మీరు ఏమిట్లు?
నేను మిరుమిట్లు గొలిపే కాంతిని
మీరు ఏమిట్లు?
నేను అనంత ప్రపంచ శాంతిని
మీరు ఏమిట్లు?
నేను భావితరాన్ని నడిపే పనిముట్టుని
మీరు ఏమిట్లు?
నేను విశ్వేశ్వరిడి గుడి తొలిమెట్టుని
మీరు ఏమిట్లు?
పండుగలో బొబ్బట్టు ని
జాతరలో కుంకుమబొట్టు ని
జనపదంలో రసపట్టు ని
నా పూర్వికుల శిల్పంలో కనికట్టు ని
నా పెరటి తేనేపట్టు ని
నా తల్లి చీరకట్టు ని
నా తండ్రి పంచెకట్టు ని
నా మాతృభాష తలకట్టు ని
ఇదే నా పరిచయం
నేను మనిషిని
నలుగురిలా పుట్టాను
నలుగురు మోస్తే పోతాను
-శ్రీను జి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~