మేకోపాఖ్యానం 22 – గాయాల శబ్దాల్లోంచి ఎగుస్తూ..- వి. శాంతి ప్రబోధ

శాంతి

“ఆశ్చర్యం…
నిజానికి పరదాలు కప్పి , నేరం రుజువై జైలు గోడల మధ్య గడిపిన వాళ్ళు బయటికి వస్తే పూలదండలేసి బాణాసంచా తో స్వాగతం పలకడం, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకోవడం ఇన్నేళ్ల నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. గుండెలో మంటల ప్రవాహం పుడుతున్నది” గతకాలపు గాయాల శబ్దాలు విన్న కాకి బాధగా అన్నది

“దేశమంతా ఆజాదీ అమృతోత్సవ్ లో భాగంగా ఇంటింటా మూడు రంగుల జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటుంటే నీ బాధ ఏంటి ? ” గొణిగింది గాడిద

“మూడు రంగుల జెండా రెపరెపల మాటున నీకు ఇంకేదో కనపడడం అంటే నీ దృష్టి దోషమేమో..” కొంటెగా అన్నది కోతి

“నా దోషం కాదు మిత్రమా..
ఓ పక్క జనాన్ని సంబరాల్లో ముంచేసి, ప్రవచనాలు వల్లిస్తూ మెస్మరైజ్ చేసి జైల్లో ఉండాల్సిన నేరస్థులకు స్వతంత్రం ప్రకటించేసిన ఆజాదీ అమృతోత్సవ్… దేశ దౌర్భాగ్యం “బాధ, భయం వెళ్లగక్కింది కాకి

” వాళ్లెవరికో జైలు గోడల నుంచి ఆజాదీ ప్రసాదిస్తే నీ కొచ్చిన నొప్పి ఏంటో?
ఏం చేసినా ఆడిపోసుకోవడం.., అక్కసు వెళ్లగక్కడం ఫ్యాషన్ అయిపోయింది” కయ్యిమంది గాడిద.

కాకి, గాడిదల సంవాదం ఏంటో చెట్టుకింద ముచ్చట్లాడుతున్న మేకల జంట చెవిన పడి మౌనంగా వింటున్నాయి.

అంతలో ” మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించో నాకు బోధపడలేదు” అన్నది ఉడుత.
నాకూ తెలియలేదు అని జత కలిసింది చిలుక.

“మీకు అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోయి ఉండొచ్చు. మీరప్పటికి పుట్టారో లేదో .. ” అంటున్న కాకిని ఆపి

“మా పుట్టుక ఎప్పుడైతే ఏం లే.. ఆ సంగతి వదిలి అసలు విషయం చెప్పండి ” అన్నది ఉడుత

“గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో కి అప్పుడు 19 ఏళ్ళు . 2002 గోద్రా అల్లర్లు జరిగిన సమయం . ఆమెను 12 మంది సామూహిక అత్యాచారం చేసి ఆమె రెండేళ్ల కూతురితో పాటు 14 మంది బంధువులను చంపేశారు ” చెప్పింది కాకి

“నిజమా?! ” నివ్వెరపోయింది ఉడుత
“అయ్యో .. ఎంత అన్యాయం ” ఉలిక్కిపడి నొచ్చుకుంది చిలుక.

“ఇప్పటికే వాళ్ళు 14 ఏళ్ల శిక్ష అనుభవించారు. క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఒకరు ఆర్జీ పెట్టుకున్నాడు. ప్రభుత్వం విడుదల చేసింది. అందులో తప్పేముంది?
అసలు వాళ్ళు బ్రాహ్మణులు, సంస్కారవంతులు సత్ప్రవర్తనతో ఉన్నారు. విడుదల అయ్యారు” భుజాలెగరేస్తూ అన్నది గాడిద.

“మతి సుతి లేని మాటలు ఆపు.
కులం, మతం ఆధారంగా వాళ్ళ నేరాన్ని ఎలా అంచనా వేస్తావ్ ?
సవర్ణులు నీకు తెలుసో లేదో వాళ్ళు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. చట్టం శిక్ష విధించింది.
ఒక కులానికో, ఒక మతానికో చెందిన వాళ్ళు నేరస్థులు కాదని, మరో కులానికి, మతానికి చెందిన వాళ్ళు నేరస్థులని ఎలా చెప్పగలం?
కులానికి, మతానికి నేరస్థుల విడుదలకి సంబంధం ఏంటి? మన చట్టాల ప్రకారం చట్టం ముందు అందరు సమానం కదా. వాళ్ళని ప్రభుత్వం ఎట్లా విడుదల చేస్తుంది?
అసలు నేరం చేయని వాళ్ళు, చాలా చిన్న నేరం చేసిన వాళ్ళు నేరస్థులుగా జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతుంటే , తీవ్రమైన నేరం చేసిన వాళ్ళు బయటికి రావడం అన్యాయం కదా …?
పోనీ ఆ దోషులు తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా..? క్షమాపణ చెప్పారా..? లేదే అటువంటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఎలా కల్పిస్తారు?” అప్పటికే దోషుల విడుదల గురించి విని ఉన్న ఆడమేక ఆవేశంగా ప్రశ్నించింది

” 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో నేరస్థులకు సన్మానాలు చేస్తూ, సంబరాలు జరుపుకుంటున్నారంటే దేశ స్వాతంత్య్రం వెనక్కి నడుస్తున్నట్లుగా ఉన్నది ” ఆడమేక కేసి చూస్తూ అన్నది మగ మేక

” తమకో అండ దొరికిందని ఆ కులం వాళ్ళు నేరాలు చేస్తూ ఉంటే క్షమాభిక్షపెడుతూ పోతారా?” గాడిదకేసి చూస్తూ సూటిగా అడిగింది కోతి

” అసలు అంత తీవ్రమైన, ఘోరమైన నేరం ఎందుకు చేసి ఉంటారు?” చిలుక సందేహం

“ఆ అలా అడిగావు బాగుంది. చెబుతా ..
2002 ఫిబ్రవరి లో గుజరాత్ నుంచి వందల మంది కరసేవకులు అయోధ్య వెళ్లి అహ్మదాబాద్ తిరిగి రావడానికి సబర్మతి ఎక్స్ప్రెస్ ఎక్కారు.
గోద్రాలో రైలు ఆగినప్పుడు ముస్లిం మూకలు రైలుపై దాడి చేశాయి. కొన్ని భోగీలకు నిప్పు పెట్టాయి. 59 మంది చనిపోయారు.” చెప్తున్న గాడిదకు అడ్డు పడుతూ

“అవునా.. అయితే ఆ మూక చేసింది ఖచ్చితంగా తప్పే” అన్నది ఉడుత

“కరసేవకులపై దాడి విషయం తెలియగానే హిందూ మూకలు ఊరుకుంటాయా.. పెట్రేగిపోయాయి. ఉచ్ఛం నీచం మర్చిపోయాయి. విలువలకు తిలోదకాలిచ్చాయి. ముస్లింలపై దాడి చేసి చంపేశాయి. వారి ఇళ్లు ధ్వంసం చేసాయి. వారి మహిళలను చెరబట్టాయి.
ఆ సందర్భంలో వెయ్యి మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు. కానీ అంతకంటే చాలా ఎక్కువేనని అనుకుంటూ ఉంటారు.” గతంలో విన్న సంఘటనల తాలూకు విషయాలు గుర్తుకొస్తుండగా చెప్పింది కాకి

“అదిగో అప్పుడు బిల్కిస్ బానోపై 12 మంది సామూహిక అత్యాచారం చేసారు. ఆమె కుటుంబం పై కూడా దాడి జరిగింది . బిల్కిస్ బానో బతికి బయటపడింది కానీ మిగతా కుటుంబం అంతా ఆ దుర్మార్గానికి బలైంది. ఆమె రెండేళ్ల కూతురితో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. స్పృహ తప్పిన బిల్కిస్ బానో చనిపోయిందనుకుని వదిలేశారు.
ఆమె ఒక్కటేంటి ముస్లిం మహిళలెందరో బలయ్యారు. వారి కుటుంబాల్లో ప్రాణాలు కోల్పోయినవారు పోగా మిగిలిన వారు ప్రాణాలు అరచేత పట్టుకుని చెల్లాచెదురయ్యారు ” ఆనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ చెప్పింది కోతి.

“ఎంత దారుణం. మనుషులు చేసే పనేనా?
ముస్లిమ్స్ చేసిన తప్పుకు తగిన దండన ఉండాల్సిందే. అది విధించాల్సింది చట్టం, న్యాయ వ్యవస్థ. మతం కాదు కదా ..
ఒక మతం వాళ్ళు మరో మతంపై దాడి చేస్తుంటే రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నదా..?” ఆవేశపడింది చిలుక

“అహ్హహ్హా .. ఆనాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సంఘటనకు జవాబుదారు నేటి దేశనేత. ఎవరికర్ధమయినంత వారు అర్ధం చేసుకోండి ” చెంగున కింద కొమ్మకు దుంకుతూ చెప్పింది కోతి

“అయితే ఏంటట?” గుర్రున చూస్తూ గాడిద

“కులాన్ని బట్టి శిక్షలు వేస్తారా .. శిక్ష తీవ్రత ఉంటుందా ? ” తీక్షణంగా ఉడుత

“తీవ్ర నేరం చేసిన నేరస్థులు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా సభ్య సమాజంలో కి
నో ఎంట్రీ అనాల్సిన వాళ్ళు బాణాసంచా, మిఠాయిలతో స్వాగతించడం..
తిరగబడ్డ విలువలు .. తారుమారైన చిరునామాలు.. క్షేమమేనా?!
న్యాయ విచక్షణని, న్యాయ పరిధిని చీకటి గుహల్లోకి తోయడం సబబేనా ” గంభీరంగా అన్నది మగమేక.

“మేలిముసుగులు తొలిగిపోయాయి. కులం, మతం పై జరుగుతున్న దాడులు ఒక క్రమపద్ధతిలో జరిగినవే . ఆవేశంతో కాదు . అధికారం కోసం రాజకీయ కోణంలో చూడవలసినవే . ముందు ముందు మరింత పకడ్బందీగా కొనసాగడానికి సంకేతమేమో..” సాలోచనగా అన్నది ఆడమేక

“నేరానికి జరుగుతన్న సన్మానం .. ” ప్రశ్నార్ధకంగా ఆగింది చిలుక

“ఒకరకంగా చూస్తే అంతే అనుకోవాల్సి వస్తుంది.
2002 లో జరిగిన మారణ కాండని చరిత్ర నుండి ఎలా చెరిపేయగలరు
మహిళపై జరిగిన ఇటువంటి నేరాలకు క్షమాభిక్ష పెడితే . నేరాలు మరింత పెచ్చరిల్లిపోవా ? ఇటువంటి నేరాలు చేసిన దోషులు గుజరాత్ జైళ్లలో వీరేనా .. ఎందరో ఉన్నారు . వాళ్ళెవరికీ లేని క్షమాభిక్ష వీళ్లకు మాత్రమే ఎందుకు?” అన్నది కోతి

“పైకి మాములుగా కనిపిస్తున్న క్షమాభిక్ష వెనుక చాలా తంత్రం దాగిఉన్నట్లే ఉన్నది “అన్నది ఆడమేక

“అత్యాచారాలు, హత్యలు ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా.. జైలు నుండి కొత్తగా బయటికొస్తున్నారా .. కోడిగుడ్డు మీద ఈకలు రాడానికి ప్రయత్నించే మూక” ఏటో చూస్తూ గొణుక్కుంది గాడిద

“తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లకు క్షమాభిక్ష పేరుతో బయటికి తెచ్చి దండలేసి పండుగ జరుపుకుంటుంటే ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం ఉంటుందా ? న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటుందా?” అన్నది కాకి

“ఇంతకు ముందు ఏం చేసారో చేయలేదో కానీ ఇప్పుడు తమ సత్ప్రవర్తన తో విడుదలయ్యారు.. ” అంటున్న గాడిద మాటలు పట్టించుకోకుండా

“కాళ్ళకింద నేలను తవ్వేసే సమాజం ఎటుపోతుందో .. ” అన్నది ఉడుత

“మహిళలపట్ల అవలంబించే వైఖరి మార్చుకోవాలని ప్రధాని ఎర్రకోట నుంచి ఓ వైపు పిలుపు ఇస్తూ మరో వైపు అదే రోజు బిల్కిస్ బానో దోషులను జైలు నుంచి విడుదల చేయడం వెనుక ఉన్న ఈ నిర్ణయాన్ని సామజిక , రాజకీయ దృష్టితో పరిశీలించాల్సిందే ” ఆడమేక

“హంతకులు గ్రామానికి వచ్చిన సంతోషంతో బాణాసంచా కాల్చి సంబరాలతో సర్కస్ విన్యాసాలు చేస్తుంటే, బాధితులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో గ్రామం వదిలి పోతున్నారట . చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు , నేరస్థులు పండుగ జరుపుకుంటుంటే బాధితులు పిల్లి పిల్లల్ని చంకన పెట్టుకుని పోతున్నట్టు భయంతో ఒక్కోరోజు ఒక్కోచోట తలదాచుకుంటున్నారు.
భవిష్యత్ ఆవిరవుతుంటే ఆ కుటుంబాలకు ఎటువంటి భద్రత, నమ్మకం ఇవ్వగలరు? ” ప్రశ్నించింది మగమేక

“ఇంతవరకు భారత దేశ చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత నష్టపరిహారం ఇచ్చారు తెలుసా” అన్నది గాడిద

“ప్రభుత్వం ఇచ్చిన లేదా ఇస్తానన్న నష్టపరిహారంతో నేరం సమాధి అయిపోతుందా ?” అడిగింది ఉడుత

“ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకు మిత్రమా..
తప్పుని తప్పుగా చెప్పాలి. తప్పుని ఒప్పుగా చేయాలని చూడడం, ప్రోత్సహించడం మరింత తప్పు మాత్రమే కాదు దృష్టిలో సామజిక నేరం.
మంచి, చెడు విచక్షణ మరచి గుడ్డిగా సమర్థిస్తున్న, జేజేలు కొడుతున్న నీ లాంటి వాళ్ళ సమర్ధింపుల వల్ల కూడా సమాజం చాలా నష్టపోతోంది.
మంచి మనుషులు జీవితాలను ఫణంగా పెట్టి చేసిన త్యాగాలకు అర్ధం లేకుండా పోతున్నది. స్వతంత్ర దేశం గురించి కన్న కలలు కల్లలుగా మారిపోయే ప్రమాదపుటంచుల్లో ఉన్నది ఈ సమాజం” లోకసంచారం చేసే కాకి గాడిదను హెచ్చరించింది.

అసలు నేరం చేసారో లేదో తెలియకుండానే తెలుసుకోకుండానే దిశ కేసులో నిందితుల్ని ఎంకౌంటర్ చేసి పడేసారు. కులం తక్కువ వాళ్ళని వాళ్ళను దోషుల్ని చేసేసారు.
ఇప్పుడిక్కడ బిల్కిస్ బానో మతం .. అదే ఆమె హిందువైతే సామూహిక అత్యాచారం చేసింది ముస్లిం అయితే క్షమాభిక్ష దొరికేదా ..
శిక్ష, క్షమాభిక్ష నేరానికి , నేరస్తుడికా .. లేక మతానికి, కులానికా?
ఆలోచిస్తున్నకొద్దీ ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి?
క్షమాభిక్ష ఇస్తూ వచ్చిన తీర్పు ప్రభావం పొరలు పొరలుగా సమాజంపై పేరుకుపోయి తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఆలోచిస్తున్న ఆడమేక “నిజానికిది ఒక స్త్రీది, ఒక మతానిది, ఒక కులానిది కాదు. సమస్య. సమాజానిది.
మెలుకువలోనే అచేతనంగా చేస్తున్న చర్యల పట్ల ఇక మౌనం వహించడం ఏమాత్రం మంచిది కాదు ” అసంకల్పితంగా అన్నది ఆడమేక

” ప్రశ్నించిన గొంతులను ఇనుప ఊచల గోడలకు చుట్టాలను చేస్తుంటే.. ఏం చేస్తావ్…నువ్వేం చేస్తావ్?
బలవంతమైన సర్పం కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పవడం తప్ప ” నిస్సహాయంగా పలికింది కోతి

” మిత్రమా.. బలవంతమైన సర్పం చూసి భయపడడం, బాధ పడడం కాదు.
చీకటి కమ్ముకొస్తున్నది తెలిసి ఊరుకుంటామా.. చిరుదీపం వెలిగించి చీకటిని పారదోలడానికి ప్రయత్నిస్తాం కదా..
కులం పేరుతొ మతం పేరుతొ ఒక్కటవుతున్న సర్పాన్ని ఎదుర్కోవాలంటే మానవీయ స్వరాలన్నీ ఒకటవ్వాలి. నిరసనను బలంగా తెలియజేయాలి. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడుకుంటూ భారత రాజ్యాంగ విలువల్ని పటిష్టం చేసుకోడానికి అంతా ఏకం కావాలి.
హూ.. ఎంతటి బలవంతమైన సర్పం అయితేనేం ..
చలిచీమల చేత చిక్కిందంటే చచ్చిపోక తప్పదన్న విషయం మరచిపోకూడదు. “లోతుగా ఆలోచిస్తున్న ఆడమేక

“అవును,
లేదంటే అంతా చీకటే.. కటిక చీకటే..
అందుకే కదలాలి. కదిలించాలి” స్థిరంగా అన్నది మగమేక.
అవునన్నట్లు తలాడించాయి మిగతా జీవులన్నీ

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో