జ్ఞాపకం- 74– అంగులూరి అంజనీదేవి.

హాల్లో వున్న సోఫాలో కూర్చుని చాలా ప్రశాంతంగా, సంతృప్తిగా, చిరు దరహాసంతో వెలిగిపోతోంది సంలేఖ. ఆమె చుట్టూ వున్న మీడియావాళ్లు, ప్రెస్ వాళ్లు ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఆమె ఏమాత్రం తడబడకుండా చాలా సౌమ్యంగా, స్పష్టంగా సమాధానాలు చెబుతోంది.

అదంతా చూస్తున్న శ్రీలతమ్మకి జీవితంలో ఎప్పుడూ కలగనంత ఆశ్చర్యం కలుగుతోంది.

ఆమెకు తెలిసిన ఆడవాళ్లెవరూ ఇలా లేరు. బంధువుల్లో, స్నేహితుల్లో, చివరికి చుట్టుపక్కల ఆడవాళ్లలో కూడా ఎవరూ ఇలా లేరు. పత్రికల వాళ్లను, మీడియా వాళ్లను ఎప్పుడూ చూడలేదు. పాఠకుల ఆదరణ అంటే ఏమిటో తెలియదు. పత్రికల్లో, పేపర్లలో ఫోటోలు రావడం, వేదికలెక్కడం, అవార్డులు తీసుకోవడం అంతకన్నా తెలియదు. ఇవన్నీ సంలేఖలో చూస్తోంది.

సంలేఖ ఎక్కడో మారుమూల పల్లెలో ఒక సామాన్య రైతు కడుపున పుట్టింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదివి రాళ్లల్లో పుట్టిన రత్నంలా ఇప్పుడు జాతీయ అవార్డుకి ఎంపిక అయింది.

ఎంతో అంకితభావంతో నిత్యం ఇల్లంతా తుడిచి, గిన్నెలు తోమి, ఇంట్లోవాళ్లకి వండి పెట్టి, భర్త జీతం డబ్బుల్ని, కొడుకు జీతం డబ్బుల్ని తన ఆధ్వర్యంలోనే వుంచుకొని, ఇంటి ముందుకొచ్చి ధీనంగా అరిచే బిక్షగాడికి కూడా భిక్ష పెట్టకుండా జాగ్రత్త చేసి, బంధువుల్లో, స్నేహితుల్లో శ్రీలతమ్మ చాలా గట్టి మనిషి సంసారాన్ని చాలా పొదుపుగా లాక్కొస్తుందన్న పేరు తెచ్చుకొని ఎంతో కష్టపడుతుంటే తనకి రాని ఆ అవార్డు కోడలికి రావడమేంటి?

తనేం చేసిందని? కేవలం కూర్చుని రాసుకున్నందుకే ఇంత గొప్పతనం వస్తుందా? అని మనసులో అనుకుంటూ మీడియాని, ప్రెస్ ని, ఆ అవార్డు ఇస్తున్న సంస్థ వాళ్లని నాలుగు దులపాలనుకొంది. కానీ తన గురించి చెడుగా రాస్తారని, టీవీలో కూడా చెడుగా చూపిస్తారని ప్రెస్ కి మీడియాకి భయపడి హాల్ కి డైనింగ్ కి మధ్యలో వున్న కర్టన్ వెనకాలే నిలబడిపోయింది. అక్కడ నుండి సంలేఖను, మీడియాను, ప్రెస్ వాళ్ళను చూస్తుంటే ఆమె కళ్లు కారం పోసినట్లు మండుతున్నాయి. పత్రికా విలేఖర్లు సంలేఖను ఫోటోలు తీసుకున్నారు. వాటిని వెంటనే ప్రెస్ కి అందివ్వాలని హడావుడిగా వెళ్లిపోయారు. మీడియా మాత్రం అక్కడే వుంది. ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటోంది. వాళ్లు తీసుకుంటున్న ఇంటర్వ్యూను తన సెల్ ఫోన్లో రికార్డు చేసుకుంటూ దిలీప్ అక్కడే వున్నాడు.

అక్కడ కొచ్చిన చానల్సన్నీ మైక్ లు పట్టుకొని ఆత్రంగా ఆమె వైపు చూస్తున్నారు.

వాళ్లలో ఒక టీవీ యాంకర్ చలాకీగా కదిలి మేడమ్! ఇప్పటి యువత ఎలా వుందంటారు?” అని అడిగింది.

ఆ ప్రశ్నకు సంలేఖ ఏమాత్రం సమయం తీసుకోకుండా ఇప్పటి యువతకి ఆన్ లైన్ స్నేహాలు ఎక్కువయ్యాయి. ఫేస్ బుక్, ఆర్కుట్ వంటి వాటిలో ఇంకా ప్రవేశం లేదా అని ఎవరైనా అడిగితే అవమానంగా ఫీలవుతున్నారు. పక్కనున్న ఫ్రెండ్స్ తో పోల్చుకోవడం ఎక్కువయింది. అది చదువులో కాకుండా డబ్బుల్లో, డ్రస్సుల్లో. అంతేకాదు. ఇతరుల దగ్గర ఉన్నవి తమ దగ్గర లేవని బాధపడటం, ఆ తర్వాత క్రమేణ ధనవంతుల పిల్లలతో స్నేహాలు చేయడం, విలాసాలకు అలవాటు పడడం, అలవాట్లను వ్యసనాలుగా మార్చుకోవటం, ఆ వ్యసనాల కోసం ఎంతటి నీచమైన పని చెయ్యటానికైనా వెనకాడకపోవటం, నాకు తెలిసి కొంతవరకు ఇప్పటి యువత ఇలాగే వుందిఅంది.

ఇలాంటి వాళ్లకు మీరిచ్చే సలహా?” అని అడిగారు.

ముఖ్యంగా నెట్వర్క్ ని పెంచే మెయిల్స్, ఛాటింగ్ ల ప్రభావం యువత తమ కెరీర్ మీద పడకుండా చూసుకోవాలి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ను సోషల్ స్కిల్స్ ను పెంచుకోటానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. తొందరపడి తమ ప్రొఫైల్ ను వుంచటం, ఇంటి విషయాలు చెప్పుకోవడం, భావోద్వేగాలను వ్యక్తపరచటం లాంటివి వ్యక్తిగత నష్టాలకి దారితీస్తాయి. ఏది ఎంతవరకు వుండాలో తెలుసుకుంటే ఎవరి భవిష్యత్తు వాళ్ల చేతిలో పదిలంగా వుంటుందిఅంది.

ఇప్పటి పిల్లల పట్ల తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలంటారు?”

తల్లిదండ్రులకి ఒక పద్ధతంటూ వుండొచ్చేమోకాని పిల్లలకి వుండదు. అందుకే తమ పిల్లల చుట్టూ వున్న వాతావరణం ఎలా వుందో గమనించుకోవాలి. ఒక వయసు వచ్చాక వాళ్లే తెలుసుకుంటారులే అని వదిలేయకూడదు. వాళ్లు చేస్తున్న స్నేహాల మీద అబ్జర్వేషన్ వుంచాలి. అడ్వయిజ్ ఇవ్వాలి. బయట స్నేహాల్లోని మంచిచెడులను తెలుసుకునే నేర్పును నేర్పించాలి. ఇండివిడ్యుయాలిటి, రెస్పాన్స్బిలిటి, చదువుకోవడంలో ఆనందం పొందడం ఈ మూడింటిని పాటించేలా చూసుకోవాలిఅంది సంలేఖ.

ఆ మాటలు వినగానే మూతి విరిచింది శ్రీలతమ్మ. ఇదేదో పదిమందిని కన్న తల్లిలా చెబుతుంటే పిచ్చోళ్లు అది నిజమని నమ్ముతున్నారక్కడఅనుకుంది మనసులో.

స్నేహితులు ఎలా వుంటారు? స్నేహం చేస్తే దాని ప్రభావం ఎలా వుంటుందంటారు?” అని అడిగింది మరో యాంకర్.

స్నేహితులు చెబితే వింటారు. స్నేహితులు చదివితే చదువుతారు. స్నేహితులు మెచ్చుకుంటే పొంగిపోతారు. స్నేహితుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. అలా అని మనం బాగుంటే మన స్నేహితులు బాగుంటారని, మంచివారు కాదని తెలిసి కూడా వాళ్లతో స్నేహం చేస్తే వాళ్లు వీళ్లలాగా కాకుండా వీళ్లు వాళ్లలాగా మారే ప్రమాదం వుంది. స్నేహం చేస్తే దాని ప్రభావం మంచి కాని, చెడు కాని అంత గాఢంగా వుంటుందిఅంది. ఆమెకి ఆ క్షణంలో తన తిలక్ అన్నయ్య గుర్తొచ్చాడు.

చివరగా ఓ ప్రశ్న మేడమ్!అంది వాళ్లలో వెనక నిలబడి వున్న యాంకర్ ముందుకొచ్చి.

అడగండి!అంది ప్రసన్న వదనంతో సంలేఖ.

ఆమె ముఖంలోని ప్రశాంతత మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం చెక్కు చెదరకపోవటం చూసి లోలోన ఆశ్చర్యపోతూ అసూయ ఎందుకు పుడుతుంది? కోపం వల్ల ఏం జరుగుతుంది?” అని అడిగింది యాంకర్.

నవ్వింది సంలేఖ.

(ఇంకా ఉంది).

-అంగులూరి అంజనీదేవి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో