గోవున్న చోటు
అమృత నెలవు
గోవున్న చోటు
ధర్మమే కొలువు
గోవున్న
పాడి పంటల నెలవు
గోవున్న
పసిడి సిరులకు లేదు కొదవు
గోవు
సాధుగుణ సంకేతం
గోవు
అవని ఉద్దరింప
వెలిసిన దైవస్వరూపం
గోవు
తల్లి ప్రేమకి ప్రతిరూపం
గోవు
చతుర్వేద మంత్రార్దం
గోవును రక్షిద్దాం
గోసంపద సృష్టిద్దాం
గోధూళితో తరిద్దాం
గోవును పూజిద్దాం
-డా!! బాలాజీ దీక్షితులు పి.వి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~