కలా , నిజమా
మా ఊరి చెరువు నిండింది
మిషన్ కాకతీయ
జిందాబాద్ !
***
నేను
రాట్నం చుట్టకపోవచ్చు
అమ్మానాన్నల
వారసత్వం అది !
***
డాలర్ చిలకలు
పంజరంలో దాక్కున్నాయి
అగ్రరాజ్యంలో
క్వారంటైన్
***
సబ్బండ వర్ణాల
సంగమం
తెలంగాణలో
పెద్ద బతుకమ్మ సంభ్రమం
***
తెలంగాణ
దేశానికి అన్నపూర్ణ
కాళేశ్వరమా
నీకు జల నీరాజనం !
***
సిరిసిల్ల…సిద్ది పేట
ఉద్యమాల
ఉప్పెనలే కాదు
గోదావరి బిడ్డలు ..
-– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~