నాకెప్పుడూ పెద్దగా
గుర్తుకు రాడు ఖుదా
ఆమెను చూస్తే చాలు
జ్ఞప్తికోస్తాడు సదా
-మీర్ తకీ మీర్
ఏది ఏమైనా సరే
ఒక్కసారి నీ దర్శనం చాలు
ఆ పిదప నా దృష్టి
భ్రష్టమైనా మేలు
-సిరాజ్ లఖ్నవీ
తనివి తీరా చూడలేదు
తనతో మాట కూడా కుదరలేదు
పరితపిస్తూనే ఉన్నాను
పరిచయం కూడా జరగలేదు
-బషీర్ బద్ర్
ఏం చెప్పను నేను
ప్రేమ ఎక్కడ వుందంటే ?
నరనరాల్లో తిరుఉతూ
శరమై పరుగు తీస్తుంటే !
-అస్గర్ గొండ్వీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~