మేకోపాఖ్యానం- 24 – బాధితలే బాధ్యులా ..? -వి. శాంతిప్రబోధ

“ఇది విన్నారా ..
ఎంత ఘోరం .. ఎంత ఘోరం ..” గుండెలు బాదుకుంటూ వచ్చింది గాడిద
“ఏమైందోయ్.. “ఆరా తీసింది చెట్టుపైకి ఎగబాకే ఉడుత
“ఇవ్వాళ వార్తలు వినలేదా .. ఆమెను 35 ముక్కలు చేసి ఎటెటో గిరాటేసాడు ఆ కర్కశుడు ” అన్నది గాడిద
“శ్రద్ధ గురించి మాట్లాడుతున్నావా” అన్నది కాకి
“ఆ… అవును, లోక సంచారివి నీకు తెలుసు కదా .. ఎంత ఘోరం జరిగిపోయిందో .. అందుకే ఆడపిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పేది. విని చావకపోతే ఇట్లాటి చావే వస్తుంది మరి ” అక్కసుగా అన్నది గాడిద

“అసలు ఏం జరిగింది ?” ప్రశ్నించింది చిలుక

అప్పుడే వచ్చిన మేకల జంట కూడా ఏంటన్నట్టు చూసింది.

“నమ్మి సహజీవనం చేసిన యువతిని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టి రాత్రిపూట రోజు ఒక ముక్క తీసుకుపోయి మానవ సంచారం లేనిచోట్ల ఎక్కడెక్కడో విసిరేశాడట. అయినా ఆ అన్యమతస్తుడిని అని ఏం లాభం .. ఈ ఆడాళ్లకి అస్సలు బుద్ది ఉండక్కర్లా..?
ఏమన్నా అంటే హక్కులు, ఉద్యమాలు మొదలు పెడతారు. ” దొరికిందే సందు అని ఆడిపోసుకుంది గాడిద.

” నిజమా ..వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది ” షాకింగ్ గా అన్నది ఆడమేక
అవునన్నట్లుగా తలూపింది చెట్టుకింద కునుకు తీసే దున్నపోతుపై వాలిన కాకి

“అవును, వాడి పాపం పండి ఆరు నెలల తర్వాత ఆ విషయం బయటపడింది”. గాడిద
“వింటుంటే ఏదో క్రైమ్ సస్పెన్స్ థిల్లర్ లాగా ఉన్నదే ” అన్నది మగమేక
‘చాల్లే .. క్రూరత్వం నీకు థ్రిల్లింగ్ గా ఉందా ..” కసిరింది ఆడమేక

“అమెరికన్ టీవీ సిరీస్ డెక్స్టర్ చూసి ఈ హత్యలు ప్లాన్ చేశాడట” అన్నది కాకి

” ఏం చచ్చాడో.. అమ్మాబాబుల్ని కాదని నమ్మి వచ్చినందుకు శ్రద్ధకు పట్టిన గతి ఇది.. ఇప్పటికైనా ఈ ఆడపిల్లలకు బుద్ది వస్తుందో రాదో .. ప్రేమ దోమ అనంగానే ఎగేసుకుంటూ వాడితో పోతారు ” ఆడపిల్లలపట్ల అసహనం వెళ్లగక్కింది గాడిద.

“మనమంతా నచ్చిన వాళ్ళతో జత కట్టట్లేదూ.. అట్లాగే ఆ పిల్ల కూడా నచ్చిన అతనితో జత కట్టింది. అయితే మాత్రం చంపేస్తాడా.?.
ఒకరికొకరు నచ్చకపోతే, ఇద్దరికీ పడకపోతే విడిపోవచ్చుగా .. పాశవికంగా చంపుకోవటం ఏంటి ?
తమతో తెగతెంపులు చేసుకున్న బిడ్డ వెళ్ళిపోతే మాత్రం బిడ్డని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత పెద్దలది. నీకు మేమున్నాం అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలది. అది చేస్తే ఇంత ఘోరం జరిగేది కాదేమో ..”!ఆడమేక ఆవేదనగా అన్నది

“తన జీతంతో పాటు ఆమె సొమ్మంతా అతనే తన అలవాట్లకు ఖర్చు చేసేవాడట. వ్యసనాలకు లోనైన అఫ్తాబ్ ఆమె దగ్గరున్న సొమ్మంతా జల్సా చేసాడట. డబ్బులడిగేసరికి కోపంతో విచక్షణ మరచి ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడట.. ప్చ్ పాపం” అన్నది కోతి

“అదేం కాదు, లవ్ పేరుతో హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి .. అంతా లవ్ జిహాద్ లో భాగంగానే జరిగిందట. జనం అనుకుంటున్నారు” అన్నది గాడిద

“ఆ కిరాతకుడిని కాల్చి పడెయ్యాలి ” ఆవేశపడింది ఉడుత

“కన్నుకు కన్ను , పన్నుకు పన్ను అనే ఆటవిక నీతి సమాజంలో లేం . అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏది జరిగినా చట్ట ప్రకారం జరగాలి ” అన్నది మగమేక

“అన్యమతాల వాళ్ళను చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది ఆడకూతుళ్ల గతి. పెద్దలు నెత్తి నోరు కలిపి మొత్తుకున్నా వింటారా .. ఊహూ . స్వేచ్ఛ .. తొక్క తోలు అని వీరంగం చేస్తారు ” ఒత్తి పలికింది గాడిద.

“ఇద్దరి మతాలు వేరు కాబట్టి మత కోణంలో చూడడం భావ్యం కాదు. మతం రంగు పులిమి వాటి మధ్య ఘర్షణ, విద్వేష భావనలు పెంచడం అవసరమా” అన్నది చిలుక

“సహజీవనం చేస్తున్న యువతిని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ కావచ్చు, మాజీ ప్రియురాలిని ఎనిమిది ముక్కలు చేసిన యాదవ్ కావచ్చు పెళ్లి చేసుకొమ్మని పోరే ఆమెను ముక్కలు ముక్కలు చేసిన శామ్యూల్ కావచ్చు.

పెళ్ళాన్ని లేదా సహజీవనం చేసే మహిళల్ని ముక్కలు చేసి క్రూరంగా హతమార్చడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో అనుపమ గులాటిని ఆమె సాఫ్ట్వేర్ఇంజనీర్ భర్త రాజేష్ గులాటి 70 ముక్కలు చేసి హతమార్చాడు, అదే విధంగా భర్త సుశీల్ శర్మ చేతిలో ముక్కలై తందూరిలో కాలి మసైపోయింది నైనా సాహ్ని,
రాజు గెహ్లాట్ సహజీవనం చేస్తున్న నీతూ సోలంకి ని, సుమిత్ హండా భార్య నిరంజని పిళ్ళై ను ముక్కలు చేశారు
సహజీవనంలోనే కాదు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళలోనూ ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి ” తనకు తెల్సిన విషయాలు అందరి ముందు పెట్టింది మగమేక

” నిజమే, ఇట్లాటి ఘాతుకాలకు పాల్పడేవాళ్లు అన్నీ మతాలు, కులాల్లో ఉన్నారు. భర్తను నరికిన భార్య, ప్రియుడిని చంపిన ప్రియురాలు, ప్రియురాలిని చంపిన ప్రియుడు, భార్యను ముక్కలు చేసిన భర్త కనిపిస్తూనే ఉన్నారు.” ఆలోచిస్తూ అన్నది ఆడమేక.

“శ్రద్ధ హత్యకు ఆమెనే కారణం . అవును ఆ మాట నేను మాత్రమే అనడం లేదు. .
తల్లిదండ్రులను వదిలి బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసే చదువుకున్న యువతులను నిందించాలి. సహజీవనం చేయడం ఆమె పొరపాటు
ప్రేమలో పడితే పెళ్లి చేసుకోవాలి కానీ సహజీవనం ఏంటి?అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కూడా తెలుసా..” గాడిద సమర్ధించుకున్నది.

“సిగ్గులేని, హృదయం లేని క్రూరమైన వ్యాఖ్యలు అన్ని సమస్యలకు స్త్రీలను నిందించే మనస్తత్వం. బాధితులనే బాధ్యులను చేసే నైజం.. ఇవి కదా నేరాల్ని మరింత ప్రేరేపించేది. ఇట్లాటి వాళ్ళు మంత్రులు.. హూ ..” నిరసనగా ఆడమేక

“ప్రేమ పెళ్లి గతకాలపు వార్తలేమో .. ఇప్పుడు ప్రేమించిన వారితో సహజీవనం చేయడం బెడిసికొడితే నరికి ముక్కలు చేయడం, ప్రేమను తిరస్కరిస్తే వెంబడించి ఆసిడ్ పోయడం, కత్తిపోట్లు పొడవడం ఆధునిక రీతి కావచ్చు.
కేరళలో అయితే ఆమెను హత్య చేసి ఆమె రక్తాన్ని ఆరగించాడట ఓ శాడిస్ట్ ప్రేమికుడు” అన్నది కోతి .

“ప్రియురాలిని నరికిన క్రూరులే కాదు కన్న తండ్రిని ముక్కలుగా చేసిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు “చెబుతున్న ఆడమేకకు అడ్డుతగులుతూ
“కుటుంబం మొత్తాన్ని హత్యచేసిన కేశవ్ఉదంతం ఇప్పుడే వార్తల్లో విన్నాను. డ్రగ్స్ కి బానిసై అట్లా చేశాడట” అప్పుడే అందిన వార్త వివరించింది కాకి.

“వివాహేతర బంధాలు , మద్యం , మాదకద్రవ్యాలు .. మనిషిని విచక్షణకు దూరం చేస్తున్నాయి, మానవత్వాన్ని చంపేస్తున్నాయి.
క్షణికానందం కోసం ఆవేశంలో జరుగుతున్నవి ఎక్కువ. అయితే, పకడ్బందీ ప్లాన్ తో జరిగేవి కొన్ని ఉన్నాయి ” మగమేక

“అట్లయితే, అది తప్పు కాదంటావా..?” కయ్ అన్నది గాడిద

“తప్పు ఎవరు చేసినా తప్పే. అదొక మానసిక వైకల్యం. అణచివేయబడిన భావోద్వేగాలు వ్యక్తీకరించడానికి నేరం చేస్తారని విన్నాను. నిజమో కాదో కానీ శరీరానికి, మనసుకు ఏ ఇబ్బంది వచ్చినా చికిత్స చేయడానికి ఆసుపత్రులు ఉన్నాయి. అది వేరే విషయం అనుకోండి” అంటూ మరో చెట్టు వైపు తుర్రుమన్నది ఉడుత.

“ఎన్కౌంటర్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యవస్తీకృత నేరాలు చూస్తున్నాం. నిర్ధాక్షిణ్యంగా కాల్చివేయడం ఈ కళ్ళతో చూశాను.
బహుశా మనిషి కూడా ఆ దారిలోనే నడుస్తున్నాడేమో, ఆ పర్యవసానమే ఇటువంటి క్రూర హత్యలేమో..
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా .. చెప్పండి ” సాలోచనగా ఆడమేక

“ఆవుల మందలోకి చొరబడి గొంతులను కొరికే తోడేళ్ళను అంతం చేయడం తప్పేలా అవుతుంది. అది ప్రతీకారం కాదు దండన.
నీ తీరు నాకేం నచ్చలేదు. ప్రభుత్వం తో పోల్చడం అర్ధంలేనిది” అంటూ ఓండ్రపెట్టింది గాడిద

“మానవ హక్కుల కోసం నిలబడే వారిని ఎగతాళి చేయడం, నిందించడం, శిక్షించడం వల్ల ప్రతి పౌరుడికి ప్రమాదమేనేమో .. ” సావధానంగా పలికింది చిలుక

“అదే నన్ను కలవర పెడుతున్నది.” విచారంగా అని అందరి వంక చూస్తూ
“మనిషి తత్వంలో మార్పుకు కారణం ఏలికల విధానాలు, ప్రజలేమైపోయినా తమ స్వార్ధం ముఖ్యం అని అరాచక మూకల కొమ్ముగాసే నాయకులు, అసాంఘిక కార్యకలాపాలతో కుమ్ముక్కైన పాలకులు.. ” అని చెప్తున్న మగమేకను అడ్డుకుంటూ

“థూ .. శవాల మీద పేలాలు ఏరుకుతినే పందికొక్కులు తమ సామ్రాజ్యాన్ని పదిల పరుచుకోవడం కోసం
మద్యం, మాదకద్రవ్యం, మగువ మత్తులో యువతరాన్ని ముంచెత్తే మేకవన్నె పులులే ఈ నేరాలకు బాధ్యులు.
ఇలాంటి కిరాతక చర్యలకు, క్రూర మనస్తత్వానికి, మనిషితనం చనిపోవడానికి కారణం బడాబాబులు పెంచి పోషిస్తున్న కసాయి తనానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తున్న నేర సామ్రాజ్యం. అది క్రూర మృగం లాగా వెంట పడుతుంది. పరుగెత్తిస్తుంది ఆగితే తినేస్తుంది.
న్యాయవ్యవస్థ వెలుపల భద్రతా సంస్థల హత్యలు .. ప్రజాస్వామ్యానికే విఘాతం.
హింస మరింత హింసకు కారణం అవుతుంది . అదో అంటువ్యాధి లాంటిది. వాటికి ఆమోదం లభిస్తే న్యాయ వ్యవస్థ మూసుకోవాల్సిందే .. ” కుండబద్దలు కొట్టినట్టు ఆడమేక.
ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన మలుపు రానుందా ఆలోచనలో పడింది మిత్ర బృందం.

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో