మనకు కావాల్సింది దినోత్సవాలు కాదు సంబరాలు(సంపాదకీయం) – అరసి శ్రీ

ఈరోజుల్లో ఎంత పని ఉన్నా , ఎంత ఒత్తిడి ఉన్నా రోజులో ఒక్కసారైనా యూట్యూబ్ చూడకుండా రోజు గడవదు అనడంలో అతిశయోక్తి లేదు.  దానికి నేను అతీతం కాదు.

యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ లో

వీడియో పోస్టర్ ఒక  అర్ధంలో ఉండటం,  వీడియో క్లిక్ చేసి చూస్తే విరుద్దంగా ఉండటం సర్వ సాధారణం. అలా యూట్యూబ్ లో  ఒక పోస్టర్  చూడటం,

వీడియో క్లిక్  చేసి చూస్తుంటే  నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. నా కళ్ళు మాత్రమే నీటితో స్పందిస్తున్నాయి.  

మనం ఉంటున్న సమాజం, చుట్టూ ఉన్న మనుషులు ముఖ్యంగా ఇప్పటి తరం పిల్లలు మీద అసహ్యంతో కూడిన భయం కలిగింది. కారణం ఆ విడియో లో మలి బాల్యపు కథలు , వ్యథలు….

కొన్ని సూటి మాటలు……. కాదు కాదు సూటి  బాణాల్లాంటి ప్రశ్నలు…..

1.

నా కడుపులోంచే కదా అమ్మ వాడు వచ్చింది.

అలాంటిది వాడి ఇంట్లో నాకు చోటు లేదంట  అమ్మా ?

2.

నా కొడుకు ఇంట్లో నా కోడలి వాళ్ల అమ్మ , నాన్న,  కోడలు ,కొడుకు, మనవడు, మనవరాలు అందరు ఉండటానికి హక్కు ఉంది. నాకు లేదమ్మా …….

3.

మా ఆయన ఉన్నంత వరకు అన్ని బాగున్నాయి. ఆయన కన్నుమూసిన వెంటనే నన్ను ఇక్కడకి తీసుకు వచ్చి వదిలేసారు………

ఇవి ఆ వీడియోలో కొందరు తల్లుల  బరువేక్కిన మనస్సుతో ఆవేదనతో అడిగిన ప్రశ్నలు ? వీటికి సమాధానం ఎవరు చెప్పాలి ? ఆ  తల్లుల కన్నబిడ్డలా?  లేక నేటి తరమా ?, నేటి సమాజమా …..

అన్నట్టు,  ఈరోజు అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.

ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.

వృద్ధాప్యం మలిబాల్యం  లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఈరోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

మనిషి కాలంతో పాటు ఎదుగుతూ మారుతూ ఉండటం కాల ధర్మం , సహజం కూడా కాని నీకు జన్మనిచ్చి నిన్ను ఒక స్థాయిలో ఉంచడం కోసం అహర్నిశలు పాటుపడి పిల్లల ఆనందంతో తమ కష్టాల్ని మరిచిపోయి పెంచిన తల్లిదండ్రులను  ఎదిగిన తర్వాత మాత్రం మరిచిపోతున్నాం.

చిన్నతనంలో బడి నుంచి రాగానే అమ్మ కనిపించక పోతే ఆరాట పడిన మనం,

ఇప్పుడు ఎక్కడో బతికేస్తూ కనీసం అమ్మని  పలకరించే సమయం లేకుండా పోతుంది.

ప్రస్తుతం మనుషులు కాలక్షేపానికి ఎన్ని అవకాశాలు ,అవసరాలకి మరెన్నో దారులు ఉన్నాయి. కాని ఏవి మన అనుకున్న మనుసులు సాటి రావు అనేది సత్యం. ముఖ్యంగా మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ , వారి ఆపేక్ష ఆప్యాతల సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు , ఎప్పటికి రాదు. అవన్నీ ఆలోచించే తీరిక ఇప్పుడు ఎవరికి లేదు అదే బాధాకరం.

కాని ఒకటి మాత్రం నిజం మనం ఏం చేస్తున్నాము అదే రేపటి తరం నేర్చుకుంటుంది. ముందు తరాలకి అందించాల్సింది ప్రేమాభిమానాలు , ఆప్యాయతలు కాని ఎవరి వారే యమునా తీరే అన్నట్లు బ్రతకాలి అని కాదు.

ప్రేమ, ఆత్మీయత ల్లేని సంసారాల వల్ల, ఉద్యోగాల పేరిట దూరమైపోయిన కోడుకు – కోడళ్ల వల్ల గృహసంబంధమైన వివాదాల వల్ల దూరంగా ఉంటున్నారు. కారణమేదైనా ఫలితం మాత్రం పండుటాకులైన తల్లిదండ్రుల మీద పడుతోంది.

అమ్మా అన్న పిలుపు కోసం ‘నాన్నా’ అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

అసలు ఈ ప్రత్యేక దినోత్సవాలు అనేవి ఇతర దేశాల సంస్కృతికి, వాళ్ల పద్ధతులకి అవసరం అవుతాయి, వాళ్లకి ఉండాలి కూడా.   కానీ నేడు మన భారతీయులకి అత్యవసరంగా మారడం మన దౌర్భాగ్యం.

ఒక్కసారి ఆలోచించండి. మార్పు ఎక్కడి నుంచో రాదు. మనమే  తొలి అడుగు వేయాలి.

మనకు కావాల్సింది దినోత్సవాలు కాదు సంబరాలు.

– అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సంపాదకీయం, , , , , , , , , Permalink

One Response to మనకు కావాల్సింది దినోత్సవాలు కాదు సంబరాలు(సంపాదకీయం) – అరసి శ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో