నీడనైనా ఎదిరించగలను(కవిత)- డా.బి. హేమావతి

మోజుపడి నీవు మోహంతో నా వెంట పడ్డ ఆనాడు
నా బాహ్య దృష్టికి నీవొక ప్రేమికుడివి
కానీ నా అంతఃదృష్టికి నీవోక సాధకుడివి

నా నీడ కూడా ఏ క్షణం నిన్ను మరువ లేదు
కౌమారములో నీవు నన్ను మాయ చేసి
బుద్దిహీనుడవై మరలిపొయావు తిరిగి ఇక రానని
పూర్ణవయస్కుడవై మరలి వచ్చి
నువ్వు నేను ఒకటన్నవు

ఏంటి తాళి అంటే ఎగతాళా

రెక్కలు తెగిన పక్షి వలే
నేను నేల వాలిన నాడు
రాబందువులు నాకై కాచుకున్న నేడు…
నేను నీకోసం తిరిగి చూడలేదు

నీవు నన్ను మోహంతో బందిస్తావని…

తెగిన గాలిపటము దిక్కులేక సుడిగాలితో
స్తానభ్రంసమై  కాసింత వాలు కోసం
వెదకిన నాడు నిన్ను ద్వేషించలేదు
తీరం దరిచేరిన నేడు జీవించలేను రాతియుగంలో

ఎడారి మొక్కలా ………..నిన్నటి నేటితో

ఇసుకపర్రలలో దాగిన నీటి కోసం అర్రులు చాస్తూ

పరదాల మాటున ఉన్నా…  నేడు తోడేలు
నీడనైనా ఎదిరించగలను ముఖాముఖి
-డా.బి. హేమావతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో