నింగినంటిన ధరలను
ఆర్థికనిచ్చెనెక్కి అందుకోలేని
మధ్య తరగతి దాన్ని
అవే దిగి రావాలని
కోరుకునే సగటు ఆడదాన్ని
నిరీక్షణలో సహనం నశించి తిరగబడ్డా !
అంతే !
దారిలోకి వచ్చారంతా
అవినీతి అద్దాన్ని బద్దలు కొట్టాలని
అనుక్షణం తపన
ఆదిశక్తిని కదా!
అడుగు వేసానంటే
రాజకీయమే తలక్రిందులవ్వాలి
స్త్రీ చిత్రీకరణ
అసభ్యంగా ఉంటున్నా
కళ్ళు తెరుచుకొనే చూస్తున్నా ఇన్నాళ్ళూ
విజృంభణకు అపరకాళిలా
శ్రీకారం చుడుతున్నా నీ నాడు
అనురాగానికి ఆనందిస్తానని
అనుబంధానికి హారతులిస్తానని
ఆత్మీయతకి పరవశిస్తానని
అన్యాయానికి ఎదురు తిరుగుతానని
శాశనాన్ని తయారు చేయిస్తున్నా!
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~