన నిజం లా
తిరిగిరాని లోకాలకు వెళ్ళావు
మరపురాని జ్ఞాపకాలను ఇచ్చావు
నువ్వు సూర్య కిరణానివో
అగ్నిమంటల హోమాగ్నివో
గంగకే ప్రవాహ స్పూర్తిని నింపిన ప్రధాతవు
సృష్టికే తలరతరాసిన విధిరాతవు
నీవు నవ్విన నవ్వే ప్రకృతియై నిలిచింది
నీడలా నీ వెలుగు నా వెంట నడిచింది
నీ చూపే సకల జీవరాసులకు వెలుగు
ఈ విశ్వానికే స్నేహమై నిలిచావు
సంద్రానికే అలల అందాన్ని అమర్చావు
వర్షానికే చినుకులను కానుకగా ఇచ్చావు
నా గుండె గుడిలో కొలువైనది నీ రూపం
కోయిల స్వరం లో నీ మధుర గానం
పాలపుంతలోని నక్షత్రాలే నీ పాద పూజకై వేచి ఉన్నాయి
నీ చిలుక పలుకుల రూపంలో చిలుకను మొలిచావు
చంద్రునికే ఆశ్రయమిచ్చినా శివ చంద్రుడా
మరల నీ ప్రేమ పొందుటకై
మరు జన్మలో కూడా నీ పుత్రిడిగా జన్మించాలని
సూర్య సాక్షిగా ప్రార్దిస్తున్నా ‘’ నాన్న ‘’
– విష్ణు వర్ధన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~