మనసు మందారమై….(కవిత )-జయసుధ

రెక్కవిప్పుకుంటున్న
ఆనందమేదో నాతో పాటు ఎగురుతోంది.
నువ్వు మాట్లాడే
ఆ కాసిన్ని క్షణాలు నాకెంత అపురూపమో కదా.
ఏ రాతలు, గీతలు,
ఒప్పందాలు లేని అనంతమైన ప్రేమే కదా మనది.

నా రాత్రులు నీ పగళ్లయి

వెచ్చని కోరికల్ని ఆరబెడుతుంటే..
మచ్చుకైనా వచ్చి మంచుతునకైన

నా దేహాన్ని ఓదారుస్తావనుకున్నా..!
నదినై నీ వెంట పరుగెడుతున్నా..
అలవై వచ్చి
అలవోకగా కలుస్తావని.
వాలిపోతున్న పొద్దుని
ఎంతసేపని ఆపను..
నిదురలేచే నీ సమయాన్ని
కూసింత
వెనక్కి తొయ్యలేక..
ఆపసోపాలు పడుతున్న మనస్సుని
ఎందాకా ఊరడించను..!

ఏరుకొచ్చిన గవ్వల్లా నీ

ప్రతీ జ్ఞాపకం నా దోసిట్లో భద్రం.
నువ్వు నిల్చున్న ప్రతీ చోటు
గుండె తడుముతూనే ఉంది.
వలపు వర్షమై కురుస్తుంది.
మనసు మందారమైన వేళ..!

-జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో