మనిషిని
మ్రుగంతో పోల్చకు
వంచన ఎరుగని
వనజీవులు అవి
****
వ్యాయామం ఇప్పుడు
మనిషికే కాదు
మనసుకు కూడా
కావాలి
****
‘బొమ్మరిల్లు ‘
ఆడుకున్నప్పుడు తెలియదు
వంటిల్లు
శాశ్వతమౌతుందని
****
కలంతో దున్నితే
కాగితం కన్నీరు పెడుతోంది
రాతలు
నేతన్న గీతలు
****
ఎక్కడ చూసినా
టెక్నో స్కూళ్ళు
దోపీడీ లోనూ
అదే టెక్నిక్
****
చెరువు కడుపు
తరుక్కుపోతుందిఊరు
ఒంటరైపోయిందని
****
సముద్రం అలల మీద
సాగే పడవ ప్రయాణం
అదే
జీవనయానం
****
ఏమంత
పని చేసావని అలిసిపోయావ్
ఆదర్శం…
గాలి, నీరు,యేరు
****
సమయం వరకు
సంయమనం పాటించు
కోకిల లేదా
వసంతం వచ్చేదాకా
-– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~